ఎల్పీజీ కొరత.. ఆటోడ్రైవర్ల వ్యథ
పశ్చిమాసియా యుద్ధ ప్రభావం భాగ్యనగరంలోని ఆటో డ్రైవర్లపైనా పడింది. పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు పడుతున్న ఇబ్బందులు ఒకెత్తయితే, ఆటోలకు అత్యంత కీలకమైన లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ కోసం డ్రైవర్లు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. నగరంలోని లక్డీకాపూల్ చౌరస్తా వద్ద ఉన్న ప్రైవేటు గ్యాస్ స్టేషన్ల వద్ద మంగళవారం కిలోమీటర్ల మేర ఆటోలు బారులు తీరడం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది.
యుద్ధం నేపథ్యంలో గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్న ఆందోళనతో గ్యాస్ స్టేషన్ల వద్ద భారీ రద్దీ నెలకొంది. అయితే, స్టేషన్ నిర్వాహకులు ఒక్కో ఆటోకు కేవలం 500 రూపాయల విలువైన గ్యాస్ మాత్రమే ఇస్తుండటంతో డ్రైవర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. 500 రూపాయల గ్యాస్ కొట్టిస్తే అది ఒకటి రెండు రోజులకు కూడా సరిపోవట్లేదని, మళ్లీ గంటల తరబడి లైన్లలో పడిగాపులు కాయాల్సి వస్తోందని, పనులు మానుకొని బంకులవద్ద పడిగాపులు కాయాల్సి వస్తోందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Follow Us
వైరల్ వీడియోలు
యువకుడిని పెళ్లాడిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు!
బంధువుల మెప్పు కోసం అంత ఖర్చు అవసరమా!
ఇండియా పోస్ట్ పేరుతో కొత్త సైబర్ మోసం
చచ్చిపోతున్నా.. దెయ్యమై నా కుటుంబాన్ని కాపాడుకుంటా!
ఛీ.. అంత లగ్జరీ షిప్లో ప్రయాణిస్తూ.. ఏంటి తల్లీ ఈ పాడుపని!
వర్క్ ఫ్రం హోమ్ కాదు..వర్క్ ఫ్రం ట్రాఫిక్!
ఇలా చేస్తే.. మీ పర్సుని ఎవరూ టచ్ కూడా చేయలేరు!

