సినిమా ఆఫర్స్ లేవు. ఇన్ స్టాలోనే కోట్లు సంపాదిస్తున్న హీరోయిన్..
Rajitha Chanti
Pic credit - Instagram
26 March 2026
ప్రస్తుతం సినీతారలు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటున్నారో చెప్పక్కర్లేదు. ముఖ్యంగా హీరోయిన్స్ నిత్యం ఏదోక పోస్ట్, గ్లామరస్ ఫోటోస్ షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు.
అయితే ఓ హీరోయిన్ మాత్రం సినిమాలకు దూరంగా ఉంటూ .. ఇన్ స్టాలోనే అత్యధికంగా సంపాదిస్తుంది. ఆ హీరోయిన్ మరెవరో కాదండి.. బాలీవుడ్ బ్యూటీ నేహా శర్మ.
ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్తగా ప్రారంభించిన పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా ప్రతి నెలా లక్షల రూపాయలు సంపాదిస్తోంది. నేహా శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో పెయిడ్ సబ్‌స్క్రిప్షన్‌ను ప్రారంభించింది.
నివేదికల ప్రకారం, ఆమె ఒక్కో సబ్‌స్క్రైబర్‌కు నెలకు రూ.290 వసూలు చేస్తుంది. అంటే ఇప్పటికే సుమారు 2,400 మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఆమె నెలవారీ ఆదాయం రూ.7 లక్షలకు పైగా ఉంటుందని అంచనా.
ఇన్‌స్టా పెయిడ్ సబ్‌స్క్రిప్షన్, సాధారణ ఫాలోయర్‌లకు కనిపించని ప్రత్యేకమైన ఫోటోలు, వీడియోలు, వ్యక్తిగత విషయాలు సహా ప్రత్యేకమైన కంటెంట్‌ను అందిస్తుంది. ఇది అభిమానులకు ఒక ప్రీమియం అనుభవాన్ని అందిస్తుంది.
నేహా శర్మ 2007లో వచ్చిన చిరుత సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. ఈ సినిమాతోనే రామ్ చరణ్ హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు. ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది
ఆ తర్వాత ఇమ్రాన్ హష్మీ నటించిన 'క్రూక్' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. నేహా శర్మ ఆస్తి విలువ సుమారు రూ.50 కోట్ల వరకు ఉంటుంది. ఒక్కో సినిమాకు దాదాపు రూ.1 కోటి తీసుకుంటుంది.
ఆమె ప్రకటనలు, సోషల్ మీడియా, తన సొంత ఫ్యాషన్ బ్రాండ్ ద్వారా కూడా సంపాదిస్తుంది. ఆమె సోదరి అయేషా శర్మ కూడా ఒక నటి మరియు జాన్ అబ్రహం నటించిన "సత్యమేవ జయతే" చిత్రంలో కనిపించింది.