Telangana: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల.. కాంగ్రెస్ నుంచి పోటీలో కీలక నేత..

వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ ఈ నెల 9 వరకూ కొనసాగనుంది. ఈ నెల13 తేది వరకూ నామినేషన్ల ఉప సంహరణ గడువు ఉండగా, ఈ నెల 27న పోలింగ్ నిర్వహించనున్నారు. జూన్ 5న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుంది. 2021లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. అయితే గతేడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు.

Telangana: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల.. కాంగ్రెస్ నుంచి పోటీలో కీలక నేత..
Telangana Elections
Follow us

| Edited By: Srikar T

Updated on: May 02, 2024 | 7:09 PM

వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ ఈ నెల 9 వరకూ కొనసాగనుంది. ఈ నెల13 తేది వరకూ నామినేషన్ల ఉప సంహరణ గడువు ఉండగా, ఈ నెల 27న పోలింగ్ నిర్వహించనున్నారు. జూన్ 5న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుంది. 2021లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. అయితే గతేడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. 2021 మార్చిలో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నిక కాగా, 2027, మార్చి వరకూ ఎమ్మెల్సీ పదవీకాలం ఉంది. పల్లా రాజేశ్వర్ రెడ్డి డిసెంబర్ 9న రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఆరు నెలల్లోగా ఉప ఎన్నిక నిర్వహించాలన్న నిబంధనలు ఉన్నాయి. దీంతో ఎన్నికల సంఘం ఈ ఉప ఎన్నిక షెడ్యూల్‎ను ప్రకటించింది.

పట్టభద్రుల ఓటర్లు ఎంతమందంటే.?

ఈ పట్టభద్రుల నియోజకవర్గం ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో విస్తరించి ఉంది. మూడు ఉమ్మడి జిల్లాల్లోని 12 జిల్లాల్లో 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకొన్నారు. వీరిలో 2,87,007 మంది పురుషులు, 1,74,794 మంది మహిళలు, ఇతరులు ఉన్నారు. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నల్గొండ జిల్లా కలెక్టర్ హరి చందన వ్యవహరిస్తారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నల్లగొండ జిల్లా కలెక్టరేట్ లో నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుంది.

కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న..

ఈ పట్టభద్రుల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ బరిలో నిలవనున్నారు. ఈ మేరకు తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. 2021 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న మల్లన్న గణనీయమైన ఓట్లను సాధించి రెండో స్థానంలో నిలిచారు. ఈసారి ఆయన కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. ఇటీవల కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్‎ను తీన్మార్ మల్లన్న ఆశించారు. కాంగ్రెస్ అధిష్టానం మాత్రం వెలిచాల రాజేందర్ రావును అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో మల్లన్నను ఎమ్మెల్సీగా నిలబెట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.

ఇవి కూడా చదవండి

ఇంకా అభ్యర్థులను ప్రకటించని బిజెపి బీఆర్ఎస్‎లు..

వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయగా, తొలి రోజు ముగ్గురు ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. అయితే ప్రధాన పార్టీలైన బిజెపి, బీఆర్ఎస్‎లు ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై బిఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. బీఆర్ఎస్ మూడు, నాలుగు రోజుల్లో తమ అభ్యర్థిని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బిజెపి కూడా అభ్యర్థిని ఖరారు చేసే ప్రయత్నాల్లో ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..