AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ప్రేయసితో ఓయో రూమ్‌కు.. తెల్లారేసరికి విగతజీవిగా.. తను ఏం చేసిందంటే

వారిద్దరూ లవర్స్. ఒకే ఊరు. ఇంకా ప్రేమ విషయం ఇంట్లోవాళ్లకు తెలియదు కాబట్టి ఊర్లో కలవడం కష్టంగా మారింది. ఇటీవల హైదరాబాద్‌లో ఫంక్షన్ ఉండటంతో.. అక్కడికి వచ్చారు. ఆపై ఓయో రూమ్ తీసుకున్నారు. అతను లిక్కర్ సేవించాడు.. ఆ తర్వాత.....

Hyderabad: ప్రేయసితో ఓయో రూమ్‌కు.. తెల్లారేసరికి విగతజీవిగా.. తను ఏం చేసిందంటే
Oyo Hotel (Representative image)
Ram Naramaneni
|

Updated on: May 01, 2024 | 2:51 PM

Share

జీవితం ఓ నీటి బుడగ. ఎప్పుడు.. ఏమవుతుందో చెప్పలేం. ఈ మధ్యకాలంలో అయితే గుండెపోటు మరణాలు పెరిగిపోయాయి. అప్పటివరకూ నవ్వుతూ ఉన్నవారు ఆకస్మాత్తుగా కూలిపోతున్నారు. ఏమైందో తెలుసుకునే లోపే క్షణాల వ్యవధిలో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. గతంలో లేవు ఈ మాయదారి రోగాలు. కరోనా తర్వాత ఈ ఆకస్మిక చావులను ఎక్కువగా చూస్తున్నాం. ప్రస్తుతం ఓ యువకుడు ప్రాణం పోయిన తీరు.. అచ్చం సినిమా మాదిరిగా ఉంది.

సూపర్ డీలక్స్ సినిమా చూసినవారికి ఈ సీన్‌ గురించి తెలుస్తుంది.  తన ప్రియురాలితో ఏకాంతంగా గడిపే సమయంలో ఓ వ్యక్తి ఆకస్మికంగా మరణిస్తాడు. అచ్చం అలాంటి ఘటనే హైదరాబాద్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన హేమంత్ (28) స్థానికంగా బిజినెస్ చేస్తుంటాడు. కాగా.. అదే గ్రామానికి చెందిన ఒక అమ్మాయి, హేమంత్.. కొంతకాలంగా లవ్‌లో ఉన్నారు. కాగా.. వీళ్లిద్దరూ 29వ తేదీన హైదరాబాద్‌లోని ఒక ఫంక్షన్‌కి వచ్చారు. అక్కడ కార్యక్రమం ముగిశాక ఎస్సార్ నగర్‌ వచ్చి.. ఓయో రూమ్ తీసుకున్నారు.

నైట్ ఇద్దరూ అక్కడే ఉన్నారు. కాగా.. రూమ్‌లో హేమంత్ మద్యం సేవించగా.. ఆ తర్వాత ఇద్దరు కలిసి డిన్నర్ కూడా చేశారు. కాగా.. సుమారు 2 గంటల ప్రాంతంలో హేమంత్ వాష్‌రూమ్‌కి వెళ్లాడు. లోనికి వెళ్లిన హేమంత్ ఎంతసేపటికీ రాకపోవటంతో ఆ అమ్మాయికి అనుమానం వచ్చి.. లోపలికి వెళ్లి చూడగా..   అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. హేమంత్‌ను అలా చూసి కంగుతిన్న ఆ యువతి.. వెంటనే  అతని ఫ్రెండ్స్‌కు ఫోన్ చేసి విషయం చెప్పింది. వారు వెంటనే స్పాట్‌కు వచ్చారు. హేమంత్‌ను బాత్రూం నుంచి తీసుకొచ్చి మంచంపై పడుకోబెట్టి.. 108 కి కాల్ చేయగా.. వచ్చిన వైద్య సిబ్బంది అప్పటికే హేమంత్ చనిపోయినట్లు నిర్ధారించారు.

మృతుడి తల్లి హేమలత ఇచ్చిన కంప్లైంట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. అయితే.. హేమంత్‌.. గుండెపోటుతో చనిపోయాడా.. లేదా ఇంకేదైనా జరిగి ఉంటుందా.. అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. హేమంత్ పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఇప్పుడు కీలకం కానుంది. పలు కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…