Watch Video: తెలంగాణలో ట్రిపులార్ ట్యాక్స్.. సీఎం రేవంత్‌పై బీజేపీ నేత సంచలన ఆరోపణలు

Watch Video: తెలంగాణలో ట్రిపులార్ ట్యాక్స్.. సీఎం రేవంత్‌పై బీజేపీ నేత సంచలన ఆరోపణలు

Janardhan Veluru

|

Updated on: May 02, 2024 | 3:49 PM

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రియల్టర్లు, బిల్డర్ల నుంచి RRR ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. RRR అంటే రాహుల్‌, రేవంత్ రియల్‌ ఎస్టేట్‌ దందా అంటూ ఎద్దేవా చేశారు. బిల్డర్లు, రియల్టర్ల నుంచి 6 వేల కోట్లు RRR ట్యాక్స్‌ వసూలు చేసింది వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు.

లోక్‌సభ ఎన్నికల తేదీ సమీపిస్తున్న వేళ అధికార కాంగ్రెస్, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఆరోపణలు – ప్రత్యారోపణలు, విమర్శలు -ప్రతి విమర్శలతో తెలంగాణలో ఎన్నికల వాతావరణం రోజురోజుకీ వేడెక్కుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రియల్టర్లు, బిల్డర్ల నుంచి RRR ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. RRR అంటే రాహుల్‌, రేవంత్ రియల్‌ ఎస్టేట్‌ దందా అంటూ ఎద్దేవా చేశారు. బిల్డర్లు, రియల్టర్ల నుంచి 6 వేల కోట్లు RRR ట్యాక్స్‌ వసూలు చేసింది వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. బిల్డర్ల నుంచి నేరుగా డబ్బులే వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఆ డబ్బులను ఢిల్లీకి పంపుతున్నారని అన్నారు. ఇక్కడ వసూలు చేస్తున్న RRR ట్యాక్స్‌ను చూసి బిల్డర్లు, రియల్టర్లు తెలంగాణకు రావాలంటేనే బయపడే పరిస్థితి నెలకొందన్నారు. త్వరలో రేవంత్ రెడ్డి వసూలు చేస్తున్న మరో ట్యాక్స్‌ బయటపెడుతానన్నారు. డీకే శివకుమార్ బాటలో నడుస్తున్న రేవంత్‌ ఈ ఆరోపణలకు సమాధానం చెప్పాన్నారు.