AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇరాన్‌కు అండగా యుద్ధ రంగంలోకి రష్యా? ఇక మూడో వరల్డ్‌ వార్‌ 3 వచ్చేసినట్టేనా?

పాశ్చాత్య నిఘా సంస్థల నివేదికల ప్రకారం, పశ్చిమ ఆసియా ఘర్షణల మధ్య రష్యా రహస్యంగా ఇరాన్‌కు డ్రోన్‌లు, ఆయుధాలు సరఫరా చేస్తోందని ఆరోపణలున్నాయి. ఇది ఇరాన్‌కు రష్యా అందిస్తున్న తొలి ప్రత్యక్ష సైనిక సహాయం కానుంది. రష్యా ఈ ఆరోపణలను ఖండించినా, మానవతా సహాయాన్ని ధృవీకరించింది.

ఇరాన్‌కు అండగా యుద్ధ రంగంలోకి రష్యా? ఇక మూడో వరల్డ్‌ వార్‌ 3 వచ్చేసినట్టేనా?
Russia Iran
SN Pasha
|

Updated on: Mar 26, 2026 | 10:04 PM

Share

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఘర్షణల మధ్య రష్యా, ఇరాన్‌కు రహస్యంగా డ్రోన్‌లు, ఆయుధాలు, మందులు, ఆహార సరఫరాలు పంపుతోందని పాశ్చాత్య నిఘా సంస్థలు ఆరోపించాయి. ఈ నివేదికలు నిజమైతే ప్రస్తుత సంఘర్షణలో ఇరాన్‌కు రష్యా నేరుగా సైనిక సహాయం అందించడం ఇదే మొదటిసారి అవుతుంది. నివేదికల ప్రకారం ఫిబ్రవరి చివరలో టెహ్రాన్‌పై దాడుల అనంతరం, డ్రోన్‌ల బదిలీపై ఇరు దేశాల ఉన్నతాధికారుల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ సరఫరాలు దశలవారీగా మార్చి నెలలో ప్రారంభమై, నెలాఖరుకు పూర్తి కావచ్చని అంచనా. ఇప్పటికే ఉపగ్రహ డేటా, లక్ష్య నిర్ధారణ వంటి నిఘా సహాయం అందించిన రష్యా, ఇప్పుడు మరింత ముందుకు వెళ్లిందని ఆరోపణలు సూచిస్తున్నాయి.

అయితే ఈ ఆరోపణలను రష్యా ఖండించింది. క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్, ఇవి నకిలీ వార్తలు అని పేర్కొన్నారు. ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నాయనే విషయాన్ని అంగీకరించినప్పటికీ, సైనిక సరఫరాల అంశాన్ని పూర్తిగా తిరస్కరించారు. ఇదిలా ఉండగా రష్యా మానవతా సహాయం అందిస్తున్నట్లు ధృవీకరించింది. అజర్‌బైజాన్ మార్గంగా 20 మిలియన్ డాలర్ల విలువైన వైద్య సామాగ్రిని పంపినట్లు తెలిపింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి సహాయాన్ని కొనసాగిస్తామని పేర్కొంది.

ప్రస్తుతం జరుగుతున్న ఈ సంఘర్షణలో ఇరాన్ డ్రోన్ వినియోగం కీలకంగా మారింది. తక్కువ ఖర్చుతో భారీ స్థాయిలో ఉత్పత్తి చేయగల ఈ డ్రోన్‌లు యుద్ధ వ్యూహాన్ని మార్చుతున్నాయి. మరోవైపు స్ట్రెయిట్‌ ఆఫ్‌ హార్ముజ్‌ వద్ద అంతరాయం కారణంగా ప్రపంచ చమురు సరఫరాలు దెబ్బతినడం, రష్యా చమురుకు డిమాండ్ పెరగడం వంటి పరోక్ష లాభాలు మాస్కోకు కలుగుతున్నాయి. ఇరాన్ రష్యా నుండి ఆధునిక వాయు రక్షణ వ్యవస్థలను కూడా కోరుతున్నట్లు సమాచారం. అయితే ఎస్-400 వంటి కీలక వ్యవస్థల సరఫరాపై ఇంకా స్పష్టత లేదు. మొత్తంగా ఈ పరిణామాలు పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది. రష్యా పాత్ర స్పష్టమైతే, ఈ సంఘర్షణ అంతర్జాతీయ స్థాయిలో మరింత విస్తరించే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
ఈ రెండు తప్పులు చేస్తున్నారా..? మీ పీఎఫ్ వడ్డీ ఆగిపోయే ప్రమాదం
ఈ రెండు తప్పులు చేస్తున్నారా..? మీ పీఎఫ్ వడ్డీ ఆగిపోయే ప్రమాదం
అస్సలు డౌట్ రాకుండా ఐఫోన్ కొట్టేసిన యువతి!
అస్సలు డౌట్ రాకుండా ఐఫోన్ కొట్టేసిన యువతి!
'IIT చదివి కలెక్టర్ అవుతానన్నావ్ కదా తల్లీ.. ఒంటరి వాడిని చేశావ్'
'IIT చదివి కలెక్టర్ అవుతానన్నావ్ కదా తల్లీ.. ఒంటరి వాడిని చేశావ్'
హమ్మయ్య ఎట్టకేలకు దిగొచ్చాయి! తగ్గిన కూరగాయల ధరలు..
హమ్మయ్య ఎట్టకేలకు దిగొచ్చాయి! తగ్గిన కూరగాయల ధరలు..
పాములు దేన్ని చూసి ఎక్కువగా భయపడతాయో తెలిస్తే షాకవుతారు..
పాములు దేన్ని చూసి ఎక్కువగా భయపడతాయో తెలిస్తే షాకవుతారు..
తెలంగాణ MBBS, BDS ప్రవేశాలకు NEET కౌన్సెలింగ్ 2026 నోటిఫికేషన్
తెలంగాణ MBBS, BDS ప్రవేశాలకు NEET కౌన్సెలింగ్ 2026 నోటిఫికేషన్
అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్
అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్
పాత బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేస్తున్నారా..? ఇలా చేస్తే మీకే నష్టం
పాత బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేస్తున్నారా..? ఇలా చేస్తే మీకే నష్టం
బైక్ రేసింగ్‌లో దుమ్మురేపిన టీమిండియా లెజెండరీ క్రికెటర్
బైక్ రేసింగ్‌లో దుమ్మురేపిన టీమిండియా లెజెండరీ క్రికెటర్
పక్కనే ఉన్నవారిని వదిలేసి మిమ్మల్నే దోమలు ఎందుకు కుడతాయో తెలుసా?
పక్కనే ఉన్నవారిని వదిలేసి మిమ్మల్నే దోమలు ఎందుకు కుడతాయో తెలుసా?
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!