Lok Sabha Election: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ లేని జనసేన.. బ్యాలెట్ పేపర్‌లో గాజు గ్లాస్ సింబల్..!

తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల ఎన్నికల నిర్వహణకు అంతా సిద్ధం చేసుకున్నామని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ అన్నారు. కట్టుదిట్టమైన భద్రతతో నడుమ పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు. ఎన్నికల విధుల్లో 150 కంపెనీల కేంద్ర బలగాలు పాల్గొంటారని తెలిపారు.

Lok Sabha Election: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ లేని జనసేన.. బ్యాలెట్ పేపర్‌లో గాజు గ్లాస్ సింబల్..!
Janasena Glass Symbol
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: May 02, 2024 | 12:26 PM

తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల ఎన్నికల నిర్వహణకు అంతా సిద్ధం చేసుకున్నామని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ అన్నారు. కట్టుదిట్టమైన భద్రతతో నడుమ పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు. ఎన్నికల విధుల్లో 150 కంపెనీల కేంద్ర బలగాలు పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 3,32,32,318 మంది ఓటర్లు ఉన్నారని, ఓటు వేసే సమయంలో సమ్మర్ దృష్ట్యా అనేక చర్యలు తీసుకున్నామని అన్నారు. అయితే ప్రతి ఒక్క ఓటరు విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా 17 నియోజకవర్గాలకు సంబంధించి 35,809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు. అందులో 2,79,519 మంది సిబ్బంది విధుల్లో ఉంటారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా హోమ్ ఓటింగ్ ప్రారంభమైందన్నారు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోందని, ప్రజలందరూ అధిక సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొనాలని అధికారులు సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా 17 నియోజకవర్గాలకు సంబంధించి మొత్తంగా 525 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని ఎన్నికల సంఘం తెలిపింది. ఇందులో రిజిస్టర్, రికగ్నైజ్డ్ పార్టీల నుండి 240 మంది అభ్యర్థులు ఉండగా, 285 మంది అభ్యర్థులు ఇండిపెండెంట్లుగా పోటీలో నిలిచారు. ఈ 285 మంది స్వతంత్ర అభ్యర్థుల కోసం 190 ఫ్రీ సింబల్స్ ఉన్నాయని, అందులో నామినేషన్ సమయంలో అభ్యర్థి మూడు ఫ్రీ సింబల్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. అందులో ఏదో ఒక సింబల్‌ను ఎన్నికల అధికారులు కేటాయిస్తారని అధికారులు తెలిపారు. ఇందులో భాగంగానే కొందరు స్వతంత్ర అభ్యర్థులకు జనసేన్ పార్టీ గుర్తు అయ్యిన గాజు గ్లాసును ఎన్నికల అధికారులు కేటాయించారు. తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేయకున్నా, ఆపార్టీ సింబల్‌పై పలువురు అభ్యర్థులు బరిలోకి దిగడం విశేషం..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles