PM Modi: తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ.. ఈ తేదీల్లో పర్యటన..

తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 8, 10 తేదీల్లో వేములవాడ, వరంగల్‌ సభలకు హాజరుకానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికే దేశంలో రెండు విడతల్లో పోలింగ్ ప్రక్రియ సజావుగా ముగిసింది.

PM Modi: తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ.. ఈ తేదీల్లో పర్యటన..
Modi In Jalore
Follow us
Srikar T

|

Updated on: May 01, 2024 | 6:22 PM

తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 8, 10 తేదీల్లో వేములవాడ, వరంగల్‌ సభలకు హాజరుకానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికే దేశంలో రెండు విడతల్లో పోలింగ్ ప్రక్రియ సజావుగా ముగిసింది. మూడవ దశ పోలింగ్‎కు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తుంటే ఇదే క్రమంలో అన్ని రాజకీయ పార్టీల నేతలు ప్రచారంలో జోరు పెంచారు. బీజేపీ మూడో సారి కేంద్రంలో అధికారంలోకి రావడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తోంది. 370 నుంచి 400 ఎంపీ సీట్లలో గెలుపే తమ లక్ష్యంగా చెబుతున్నారు ముఖ్య నేతలు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోనూ తమ ఉనికిని విస్తరించుకునేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది.

గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ సీట్లలో పురోగతి సాధించిన బీజేపీ లోక్ సభ ఎన్నికల్లోనూ ఇదే ట్రెండ్ ను కొనసాగించాలని చూస్తోంది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లాంటి ముఖ్య నేతలు తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి శంఖంపూరించారు. మే 13న పోలింగ్ జరుగుతున్న తరుణంలో 8వ తేదీ నుంచి తెలంగాణలో మోదీ పర్యటనలు ఉండేలా ప్లాన్ చేశారు. మే 8న వేములవాడలో మోదీ పర్యటించనున్నారు. రాజన్న ఆశీర్వాదం తీసుకుని ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు. అలాగే 10న మహబూబ్‌నగర్‌తో పాటు హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ప్రధాని మోదీతో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇప్పటి నుంచే తెలంగాణ బీజేపీ మోదీ టూర్‌కి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలిస్తోంది. ఈ సారి గ్రాండ్ గా సభలు ఏర్పా్టు చేయాలని ప్రణాళికలు సిద్దం చేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..