Watch Video: ఆ ఇద్దరి కుట్రలో భాగంగానే కేసీఆర్‌పై నిషేధం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మండిపాటు
Telangana Lok Sabha Elections 2024: ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ కుట్రలో భాగంగానే కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం విధించారంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఫైర్ అయ్యారు. నేత కార్మికులకు మద్ధతుగా మాట్లాడినందుకు కేసీఆర్‌పై నిషేధం విధించారని ధ్వజమెత్తారు.
ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ కుట్రలో భాగంగానే కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం విధించారంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఫైర్ అయ్యారు. నేత కార్మికులకు మద్ధతుగా మాట్లాడినందుకు కేసీఆర్‌పై నిషేధం విధించారని ధ్వజమెత్తారు. కేసీఆర్‌పై నిషేధం విధించిన ఈసీకి… మోదీ, రేవంత్ విద్వేషపూరిత ప్రసంగాలు కనిపించ లేదా? వినిపించ లేదా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా అడ్డుకునేందుకే ఇదంతా చేస్తున్నారని అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని నిషేధాలు పెట్టినా రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పదహారు సీట్లు గెలవడం ఖాయమన్నారు. ఫేక్ వీడియోలు పెట్టిన రేవంత్ రెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు.
సిరిసిల్లలో ఏప్రిల్ 5న మీడియా సమావేశంలో తమ పార్టీ, నేతలపై కేసీఆర్ అభ్యంతర వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఎన్నికల సంఘం.. కేసీఆర్ వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించేలా ఉన్నాయని భావించింది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి కేసీఆర్ 48 గంటల పాటు ఎలాంటి ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా నిషేధం విధించింది.
ఆడపిల్ల పుడితే రూ.10 వేలు ఎఫ్డీ చేస్తా... సర్పంచ్ అభ్యర్థి హామీ
ఏంది సామీ ఇదీ.. నువ్వు నేతవా.. మాంత్రికుడివా
రోడ్డుపక్కన గుట్టలు గుట్టలుగా ఏటీఎం కార్డులు
ఈ కోతులు సల్లగుండా సర్పంచ్ ఎన్నికలనే మార్చేశాయిగా
ఫోన్ మాన్పించాలని చెస్ నేర్పితే.. చివరికి
దారుణం.. తనకంటే అందంగా ఉన్నారని.. అలా ఎలా చేసింది.. బాబోయ్
బాబోయ్.. ప్రసూతి ఆస్పత్రిలో ఎలుకలు

