కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం.. ఈసీ కీలక ఆదేశాలు.. ఎప్పటివరకంటే..
తెలంగాణలో కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటలు నిషేధం విధించింది ఈసీ. సిరిసిల్ల ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పై అవమానకరంగా, అభ్యంతరకరమైన పదజాలాన్ని ఉపయోగించినందుకు ఈసీ కేసీఆర్ ప్రచారంపై వేటు వేసింది. ఈరోజు రాత్రి 8 గంటల నుంచే ఈ నిబంధన అమలులో ఉండనున్నట్లు ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఈసీ సీరియస్ అయింది.
తెలంగాణలో కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటలు నిషేధం విధించింది ఈసీ. సిరిసిల్ల ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పై అవమానకరంగా, అభ్యంతరకరమైన పదజాలాన్ని ఉపయోగించినందుకు ఈసీ కేసీఆర్ ప్రచారంపై వేటు వేసింది. ఈరోజు రాత్రి 8 గంటల నుంచే ఈ నిబంధన అమలులో ఉండనున్నట్లు ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఈసీ సీరియస్ అయింది. గత నెల ఏప్రిల్ 6న కేసీఆర్ సిరిసిల్లలో నిర్వహించిన ప్రెస్ మీట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.
దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తగు చర్యలు తీసుకోవాలని ఈసీని ఆదేశించింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన రాష్ట్ర ఎన్నికల అధికారి మే 1 రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు ప్రచారం నిర్వహించకూడదని కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఆదేశాల ప్రకారం మే 3వ తేది రాత్రి 8 గంటల వరకు కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు అనుమతి ఉండదు. దేశ వ్యాప్తంగా లోక్ సభ, పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దేశం మొత్తం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఈసీ స్పష్టం చేసింది.
ఈసీ ఆదేశాలపై కేసీఆర్ స్పందన..
ఈసీ తన లోక సభ ఎన్నికల ప్రచారాన్ని నిషేధించడంపై స్పందించారు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈసీ స్థానిక మాండలికాన్ని సరిగా అర్ధం చేసుకోలేకపోయిందన్నారు. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ బాగా చేయలేదన్నారు. కాంగ్రెస్ కొన్ని పదాలను తప్పుగా వక్రీకరించి ఈసీకి ఫిర్యాదు చేసిందన్నారు కేసీఆర్. తన బస్సుయాత్ర చూసి కాంగ్రెస్, బీజేపీ భయపడుతున్నాయన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..