Indian Navy Jobs: పరీక్ష లేకుండానే నేవీలో ఉద్యోగాలు.. లక్షకుపైనే జీతం, లాస్ట్ డేట్ ఇదే
Indian Navy recruitment 2026: ఇండియన్ నేవీలో అధికారిగా చేరాలనుకునే యువతకు అద్భుత అవకాశం ఇది. షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) విధానంలో మొత్తం 260 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. యూజీ/పీజీ అర్హతలతో ఉన్న అవివాహిత పురుషులు, మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులను శిక్షణ అనంతరం సబ్ లెఫ్టినెంట్ హోదాతో నియమిస్తారు. మొదటి నెల నుంచే సుమారు రూ.1,25,000 వరకు వేతనం పొందే అవకాశం ఉంది.

Indian Navy Notification 2026: ఇండియన్ నేవీలో అధికారిగా చేరాలనుకునే యువతకు అద్భుత అవకాశం ఇది. షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) విధానంలో మొత్తం 260 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. యూజీ/పీజీ అర్హతలతో ఉన్న అవివాహిత పురుషులు, మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులను శిక్షణ అనంతరం సబ్ లెఫ్టినెంట్ హోదాతో నియమిస్తారు. మొదటి నెల నుంచే సుమారు రూ.1,25,000 వరకు వేతనం పొందే అవకాశం ఉంది.
పరీక్ష లేకుండానే నేవీలో ఉద్యోగం
ఈ SSC పోస్టులు ప్రధానంగా రెండు విభాగాల్లో ఉన్నాయి: ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ టెక్నికల్ బ్రాంచ్
ఇవి అన్నీ లెవెల్–10 అధికార హోదా పోస్టులు.
రాత పరీక్ష లేదు. అకడమిక్ మార్కుల ఆధారంగా మెరిట్ షార్ట్‌లిస్టింగ్. అనంతరం SSB (Service Selection Board) ఇంటర్వ్యూ. మెడికల్ పరీక్షల తర్వాత తుది ఎంపిక. అకడమిక్‌గా మంచి మార్కులు సాధించిన వారికి ఇది మంచి అవకాశం.
వేతనం, సర్వీస్ వివరాలు
శిక్షణ స్థలం: Indian Naval Academy, ఎజిమల శిక్షణ వ్యవధి: 22 వారాలు (జనవరి 2027 నుంచి) ప్రాథమిక వేతనం: రూ.56,100 (Level–10) అదనంగా: DA, HRA, ఇతర అలవెన్సులు మొత్తం వేతనం: సుమారు రూ.1.25 లక్షలు/నెల
ప్రారంభం: 12 సంవత్సరాలు పొడిగింపు: అదనంగా 2 సంవత్సరాలు గరిష్టం: 14 సంవత్సరాలు
ప్రొబేషన్: పోస్టు ఆధారంగా 2 లేదా 3 సంవత్సరాలు
SSC అనంతరం సివిల్ సెక్టార్‌లో మంచి అవకాశాలు ఉంటాయి.
ఖాళీలు, అర్హతలు
ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ జనరల్ సర్వీస్ – 76 ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ – 18 నేవల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ (Observer) – 20 పైలట్ – 25
లాజిస్టిక్స్ – 10 అర్హతలు: BE/B.Tech లో కనీసం 60% కొంతమందికి ఇంటర్‌లో కూడా 60% అవసరం
లాజిస్టిక్స్ పోస్టులకు BE/B.Tech లేదా MBA/MSc (IT)/MCA/PG Diploma/Supply Chain/ B.Com + Logistics అర్హతలు
ఎడ్యుకేషన్ బ్రాంచ్ – 15 పోస్టులు B.Tech / MSc / MCA / MBA అర్హతలు
సంబంధిత విభాగాల ప్రకారం ఎంపిక
టెక్నికల్ బ్రాంచ్ ఇంజినీరింగ్ – 42 ఎలక్ట్రికల్ – 38 సబ్ మెరైన్ టెక్ (ఇంజినీరింగ్) – 8 సబ్ మెరైన్ టెక్ (ఎలక్ట్రికల్) – 8
అర్హత: సంబంధిత విభాగంలో BE/B.Tech లో 60%
వయసు పరిమితి
జననం: 02 జనవరి 2000 – 01 జులై 2007 మధ్య
ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా అర్హులు NCC ‘C’ సర్టిఫికెట్ ఉన్నవారికి అకడమిక్ మార్కుల్లో 5% సడలింపు
SSB ఇంటర్వ్యూ సెంటర్లు
బెంగళూరు భోపాల్ విశాఖపట్నం కోల్‌కతా
ముఖ్య తేదీ
దరఖాస్తు చివరి తేదీ: 24 ఫిబ్రవరి 2026
అధికారిక వెబ్‌సైట్ దరఖాస్తు కోసం: https://www.joinindiannavy.gov.in/
ఇండియన్ నేవీలో అధికారి స్థాయి ఉద్యోగం – మంచి వేతనం, గౌరవప్రదమైన కెరీర్, దేశ సేవ చేసే అవకాశం. అర్హతలు ఉన్న వారు ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేసుకోవచ్చు.
