Watch Video: సీఎం జగన్ భూములు ఇచ్చే నేతే తప్ప లాక్కునే నాయకుడు కాదు.. కాటసాని రాంభూపాల్ రెడ్డి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు పాణ్యం సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సిరీయస్ వార్నింగ్ ఇచ్చారు. ఏపీ ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు సీఎం జగన్ పై అనేక ఆరోపణలు చేస్తున్నారు. అయితే దీనిపై వైసీపీ నాయకులు కౌంటర్ దాడి చేస్తున్నారు. సీఎం జగన్పై చంద్రబాబు నోరు పారేసుకుంటే తగిన బుద్ధి చెప్తాం అని హెచ్చరించారు. వయసుకు తగ్గట్లు, రాజకీయ అనుభవానికి తగినట్లుగా చంద్రబాబు మాట్లాడకుండా హింసను ప్రేరేపించేలా రెచ్చగొడుతూ నేరానికి పాల్పడుతున్నారన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు పాణ్యం సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సిరీయస్ వార్నింగ్ ఇచ్చారు. ఏపీ ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు సీఎం జగన్ పై అనేక ఆరోపణలు చేస్తున్నారు. అయితే దీనిపై వైసీపీ నాయకులు కౌంటర్ దాడి చేస్తున్నారు. సీఎం జగన్పై చంద్రబాబు నోరు పారేసుకుంటే తగిన బుద్ధి చెప్తాం అని హెచ్చరించారు. వయసుకు తగ్గట్లు, రాజకీయ అనుభవానికి తగినట్లుగా చంద్రబాబు మాట్లాడకుండా హింసను ప్రేరేపించేలా రెచ్చగొడుతూ నేరానికి పాల్పడుతున్నారన్నారు. కూటమి మేనిఫెస్టో అట్టర్ ప్లాప్ అయిందన్నారు. కూటమిలో అతిపెద్ద పార్టీగా ఉన్న బిజెపి మేనిఫెస్టోను అంగీకరించలేదన్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో కూడా పాస్ బుక్కులపై చంద్రబాబు ఫోటో ఉండేదని గుర్తు చేశారు. అప్పుడు ఆ భూములన్నీ చంద్రబాబు ఆక్రమించుకున్నట్లేనా? అని ప్రశ్నించారు. పేదలకు జగన్ భూములు ఇచ్చే నాయకుడే తప్ప.. తీసుకునే నాయకుడు కాదని హితవుచెప్పారు. చంద్రబాబుకు మళ్ళీ ప్రతిపక్షమే గతి అని అంటున్నారు వైఎస్ఆర్సీపీ పాణ్యం ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..