తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ప్రధాని మోదీ మనోగతం ఏంటి? టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ ఇంటర్వ్యూ

ఇండియాలోనే బిగ్గెస్ట్‌ నెట్‌వర్క్‌.. కంట్రీలోనే బిగ్గెస్ట్‌ జర్నలిస్ట్స్‌... యావత్ జాతీయ మీడియాలోనే బిగ్గెస్ట్‌ షో.. అవును, ప్రధాని నరేంద్రమోదీతో టీవీ9 నెట్‌వర్క్‌ చేసిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇప్పుడు టాక్ ఆఫ్ ది కంట్రీగా మారింది. గురువారం (మే 2) రాత్రి 8 గంటలకు మోదీతో టీవీ9 నెట్‌వర్క్ ఎడిటర్స్ రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూ ప్రసారం కానుంది

తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ప్రధాని మోదీ మనోగతం ఏంటి? టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ ఇంటర్వ్యూ
Pm Modi Interview With Tv9
Follow us

|

Updated on: May 02, 2024 | 1:43 PM

ఇండియాలోనే బిగ్గెస్ట్‌ నెట్‌వర్క్‌.. కంట్రీలోనే బిగ్గెస్ట్‌ జర్నలిస్ట్స్‌… యావత్ జాతీయ మీడియాలోనే బిగ్గెస్ట్‌ షో.. అవును, ప్రధాని నరేంద్రమోదీతో టీవీ9 నెట్‌వర్క్‌ చేసిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇప్పుడు టాక్ ఆఫ్ ది కంట్రీగా మారింది. గురువారం (మే 2) రాత్రి 8 గంటలకు మోదీతో టీవీ9 నెట్‌వర్క్ ఎడిటర్స్ రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూ ప్రసారం కానుంది. దాదాపు 2 గంటల పాటు ఈ ఇంటర్వ్యూ జరిగింది. దేశ వ్యాప్తంగా తెలుగు, కన్నడ, హిందీ సహా ఏడు భాషల్లో మోదీ ఇంటర్వ్యూ ప్రసారం కానుంది. సార్వత్రిక ఎన్నికల వేళ జాతీయ స్థాయి రాజకీయ అంశాలతో పాటు ఆయా రాష్ట్రాల్లోని కీలక అంశాలు, ప్రతిపక్షాల పదునైన విమర్శలకు సంబంధించిన అంశాలపై టీవీ9 ఎడిటర్స్ ప్రధాని మోదీకి ప్రశ్నలు సంధించారు. ఆ ప్రశ్నలకు ప్రధాని మోదీ ధీటైన సమాధానాలిచ్చారు. అటు సోషల్ మీడియాలోనూ మోదీతో టీవీ9 నెట్‌వర్క్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ బజ్ క్రియేట్ చేస్తోంది. రాజకీయ అంశాలపై టీవీ9 నెట్‌వర్క్ ఎడిటర్స్ అడిగిన ప్రశ్నలకు నరేంద్ర మోదీ ఏం సమాధానాలు చెప్పారోనని ఆసక్తి సర్వత్రా నెలకొంటోంది.

తెలుగు రాష్ట్రాల్లో మరో పాత్‌ బ్రేకింగ్‌ ఇంటర్వ్యూ ఇది. ఇప్పటివరకు తెలుగు టీవీ తెరపై చూడని కాంబినేషన్‌ ఇది. ప్రధాని మోదీని సీనియర్ జర్నలిస్ట్, టీవీ9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ ఇంటర్వ్యూ చేశారు. తెలుగు ప్రజల గొంతుకై… రెండు రాష్ట్రాలకు సంబంధించిన కీలక రాజకీయ అంశాలపై ప్రధాని మోదీ మదిలో ఏముందో సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ప్రధాని మోదీని ఇంటర్వ్యూ చేసిన తొలి తెలుగు జర్నలిస్ట్‌గా ఘనత సాధించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ రాజకీయ అంశాలపై రజనీకాంత్ అడిగిన పదునైన ప్రశ్నలకు ప్రధాని మోదీ దాదాపు 10 నిమిషాల పాటు సమాధానాలిచ్చారు.

టీవీ9 తెలుగు మేనేజింగ్‌ ఎడిటర్‌ రజనీకాంత్… ప్రధాని మోదీ నుంచి సంచలనాత్మక సమాధానాలు రాబట్టారు. ఏపీలో టీడీపీతో మళ్లీ బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకుంది?. ఏపీలో ఎవరు గెలుస్తారని మోదీ అనుకుంటున్నారు? అంటూ ఏపీ రాజకీయాలపై ప్రశ్నించారు. దీనికి కుండబద్ధలు కొట్టినట్టు ప్రధాని మోదీ కూడా ఆసక్తికర సమాధానాలు చెప్పారు.

