Andhra Pradesh: అమ్మ బాబోయ్..! ఇంటర్నెట్ సెంటర్‌లో వింత శబ్ధాలు.. తీరా చూస్తే అంతా షాక్..!

అల్లూరి ఏజెన్సీలోని పాడేరు.. ఇంటర్నెట్ సెంటర్‌లో అంతా బిజీబిజీగా ఉన్నారు. ఇంతలో బయట నుంచి కేకలు వినిపిస్తున్నాయి. ఏమని ఆరాతీస్తే ఓ భారీ నాగ జెర్రీ పాము చొరబడింది. ఇక, అంతే.. అంతా గుండెలు పట్టుకున్నారు. పాములు పట్టే వ్యక్తికి సమాచారం అందించారు. వచ్చి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఆ పాము అద్దాల పైకి పాకుతూ.. స్నేక్ క్యాచర్‌కే చుక్కలు చూపించింది.

Andhra Pradesh: అమ్మ బాబోయ్..! ఇంటర్నెట్ సెంటర్‌లో వింత శబ్ధాలు.. తీరా చూస్తే అంతా షాక్..!
Snake
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: May 01, 2024 | 12:17 PM

అల్లూరి ఏజెన్సీలోని పాడేరు.. ఇంటర్నెట్ సెంటర్‌లో అంతా బిజీబిజీగా ఉన్నారు. ఇంతలో బయట నుంచి కేకలు వినిపిస్తున్నాయి. ఏమని ఆరాతీస్తే ఓ భారీ నాగ జెర్రీ పాము చొరబడింది. ఇక, అంతే.. అంతా గుండెలు పట్టుకున్నారు. పాములు పట్టే వ్యక్తికి సమాచారం అందించారు. వచ్చి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఆ పాము అద్దాల పైకి పాకుతూ.. స్నేక్ క్యాచర్‌కే చుక్కలు చూపించింది.

పాడేరులో నాగ జెర్రి పాము హల్ చల్ చేసింది. ఇంటర్నెట్ సెంటర్ లో చొరబడి కలకలం సృష్టించిన పాము భయాందోళనకు గురి చేసింది. పామును చూసిన స్థానికులు కేకలు పెట్టారు. వెంటనే లోపల ఉన్న వాళ్ళు అప్రమత్తమయ్యారు. నెట్ సెంటర్ యజమాని హరిబాబుకి సమాచారం ఇచ్చారు. ఇంటర్నెట్ సెంటర్లో అందరిలో టెన్షన్ మొదలైంది. స్నేక్ క్యాచర్ వాసుకు విషయం చెప్పడంతో, స్పాట్ కు చేరుకున్నాడు. పామును పట్టుకునేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు స్నేక్ క్యాచర్ వాసు.

ఆ సమయంలో పాము.. పట్టు తప్పినట్టు కనిపించింది. ఇంటర్నెట్ సెంటర్ అద్దాలపైకి నిటారుగా పాకుతూ భయాందోళనకు గురిచేసింది. పట్టుకుంటే కాటు వేసేలా.. బుసలు కొట్టింది. దీంతో 20 నిమిషాల పాటు శ్రమించి, అత్యంత చాకచక్యంగా ఆ పామును పట్టుకున్నాడు. నాగ జెర్రిని సురక్షితంగా పట్టుకుని సమీపంలోని అడవిలో వదలి పెట్టాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో చల్లదనం కోసం పాములు బయటకు వస్తున్నాయని అంటున్నాడు స్నేక్ క్యాచర్ వాసు.

బుసలు కొడుతున్న నాగ జెర్రి పాము వీడియో ఇదిగో…

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles