ధురంధర్ 2 వల్ల ఇబ్బంది లేదు
అక్షయ్ కుమార్ తన కొత్త చిత్రం భూత్ బంగ్లాపై పూర్తి నమ్మకంతో ఉన్నారు, ధురంధర్ 2 బాక్సాఫీస్ ప్రభావాన్ని తన సినిమాపై ఉండదని స్పష్టం చేశారు. "ధురంధర్ 2"తో తమ చిత్రానికి సంబంధం లేదని పేర్కొన్నారు. కథకు ప్రాధాన్యతనిస్తూ కుటుంబమంతా కలిసి చూసేలా రూపొందించిన భూత్ బంగ్లా తప్పకుండా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అక్షయ్ కుమార్ ధురంధర్ 2 బాక్సాఫీస్ ప్రభావాన్ని పట్టించుకోవడం లేదు. దేశవ్యాప్తంగా ధురంధర్ 2 ఫీవర్ ఉన్నప్పటికీ, తన తాజా చిత్రం భూత్ బంగ్లాపై దాని ప్రభావం ఉండదని ఆయన అంటున్నారు. బాలీవుడ్‌లో “హిట్ మెషీన్”గా పేరు పొందిన అక్షయ్ కుమార్, మధ్యలో కెరీర్‌లో స్వల్పంగా తడబడినప్పటికీ, ఇప్పుడు మళ్లీ పూర్తి ఫామ్‌లోకి వస్తున్నాననే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అక్షయ్ కుమార్ కొత్త సినిమా భూత్ బంగ్లా ఏప్రిల్ 10న విడుదల కానుంది. “ధురంధర్ 2” ప్రభంజనం కొనసాగుతున్న తరుణంలో సినిమా విడుదల చేయడం రిస్క్‌తో కూడుకున్న వ్యవహారమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, “ధురంధర్ 2” సీక్వెల్‌తో తమ సినిమాకు ఎలాంటి సంబంధం లేదని అక్షయ్ స్పష్టం చేశారు. తాను కూడా “ధురంధర్ 2” చూశానని, పరిశ్రమలో రకరకాల సినిమాలు వస్తుంటాయని పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం :
ఇవీ మా కండీషన్లు..అమెరికాకు ఇరాన్ వార్నింగ్!
కంట తడి పెట్టించే ఏడు శునకాల కథ.. నెట్టింట వైరల్!
ఎల్పీజీ కొరత.. ఆటోడ్రైవర్ల వ్యథ
చచ్చిపోతున్నా.. దెయ్యమై నా కుటుంబాన్ని కాపాడుకుంటా!
ఛీ.. అంత లగ్జరీ షిప్లో ప్రయాణిస్తూ.. ఏంటి తల్లీ ఈ పాడుపని!
వర్క్ ఫ్రం హోమ్ కాదు..వర్క్ ఫ్రం ట్రాఫిక్!
ఇలా చేస్తే.. మీ పర్సుని ఎవరూ టచ్ కూడా చేయలేరు!
17 రోజుల మాతృవేదన.. ప్రపంచాన్ని కదిలించిన తల్లి తిమింగలం కథ!
డైనోసార్లను తుడిచిపెట్టిన గ్రహశకలం..
ప్లాట్‌ఫామ్‌పై ఉన్న బస్సును ఎత్తుకెళ్లిన దొంగ.. చివరికి ఇలా..

