యాక్సిడెంట్‏తో సినిమాలకు దూరం.. ఇప్పుడు పలుచని చీరలో గ్లామర్ అరాచకం

Rajitha Chanti

Pic credit - Instagram

26 March 2026

టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇందుకోసం ఈ ముద్దుగుమ్మ గట్టిగానే ప్లాన్ చేసినట్లు తెలిస్తోంది. తాజాగా ఈ అమ్మడు పేరు తెగ వినిపిస్తోంది. 

యాక్సిడెంట్ కారణంగా సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ప్రస్తుతం సినిమాలతో ఈ అమ్మడు బిజీగా ఉంది.

ఓవైపు సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు.. ఇప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ పవర్ చూపిస్తుంది. తాజాగా పలుచని చీరలో నభా షేర్ చేసిన ఈ ఫోటోస్ కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.

నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి చూపులోనే కుర్రాళ్ల మనసు దోచుకుంది. తర్వాత పూరి తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఆమె కెరీర్ మార్చేసింది.

ఈ సినిమాలో గ్లామర్, నటనతో ఊహించని పాపులారిటీని సొంతం చేసుకుంది. అయితే దురదృష్టవశాత్తూ ఒక భారీ ప్రమాదానికి గురికావడంతో రెండేళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది.

కానీ పట్టుదలతో మళ్లీ కోలుకుని ఇప్పుడు మునుపటి కంటే రెట్టింపు ఉత్సాహంతో అడియన్స్ ముందుకు వస్తుంది. కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు వరుస సినిమాలతో అలరించేందుకు రెడీ అయ్యింది.

ప్రస్తుతం ఆమె నిఖిల్ సరసన స్వయంభూ చిత్రంలో నటిస్తుంది. అలాగే మరొకటి నాగబంధం చిత్రం. ఈ రెండు సినిమాలను భారీ బడ్జెట్‌తో, విభిన్న కథాంశాలతో రూపొందిస్తున్నారు మేకర్స్.

స్వయంభూ సినిమా ఏప్రిల్ 10న విడుదలకు సిద్ధంగా ఉండగా.. ప్రమోషన్స్ చేస్తుంది. మరోవైపు ఈ అమ్మడు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.