AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: పాపం ఎంత కష్టమొచ్చిందో.. 13 ఏళ్ల కొడుకు ముందే తల్లి బలవన్మరణం.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన..

మద్యానికి బానిసైన భర్త, అనారోగ్యంతో బాధపడుతున్న కొడుకు, ఇంట్లో ఆర్థిక సమస్యలు ఇవన్నీ ఆ తల్లిని మానసికంగా కుంగదీశాయి. కనీసం కొడుకుకు వైద్యం కూడా చేయించలేకపోతున్నాననే తీవ్ర మనస్తాపానికి గురైన ఆ తల్లి సంచలన నిర్ణయం తీసుకుంది.13 కుమారుడి ఎదుటే బలవన్మరణానికి పాల్పడి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో వెలుగు చూసింది.

Hyderabad: పాపం ఎంత కష్టమొచ్చిందో.. 13 ఏళ్ల కొడుకు ముందే తల్లి బలవన్మరణం.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన..
Hyderavad News
Anand T
|

Updated on: Oct 09, 2025 | 5:12 PM

Share

మద్యానికి బానిసైన భర్త, అనారోగ్యంతో బాధపడుతున్న కొడుకు, ఇంట్లో ఆర్థిక సమస్యలు ఇవన్నీ ఆ తల్లిని మానసికంగా కుంగదీశాయి. కనీసం కొడుకుకు వైద్యం కూడా చేయించలేకపోతున్నాననే తీవ్ర మనస్తాపానికి గురైన ఆ తల్లి సంచలన నిర్ణయం తీసుకుంది.13 కుమారుడి ఎదుటే బలవన్మరణానికి పాల్పడి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. తన కళ్లముందే తల్లి ఉరివేసుకోవడం చూసిన ఆ బాలుడు గుండెలు పగిలేలా రోధించాడు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళ్తే… ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన నర్సింహ, సుధ అనే దంపతులు 15 ఏళ్ల క్రితం హైదరాబాద్‌ నగరానికి వలస వచ్చి ఎల్బీనగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. చిన్న బాబుకు 13 ఏళ్లు, పెద్దబాబుకు 15 ఏళ్లు. చిన్నబాబు బాల్యం నుంచే మదుమేహ వ్యాధితో బాధపడుతున్నారు. అయితే మేస్త్రీ పని చేస్తూ కుటుంబాన్ని నడుపుతున్న నర్సింహా కొన్నాళ్లు మద్యానికి బానిసై పనిచేయడం మానేశాడు. దీంతో అప్పటి నుంచి ఇళ్లలో పనిచేస్తూ సుధనే కుటుంబాన్ని నెట్టుకొస్తుంది.

ఆర్థిక సమస్యల కారణంగా చిన్న కుమారుడికి వైద్యం చేయించలేకపోతున్నానని సుధ చాలా సందర్భాల్లో పక్కింటి వాళ్లతో చెప్పి బాధపడేది. ఎలాగైనా డబ్బులు పొగు చేసి కుమారుడికి వైద్యం చేయించాలని ఆ తల్లి కలలు కనేది. ఇదిలా ఉండగా ఇటీవల పెద్దకుమారు పక్కింట్లో వస్తువులు చోరీ చేసి దొరికిపోయాడు.దీంతో ఆ ఇంటి యజమానికి మందలించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి సంచలన నిర్ణయం తీసుకుంది. పెద్ద కొడుకును బజారుకి పంపి.. ఇంట్లో ఉన్న చిన్న కొడుకు చూస్తుండగా ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

తల్లి ఉరివేసుకోవడం చూసిన 13 ఏళ్ల చిన్న కుమారుడు ఆమెను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. ఇంతలో ఇంటికి వచ్చిన పెద్ద కొడుకు వెంటనే స్థానికులను సహాయంతో తల్లి కిందకు దించి హాస్పిటల్‌కు తరలించాడు. కానీ అప్పటికే సుధ మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆ ఇద్దరు బాలురు కన్నీరు మున్నీరుగా విలపించారు. అటు తండ్రి పట్టించుకోక, ఇటు తల్లి లేక ఇప్పుడు ఆ ఇద్దరు బాలురు పరిస్థితి తలుచుకుంటే కన్నీళ్లు ఆగట్లేదు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..