ఇక తెలంగాణ సెంట్రిక్‌గానూ ఇంటర్వ్యూ సాగింది. సీఎం రేవంత్‌ రెడ్డి తనను పెద్దన్న అనడాన్ని మోదీ ఎలా చూస్తున్నారు? రేవంత్ పాలనపై ప్రధాని రేటింగ్‌ ఏంటి? RR ట్యాక్స్‌ అంటూ రేవంత్‌ను ఆరోపించిన మోదీ.. చెప్పిన సీక్రెట్స్‌ ఏంటి? అంటూ ప్రశ్నించారు. దీనిపై ప్రధాని మోదీ మనోగతాన్ని ఇంటర్వ్యూలో ఆవిష్కరించారు.

అటు సార్వత్రిక ఎన్నికల తర్వాత హస్తినలో సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడుతుందంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో పదేపదే చెబుతున్నారు. దీనిపై కూడా ప్రధాని మోదీ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన రీతిలో తన సమాధానమిచ్చారు.

కేంద్రంలో మళ్లీ బీజేపీ సర్కారు అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తారంటూ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. దీనిపై కూడా ప్రధాని మోదీ కుండబద్ధలు కొట్టినట్లు సమాధానమిచ్చారు.

అటు ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రివాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు కారణమైన ఢిల్లీ లిక్కర్ స్కాం‌మ్‌పై టీవీ9 నెట్‌వర్క్ ఎడిటర్స్ ఆడిగిన ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానమిచ్చారు.

టీవీ9 తెలుగు మేనేజింగ్‌ ఎడిటర్‌ రజినీకాంత్‌ ఏం ప్రశ్నలు సంధించారు? ప్రధాని మోదీ ఎలాంటి సమాధానాలు చెప్పారో ఈరోజు రాత్రి 8గంటలకు ప్రసారం అయ్యే 5 ఎడిటర్స్‌లో తెలుస్తుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400 సీట్లను సాధించడం సాధ్యమేనా? ఏయే రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? తదితర అంశాలపై కూడా టీవీ9 నెట్‌వర్క్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ తన మనోగతాన్ని ఆవిష్కరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
ప్యారిస్ ఒలింపిక్స్‌లో మన తెలంగాణ బిడ్డ.. టీటీలో శ్రీజకు స్థానం
ప్యారిస్ ఒలింపిక్స్‌లో మన తెలంగాణ బిడ్డ.. టీటీలో శ్రీజకు స్థానం
వరుస సినిమాలతో రజినీకాంత్ దూకుడు.. అవాక్కయ్యేలా రెమ్యూనిరేషన్.
వరుస సినిమాలతో రజినీకాంత్ దూకుడు.. అవాక్కయ్యేలా రెమ్యూనిరేషన్.
కళ్లెదుటే మట్టిపాలైన పంటలు.. గుండెలు బాదుకుంటున్న రైతులు..!
కళ్లెదుటే మట్టిపాలైన పంటలు.. గుండెలు బాదుకుంటున్న రైతులు..!
చార్‌ధామ్ ఆలయాల 50 మీటర్ల పరిధిలో వీడియోలు, రీల్స్‌పై నిషేధం
చార్‌ధామ్ ఆలయాల 50 మీటర్ల పరిధిలో వీడియోలు, రీల్స్‌పై నిషేధం
అన్నం వండే ముందు బియ్యాన్ని ఎన్ని సార్లు కడుక్కోవాలి..? ఈ నీళ్లు
అన్నం వండే ముందు బియ్యాన్ని ఎన్ని సార్లు కడుక్కోవాలి..? ఈ నీళ్లు
ఆ టాటా కార్లపై ఆఫర్ల జాతర.. ఏకంగా రూ.60 వేల వరకు తగ్గింపు
ఆ టాటా కార్లపై ఆఫర్ల జాతర.. ఏకంగా రూ.60 వేల వరకు తగ్గింపు
అతివేగం ప్రమాదకరం..! అంటే వింటారా..? చార్‌ధామ్‌ యాత్రికుల బస్సు.!
అతివేగం ప్రమాదకరం..! అంటే వింటారా..? చార్‌ధామ్‌ యాత్రికుల బస్సు.!
T20 ప్రపంచకప్‌లో నో ఛాన్స్.. కొత్త అవతారం ఎత్తిన టీమిండియా ఓపెనర్
T20 ప్రపంచకప్‌లో నో ఛాన్స్.. కొత్త అవతారం ఎత్తిన టీమిండియా ఓపెనర్
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్… ఆకాశ ఎయిర్‌లో 20 శాతం తగ్గింపు
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్… ఆకాశ ఎయిర్‌లో 20 శాతం తగ్గింపు
హై బీపీ రోగులు వ్యాయామం చేస్తుంటే..ఈ 3 విషయాలు గుర్తు పెట్టుకోండి
హై బీపీ రోగులు వ్యాయామం చేస్తుంటే..ఈ 3 విషయాలు గుర్తు పెట్టుకోండి