Telangana: జూబ్లిహిల్స్ బైపోల్ బీజేపీ అభ్యర్థిగా బొంతు రామ్మోహన్.. ప్రతిపాదించిన కీలక నేత
తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో BJPలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ అభ్యర్థి ఎంపిక విషయంలో చర్చలు జరుగుతున్న సమయంలో, MP అర్వింద్ బొంతు రామ్మోహన్ పేరును ప్రతిపాదించారు. ప్రస్తుతం పార్టీ అధిష్ఠానం, నాయకులు ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు కథనంలో..

తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై అన్ని ప్రధాన పార్టీలు గట్టిగా ఫోకస్ పెట్టాయి. BRS ముందే అభ్యర్థిని ప్రకటించి, ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తోంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వార్ రూమ్ ద్వారా తమ వ్యూహాలను సమగ్రంగా అమలు చేస్తుంది. కాంగ్రెస్ బుధవారం రాత్రి తన అభ్యర్థిని ఫైనల్ చేసింది. స్థానిక నేత, బీసీ వర్గానికి చెందిన నవీన్ యాదవ్‌ను బరిలోకి తీసుకువచ్చింది.
అయితే BJPలో అభ్యర్థి ఎవరనేది ఆసక్తికర అంశంగా మారింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు వ్యూహం ఎలా ఉంటుంది అన్నది ఇప్పడు సస్సెన్స్. అభ్యర్థి ఎంపిక కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి, పార్టీ శ్రేణుల అభిప్రాయాలను సేకరించారు. ప్రధానంగా కమిటీ పేర్కొన్న లిస్టులో చాలా పేర్లు ఉన్నప్పటికీ టాప్‌లో మాత్రం లంకల దీపక్ రెడ్డి, వీరపనేని పద్మ, కీర్తిరెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. మాదవీలత కూడా పార్టీ పెద్దలను కలిసి టికెట్ కేటాయించాలని కోరారు. శుక్రవారం రాష్ట్ర BJP అధిష్ఠానం అభ్యర్థిని ఫైనల్ చేస్తుదని సమాచారం. ఈ లోపులోనే మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న బొంతు రామ్మోహన్ పేరును.. ఎంపీ అర్వింద్ ప్రతిపాదించారు. రామ్మోహన్‌ను పార్టీలోకి తీసుకుని టికెట్ ఇవ్వాలని రాంచందర్‌రావుకు సూచించారు. బొంతుకు ABVP బ్యాక్‌గ్రౌండ్ ఉందని అర్వింద్ చెబుతున్నట్లు సమాచారం. మరి అర్వింద్ ప్రతిపాదనపై మిగిలిన పార్టీ నేతలు ఏమంటారు..? అనేది వేచి చూడాల్సి ఉంది. ఈ పరిణామం, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో BJP వ్యూహాలను ప్రభావితం చేస్తుందనే అంచనాలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి.
కాగా బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ నుంచి జూబ్లిహిల్స్ టికెట్ ఆశించారు. కానీ సీటును నవీన్ యాదవ్‌కు కేటాయించడంతో.. ఆయన బీజేపీ నుంచి ప్రయత్నాలు చేస్తున్నట్లు తాజా పరిణామాల ద్వారా అర్థమవుతుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




