AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prasar Bharati Jobs 2025: డిగ్రీ అర్హతతో ప్రసార్‌ భారతిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఎంపికైతే నెలకు రూ.80 వేల జీతం

దేశంలోని వివిధ భ్రాంచుల్లోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద హైదరాబాద్‌ సహా రాంచీ, చెన్నై, బెంగళూరు, ముంబై, సిమ్లా నగరాల్లో మొత్తం 59 సీనియర్ కరస్పాండెంట్‌, యాంకర్‌ కమ్ కరస్పాండెంట్‌ ఇంకా..

Prasar Bharati Jobs 2025: డిగ్రీ అర్హతతో ప్రసార్‌ భారతిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఎంపికైతే నెలకు రూ.80 వేల జీతం
Prasar Bharati Jobs
Srilakshmi C
|

Updated on: Oct 09, 2025 | 10:41 AM

Share

ప్రసార్‌ భారతి.. దేశంలోని వివిధ భ్రాంచుల్లోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద హైదరాబాద్‌ సహా రాంచీ, చెన్నై, బెంగళూరు, ముంబై, సిమ్లా నగరాల్లో మొత్తం 59 సీనియర్ కరస్పాండెంట్‌, యాంకర్‌ కమ్ కరస్పాండెంట్‌ గ్రేడ్‌-2, బులిటెన్‌ ఎడిటర్‌, బ్రాడ్‌ కాస్ట్‌ ఎగ్జిక్యూటివ్‌, వీడియో పోస్ట్‌ ప్రొడక్షన్ అసిస్టెంట్, అసైన్‌మెంట్ కో-ఆర్డినేటర్‌ తదితర పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్‌ 21, 2025వ తేదీలోపు ఆన్‌లైన్‌లో విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు ఇవే..

  • సీనియర్ కరస్పాండెంట్‌ పోస్టుల సంఖ్య: 2
  • యాంకర్‌ కమ్ కరస్పాండెంట్‌ గ్రేడ్‌-2 పోస్టుల సంఖ్య: 7
  • యాంకర్‌ కమ్‌ కరస్పాండెంట్‌ గ్రేడ్‌-3 పోస్టుల సంఖ్య: 10
  • బులిటెన్‌ ఎడిటర్‌ పోస్టుల సంఖ్య: 4
  • బ్రాడ్‌ కాస్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల సంఖ్య: 4
  • వీడియో పోస్ట్‌ ప్రొడక్షన్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య: 2
  • అసైన్‌మెంట్ కో-ఆర్డినేటర్‌ పోస్టుల సంఖ్య: 3
  • కంటెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల సంఖ్య: 8
  • కాపీ ఎడిటర్‌ పోస్టుల సంఖ్య: 7
  • కాపీ రైటర్‌ పోస్టుల సంఖ్య: 1
  • ప్యాకింగ్‌ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య: 6
  • వీడియోగ్రాఫర్‌ పోస్టుల సంఖ్య: 5

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా పీజీ లేదా జర్నలిజం డిప్లొమాలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. సంబంధిత పోస్టును బట్టి అభ్యర్ధుల వయోపరిమితి 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్ 21, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.25,000 నుంచి రూ.80,000 వరకు జీతంగా చెల్లిస్తారు.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం