ఆదిలాబాద్ బాద్ షా ఎవరు.. ఆదివాసీలు పట్టం కట్టేదెవరికి.. ఆందరి చూపూ ఆ సామాజిక వర్గం వైపే..

అడవుల జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. పోటాపోటీ ప్రచారంతో ముచ్చటగా మూడు పార్టీలు సుడిగాలి పర్యటనలు చేస్తుండటంతో త్రిముఖ పోరు తప్పదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సిట్టింగ్ సీటును కాపాడుకునేందుకు బీజేపీ, గెలిచి నిలిచేందుకు బీఆర్ఎస్ , కొత్త ఆశలతో కాంగ్రెస్.. ముచ్చటగా మూడు పార్టీలు సై అంటే సై అంటూ దూసుకుపోతున్నాయి. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఆ రెండు సామాజిక వర్గాల ఆశీస్సులు గంప గుత్తగా దక్కితేనే విజయం సొంతమవుతుందన్న నేపథ్యంలో ఆ రెండు వర్గాల మద్దతు‌కోసం మూడు ప్రధాన పార్టీలు విశ్వప్రయత్నాలే చేస్తున్నాయి.

ఆదిలాబాద్ బాద్ షా ఎవరు.. ఆదివాసీలు పట్టం కట్టేదెవరికి.. ఆందరి చూపూ ఆ సామాజిక వర్గం వైపే..
Brs Bjp Congress
Follow us

| Edited By: Srikar T

Updated on: May 02, 2024 | 3:31 PM

అడవుల జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. పోటాపోటీ ప్రచారంతో ముచ్చటగా మూడు పార్టీలు సుడిగాలి పర్యటనలు చేస్తుండటంతో త్రిముఖ పోరు తప్పదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సిట్టింగ్ సీటును కాపాడుకునేందుకు బీజేపీ, గెలిచి నిలిచేందుకు బీఆర్ఎస్ , కొత్త ఆశలతో కాంగ్రెస్.. ముచ్చటగా మూడు పార్టీలు సై అంటే సై అంటూ దూసుకుపోతున్నాయి. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఆ రెండు సామాజిక వర్గాల ఆశీస్సులు గంప గుత్తగా దక్కితేనే విజయం సొంతమవుతుందన్న నేపథ్యంలో ఆ రెండు వర్గాల మద్దతు‌కోసం మూడు ప్రధాన పార్టీలు విశ్వప్రయత్నాలే చేస్తున్నాయి. ఇంతకీ ఆదివాసీల ఖిల్లా ఆదిలాబాద్ లో అభ్యర్థుల తలరాతలు మార్చే ఆ రెండు సామాజిక వర్గాలేవి.. గెలిపించి నిలబెట్టే తంత్రాలేవి.

ఆదివాసీల ఖిల్లా ఆదిలాబాద్.. పేరుకు తగ్గట్టుగానే ఆదివాసీ ఓటు బ్యాంక్ ఆధిక్యంతో ఎస్టీ నియోజక వర్గంగా సాగుతోంది. 16,50,175 ఓట్లలో 25 శాతం ఓటు‌ బ్యాంక్‎తో నేతల తలరాతలు మార్చే సత్తాతో సాగితోంది గిరిజనం. ఇందులో తొమ్మిది తెగల ఆదివాసీల బలం 2.20 లక్షలైతే.. బంజారా సామాజిక వర్గ బలం 1.50 లక్షలుగా ఉండటంతో.. ఈ రెండు సామాజిక వర్గాలను ఒక్క తాటిపైకి తెచ్చి గంపగుత్తగా ఓటు బ్యాంకును తమ ఖాతాలో వేసుకోవడం అంత ఈజీ కాదన్న టాక్ నడుస్తోంది. కారణం ఆదివాసీ – బంజారా‎ల మధ్య గత కొంత కాలంగా కోల్డ్ వార్ కొనసాగుతుండటం.. తాజా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలేవి బంజారా నేతలకు అవకాశం కల్పించకపోవడం. దీంతో నివురుగప్పిన నిప్పులా సాగుతున్న బంజారా సామాజిక వర్గం ఉప్పెనలా ముంచి ఏ పార్టీ కొంప కొల్లేరు చేస్తుందో అన్న ఆందోళన రాజకీయ వర్గాల్లో కనిపిస్తోంది. మరో వైపు తొమ్మిది తెగలతో కొనసాగుతున్న ఆదివాసీలను ఐక్యం చేసి గంపగుత్తగా ఓటు బ్యాంకును సొంతం చేసుకోవడం కూడా అంత ఈజీ కాకపోవడంతో.. ఆదివాసీల ఖిల్లాను హస్తగతం చేసుకునేందుకు ఎర్రని ఎండలను సైతం లెక్క చేయకుండా చెమటోడ్చక తప్పని పరిస్థితి అన్ని పార్టీలది.

