TG EAPCET 2026: తెలంగాణ ఈఏపీసెట్ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. ముఖ్యమైన తేదీలు ఇవే
రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఈఏపీసెట్ 2026 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ఈ రోజు నుంచి ప్రారంభమైనాయి. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి (TGCHE) అధికారిక వెబ్‌సైట్ లో రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది. ఏప్రిల్ 4, 2026వ తేదీ వరకు విద్యార్ధులు..

హైదరాబాద్, ఫిబ్రవరి 19: తెలంగాణ రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఈఏపీసెట్ 2026 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ఈ రోజు నుంచి ప్రారంభమైనాయి. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి (TGCHE) అధికారిక వెబ్‌సైట్ లో రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది. ఏప్రిల్ 4, 2026వ తేదీ వరకు విద్యార్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఏడాది కూడా ఈఏపీసెట్ పరీక్షను జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించనుంది. తెలంగాణ ఈఏపీసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ కాలేజీల్లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇక అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో మే 4 ,5 తేదీల్లో ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు జరుగుతాయి. ఇంజినీరింగ్ విభాగం మే 9 నుంచి 11 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. రిసిస్ట్రేషన్ ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులు రూ.500, జనరల్ అభ్యర్ధులు రూ.900 చెల్లించవల్సి ఉంటుంది. రెండు స్ట్రీమ్‌లకు కలిపి దరఖాస్తు చేసుకునే వారైతే SC, ST, PH అభ్యర్థులు రూ. 1000, జనరల్ అభ్యర్ధులు రూ.1800 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది.
తెలంగాణ ఈఏపీసెట్ 2026 ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ముఖ్యమైన తేదీలు..
- ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: ఫిబ్రవరి 19, 2026.
- ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 4, 2026.
- రూ.250 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 10, 2026.
- రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 15, 2026.
- రూ.2,500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 20, 2026.
- రూ.5,000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 24, 2026.
- రూ.10,000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: మే 2, 2026 వరకు
- దరఖాస్తు సవరణ: ఏప్రిల్ 6 నుంచి 8 వరకు.
- అగ్రికల్చర్, ఫార్మసీ హాల్‌టికెట్ డౌన్‌లోడ్ తేదీ: ఏప్రిల్ 23, 2026.
- ఇంజినీరింగ్ హాల్‌టికెట్ డౌన్‌లోడ్ తేదీ: ఏప్రిల్ 27, 2026.
- అగ్రికల్చర్ & ఫార్మసీ పరీక్ష తేదీలు: మే 4, 5 తేదీల్లో
- ఇంజినీరింగ్ పరీక్ష తేదీలు: మే 9 నుంచి మే 11 వరకు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




