పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం నయా గ్రామంలో గిరిజనులు రోడ్డు సౌకర్యం కోసం వినూత్నంగా నిరసన తెలిపారు. ఒంటికి ఆకులు చుట్టుకుని, పవన్ ఫోటోలు పట్టుకుని, డోలీలు మోస్తూ ఆందోళన చేపట్టారు. అటవీ శాఖ అడ్డంకుల వల్ల పనులు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తూ, తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.