గంప గుత్త కష్టమే..

అయితే ఈ ఎన్నికల్లో మూడు పార్టీలు కూడా ఆదివాసీ నేతకు.. అందులో గోండు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికే పట్టం కట్టడంతో.. ఏ నేతకు జై కొట్టాలో తెలియక ఆదివాసీ సమాజం అయోమయంలో పడిపోయింది. గత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తరుపున పోటీ చేసిన‌ సోయం బాపురావును భుజాలపై మోసీ గెలిపించుకున్న ఆదివాసీ సామాజిక వర్గం మారిన రాజకీయ పరిణామాలకు తోడు.. ప్రదాన పార్టీల అభ్యర్థులందరు ఆదివాసీ నేతలే కావడంతో గంపగుత్తగా ఒక వైపే నిలిచే అవకాశాలు కష్టమే అన్న టాక్ వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఉద్యమ నేతలకే గిరిజనం జై..

అయితే ఆదివాసీల కోసం పోరాటాలు చేసిన నేతల్లో ముందు వరుసలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు వైపే ఆదివాసీ సమాజం నిలుస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇదే సమయంలో బంజారా సమాజం మరో వైపు నిలుస్తుండటంతో గెలుపు అంత ఈజీ కాదన్న టాక్ నడుస్తోంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ పరిదిలోని ఏడు‌నియోజక వర్గాల్లో బీఆర్ఎస్ కేవలం ఆసిపాబాద్, బోథ్ నియోజకవర్గాలను మాత్రం సొంతం చేసుకోవడం.. ఆ రెండు నియోజక వర్గాలు కూడా ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలే కావడంతో పార్లమెంట్ ఎన్నికల్లోను ఎస్టీ సామాజిక వర్గం తమ వైపే నిలుస్తుందన్న భారీ ఆశలతో ఉంది బీఆర్ఎస్. అయితే కాంగ్రెస్ మాత్రం ఒకే ఒక్క ఖానాపూర్ సీటును గెలుచుకున్నప్పటికి.. గెలిచిన ఆ ఒక్క నేత ఆదివాసీ ఉద్యమకారుడే కావడంతో గిరిజన ఓటర్ల బలం బలగం తమకే ఉందంటూ చెప్పుకొస్తోంది కాంగ్రెస్.

లక్ష ఓట్లు అటు ఇటైనా.. లక్ష్యం గోవిందా..

