AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anushka Shetty : ఆ హీరో నాకు చాలా స్పెషల్.. అతడే నాకు గాడ్ ఫాదర్.. నా జీవితాన్ని మార్చేశాడు.. అనుష్క కామెంట్స్..

అనుష్క శెట్టి తన సినీ రంగ ప్రవేశం గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ద్వారా తనకు సినిమా అవకాశం లభించినట్లు తెలిపారు. అయితే సినిమా రంగం గురించి ఎటువంటి అవగాహన లేకపోవడం, తన సిగ్గు స్వభావం కారణంగా పూరి జగన్నాథ్‌ను కలవడానికి మొదట సంశయించారు. ఆయనను కలిసినప్పుడు పోర్ట్‌ఫోలియోకు బదులు పాస్‌పోర్ట్ సైజు ఫోటో ఇచ్చారు. తన తొలి ఆడిషన్‌లో మేకప్, ఫోటోషూట్‌ల గురించి తెలీక, చిన్-అప్ అనే పదంపై గందరగోళానికి గురయ్యారు.

Rajitha Chanti
|

Updated on: Mar 26, 2026 | 9:24 PM

Share
ప్రముఖ నటి అనుష్క శెట్టి తన కెరీర్ ప్రారంభ దశ, సినీ రంగ ప్రవేశం వెనుక ఉన్న అనుభవాలను వెల్లడించారు. సినిమా రంగంలో తన తొలి అవకాశం పూరి జగన్నాథ్ గారి ద్వారా వచ్చిందని, అయితే తనకు అండగా నిలిచి, నమ్మకంతో అవకాశం ఇచ్చిన నాగార్జున తనకు ఎప్పటికీ వెరీ స్పెషల్ అని అనుష్క భావోద్వేగంగా తెలిపారు. అనుష్క శెట్టి తన యోగా గురువు భరత్ ద్వారా, అలాగే దర్శకుడు ఇ. నివాస్ భార్య ద్వారా పూరి జగన్నాథ్‌ను కలవమని సలహా పొందారు.

1 / 5
అయితే, సినిమా గురించి ఎటువంటి అవగాహన లేకపోవడం, తన సిగ్గు స్వభావం కారణంగా పూరి జగన్నాథ్‌ను కలవడానికి మొదట వెనుకాడారు. తాను అబద్ధం చెప్పి కాల్ చేయకుండా తప్పించుకున్నానని ఆమె గుర్తు చేసుకున్నారు. చివరికి, స్నేహితుల ప్రోద్బలంతో పూరి జగన్నాథ్‌ను కలిసినప్పుడు, తన వద్ద పోర్ట్‌ఫోలియో లేదని, కేవలం ఒక పాస్‌పోర్ట్ సైజు ఫోటో మాత్రమే ఇచ్చానని ఆమె వివరించారు. పూరి జగన్నాథ్ ఆ ఫోటోను చూసి, తనను చూసి చిరునవ్వి, "కాల్ చేస్తాను" అని చెప్పి వెళ్లారని అనుష్క తెలిపారు.

2 / 5
తర్వాతి రోజు హైదరాబాద్ వచ్చి ఆడిషన్ ఇవ్వమని పిలిచారు. అయితే తనకు యోగా క్లాసులు ఉన్నందున, వెంటనే రాలేక శుక్రవారం వస్తానని చెప్పడంతో, అది దురహంకారంగా భావిస్తారేమోనని ఒక స్నేహితురాలు సూచించారు. ఇది తనకు తెలియదని, తన బాధ్యతగా మాత్రమే భావించానని అనుష్క అన్నారు. గురువారం సాయంత్రం మళ్లీ పూరి జగన్నాథ్ ఫోన్ చేసి, క్లాసులు అయిపోయాక రమ్మనడంతో తాను హైదరాబాద్‌కు బయలుదేరారు.

3 / 5
హైదరాబాద్‌లో మాస్ సినిమా షూటింగ్ జరుగుతున్న సెట్‌లో నాగార్జున సమక్షంలో ఆడిషన్ జరిగింది. ఒక Miss India పోటీదారురాలు, పర్మీత్ ఠాకూర్‌తో పాటు అనుష్క కూడా ఆడిషన్‌కు వచ్చారు. మేకప్ టెస్ట్ సమయంలో మేకప్ ఆర్టిస్ట్ "మస్కారా పెట్టనా? షాడో పెట్టనా?" అని అడిగితే, "ఏదైనా చేయండి" అని బదులిచ్చానని అనుష్క నవ్వారు. ఫోటోషూట్ సమయంలో సంగీతం, ఫ్యాన్ పెట్టుకుని చాలా అందంగా పోజులిచ్చిన పర్మీత్ ఠాకూర్‌ను చూసి, తనకు ఏడుపు వచ్చిందని, "నా వల్ల ఇది కాదు" అని వెళ్ళిపోదామని అనుకున్నానని అనుష్క వివరించారు.

4 / 5
నాగార్జున తీసుకున్న ఆ నిర్ణయం తన జీవితాన్ని మార్చిందని, ఆయన ఒక గాడ్ ఫాదర్ అని, ఆయన చొరవ లేకపోతే తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదని అనుష్క కృతజ్ఞతలు తెలిపారు. పూరి జగన్నాథ్, నాగార్జున, సుప్రియ, అన్నపూర్ణ స్టూడియోస్ బృందం అంతా ఒక చిన్న పిల్లవాడికి చేయి పట్టుకుని అన్నీ నేర్పించినట్టుగా తనకు మార్గనిర్దేశం చేశారని ఆమె అన్నారు. నాగార్జున కూడా యోగా చేస్తారని, ఆయనకు అప్పుడప్పుడు స్ట్రెచింగ్స్‌లో సహాయపడేదాన్నని, అమల కూడా యోగా చేస్తారని అనుష్క పంచుకున్నారు. 2004 డిసెంబర్‌లో హైదరాబాద్ వచ్చి, సినిమా వాతావరణానికి అలవాటు పడేందుకు అక్కడే ఉండిపోయానని, డాన్స్ టీచర్ వద్ద శిక్షణ తీసుకుంటూ, అయేషా టాకియా షూటింగ్‌కు అసిస్టెంట్‌గా వ్యవహరించానని తెలిపారు.

5 / 5
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర