నేషనల్ లెవల్‌లో హాట్ టాపిక్‌గా మారిన బాలీవుడ్ తీరు
"దురందర్ ది రివెంజ్" ఘన విజయం సాధించినప్పటికీ, బాలీవుడ్ ప్రముఖులు ఈ విజయాన్ని పట్టించుకోవడం లేదు. సౌత్ సినిమాల ప్రభావాన్ని అధిగమించి భారీ వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమాపై బాలీవుడ్ స్టార్స్ స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు బాలీవుడ్ అంతర్గత రాజకీయాలు కారణమని విశ్లేషకులు అంటున్నారు.
బాలీవుడ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విజయం “దురందర్ ది రివెంజ్” రూపంలో వచ్చింది. ఈ చిత్రం సౌత్ సినిమా డామినేషన్‌ను అధిగమించి వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. జాతీయ స్థాయిలో ప్రస్తుతం “దురందర్” మానియా స్పష్టంగా కనిపిస్తోంది. సీక్వెల్ రూపంలో వచ్చిన ఈ సినిమా నేషనల్ బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేస్తూ, బాలీవుడ్‌కు పూర్వవైభవం తీసుకు వస్తుందనే ఆశలను కలిగిస్తోంది. ఇంతటి ఘన విజయం సాధించినప్పటికీ, బాలీవుడ్ స్టార్స్ మాత్రం ఈ సక్సెస్‌ను ఓన్ చేసుకోవడం లేదు. “దురందర్ 2” బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపుతున్నా, కనీసం ఒక్క ట్వీట్ చేసేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదు. ఇతర ఇండస్ట్రీల నుంచి ప్రశంసలు వస్తున్నా, సొంత ఇండస్ట్రీ వాళ్లు కనీసం మద్దతు ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు బాలీవుడ్‌లోని రాజకీయాలే కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఖాన్స్ డామినేషన్‌కు చెక్ పడడం, సీనియర్ల సినిమాలు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ఓ యంగ్ హీరో విజయానికి వారు జీర్ణించుకోలేకపోతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం :
ఇవీ మా కండీషన్లు..అమెరికాకు ఇరాన్ వార్నింగ్!
కంట తడి పెట్టించే ఏడు శునకాల కథ.. నెట్టింట వైరల్!
ఎల్పీజీ కొరత.. ఆటోడ్రైవర్ల వ్యథ
సోషల్ మీడియా అద్భుతం.. 15 ఏళ్ల తర్వాత కన్నవారి చెంతకు
పెన్షన్ కోసం 90 ఏళ్ల అత్తను వీపుపై 9 కి.మీ. మోసుకెళ్లిన కోడలు
పొలం చదును చేస్తుండగా అద్భుతం..అమితానందంలో రైతు!
నీటి కోసం బస్సును ఆపిన కోతి.. మూగజీవాల వీడియో వైరల్
60 లీటర్ల తల్లిపాలు దానం చేసిన జ్వాల!
ఫోర్జరీ పత్రాలతో జైలు నుంచి దర్జాగా రిలీజైన జీవిత ఖైదీ..
గుడిలోకి వెళ్లి భక్తితో దణ్ణం పెట్టాడు.. ఆ తర్వాత..!