మరో వైపు ఆదిలాబాద్ పార్లమెంట్ హస్తం గెలుపు బాధ్యతలు భుజానకెత్తుకున్న మంత్రి సీతక్క.. తమ సామాజిక వర్గ ఓట్లను గంప గుత్తగా కైవసం చేసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుండటం.. అభ్యర్థి ఆత్రం సుగుణ సైతం ఆదివాసీ ఉద్యమకారురాలు కావడంతో తమకే ఎక్కువ అవకాశాలు అన్న ఆశభావం వ్యక్తం చేస్తోంది‌ కాంగ్రెస్. అయితే బీజేపీ నేత గోడెం నగేష్ బలమైన ఆదివాసీ నాయకుడే అయినా ఆదివాసీ ఉద్యమంలో అంటీముంటన్నట్టుగానే సాగాడన్న అపవాదుతో ఆ సామాజిక వర్గం దూరంగానే ఉంటూ వస్తోంది. అయితే అనూహ్యంగా మోడీమానియాతో బంజారా సామాజిక వర్గం బీజేపీ వైపు నిలుస్తుందన్న టాక్ నేపథ్యంలో ముచ్చటగా మూడు పార్టీలు ఆదివాసీ ఓట్లను చీల్చుకుని బంజారా ఓట్లు బీజేపీ చేజిక్కుంచుకుంటే కాషాయానికి ఆదివాసీల ఖిల్లాలో తిరుగుండదనే చర్చ సాగుతోంది.

అయితే ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని 16,50,175 లక్షల ఓట్లలో మైనారిటీ బలం సైతం 1.50 లక్షల ఓటర్లు ఉండటం.. ఈ ఓట్లలలో ఒక్క శాతం ఓటు బ్యాంకు కూడా బీజేపీకి దక్కే అవకాశం లేదని తెలుస్తోంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 4,48,961 ఓట్లను‌ సాధించుకున్న బీజేపీ.. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ టార్గెట్‎ను క్రాస్ చేస్తుందా లేక మారిన పరిణామాలతో ఓట్లను నష్టం పోతుందో చూడాలి. మరో వైపు అసెంబ్లీ ఎన్నికల్లో 4,65,476 ఓట్లను సాధించిన‌ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్‎తో క్యాడర్‎ను కోల్పోయి ఢీలా పడగా.. శాసనసభ ఎన్నికల్లో కేవలం ఒక్క ఖానాపూర్‎ను మాత్రమే కైవసం చేసుకుని ఏడు‌ నియోజక వర్గాల్లో 2,25,286 ఓటు బ్యాంక్ ను మాత్రమే దక్కించుకున్న కాంగ్రెస్.. గోడ దూకొచ్చిన కీలక నేతల బలంతో ఆదివాసీల అండదండలతో గెలిచి నిలుస్తుందో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
రోహిత్, నమన్‌ల పోరాటం వృథా.. లక్నో చేతిలో ముంబైకు తప్పని ఓటమి
రోహిత్, నమన్‌ల పోరాటం వృథా.. లక్నో చేతిలో ముంబైకు తప్పని ఓటమి
'పవిత్ర నన్ను పిలుస్తోంది'.. 'త్రినయని' సీరియల్ నటుడు చందు సూసైడ్
'పవిత్ర నన్ను పిలుస్తోంది'.. 'త్రినయని' సీరియల్ నటుడు చందు సూసైడ్
'మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని' .. ముంబై పర్యటనపై మోడీ ట్వీట్
'మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని' .. ముంబై పర్యటనపై మోడీ ట్వీట్
చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది..!
చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది..!
నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
పుష్పరాజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నసెలబ్రిటీలు.!
పుష్పరాజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నసెలబ్రిటీలు.!
చేపల కోసం వల విసిరిన జాలరి.. ఏం చిక్కిందో చూసి షాక్
చేపల కోసం వల విసిరిన జాలరి.. ఏం చిక్కిందో చూసి షాక్
175 మందితో ప్రయాణిస్తున్న విమానం..ఒక్కసారిగా మోగిన ఎమర్జెన్సీబెల్
175 మందితో ప్రయాణిస్తున్న విమానం..ఒక్కసారిగా మోగిన ఎమర్జెన్సీబెల్
నేషనల్ హైవే ప్రమాదాల నివారణకు స్పెషల్ యాక్షన్ ప్లాన్
నేషనల్ హైవే ప్రమాదాల నివారణకు స్పెషల్ యాక్షన్ ప్లాన్
టీమిండియా కోచ్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్.. విదేశీయులకు నో ఛాన్స్
టీమిండియా కోచ్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్.. విదేశీయులకు నో ఛాన్స్