Hyderabad: నేడు ఇఫ్తార్‌ విందుకు రేవంత్ సర్కార్ కీలక ఏర్పాట్లు.. ఎక్కడంటే..

రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నద‌ని, అందుక‌నే మొద‌టి శుక్రవారం రోజున సాయంత్రం 7 గంటలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశామ‌ని డిప్యూటి సీఎం భ‌ట్టి విక్రమార్క మ‌ల్లు తెలిపారు. రంజాన్ ఏర్పాట్లకు నిధుల కొర‌త లేద‌న్నారు. నెల 15 న ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు కార్యక్రమం కోసం చేపడుతున్న ఏర్పాట్లను ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గురువారం సంబంధిత అధికారులతో కలసి పరిశీలించారు. బందోబ‌స్తు, పార్కింగ్‌, విద్యుత్తు, మెడిక‌ల్‌, వాట‌ర్ స‌ర‌ఫ‌రా, ప్రోటోకాల్‌, ర‌వాణా త‌దిత‌ర అంశాల‌పై స‌మీక్షించారు.

Hyderabad: నేడు ఇఫ్తార్‌ విందుకు రేవంత్ సర్కార్ కీలక ఏర్పాట్లు.. ఎక్కడంటే..
Telangana Government Iftar
Follow us
Noor Mohammed Shaik

| Edited By: Srikar T

Updated on: Mar 15, 2024 | 8:13 AM

రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నద‌ని, అందుక‌నే మొద‌టి శుక్రవారం రోజున సాయంత్రం 7 గంటలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశామ‌ని డిప్యూటి సీఎం భ‌ట్టి విక్రమార్క మ‌ల్లు తెలిపారు. రంజాన్ ఏర్పాట్లకు నిధుల కొర‌త లేద‌న్నారు. నెల 15 న ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు కార్యక్రమం కోసం చేపడుతున్న ఏర్పాట్లను ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గురువారం సంబంధిత అధికారులతో కలసి పరిశీలించారు. బందోబ‌స్తు, పార్కింగ్‌, విద్యుత్తు, మెడిక‌ల్‌, వాట‌ర్ స‌ర‌ఫ‌రా, ప్రోటోకాల్‌, ర‌వాణా త‌దిత‌ర అంశాల‌పై స‌మీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఏలాంటి లోపాలు త‌లెత్తకుండా అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని, ఎవరికి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ, పోలీస్, సమాచార శాఖ, జి.హెచ్.యం.సి, ఆర్ అండ్‌ బి, విద్యుత్, వాటర్ బోర్డ్, అగ్నిమాపక శాఖ తదితర శాఖలు ప్రణాళిక బద్దంగా ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు.

పవిత్ర రంజాన్ మాసంలో తొలి శుక్రవారం రోజున ముస్లీం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వంకు మైనార్టీల పట్ల ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తున్నదని అన్నారు. మైనారిటీ సంక్షేమ శాఖకు ప్రభుత్వం రూ.2263 కోట్లను బడ్జెట్‎లో కేటాయించిందని తెలిపారు. గడిచిన మూడు నెలల్లో మైనారిటీల సంక్షేమానికి రూ.478.56 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని వివరించారు. కొడంగల్‌లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాన్సెప్ట్ తరలోనే రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభించడానికి ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు ఆయన తెలిపారు. అద్దె భవనాల్లో నడుస్తున్న మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలను సొంత భవనాల్లో నిర్మించేందుకు స్థలాలను సేకరించాల్సిందిగా ఆదేశించామని ఆయన తెలిపారు. మైనారిటీ సంక్షేమ శాఖలో మొత్తం ఐదు చైర్మన్ పోస్టులు నియమించడంతో పాటు హైదరాబాద్ పాతబస్తీలో మెట్రో లైన్, మీర్-ఆలమ్‌లో కేబుల్ వంతెనను నిర్మించేందుకు ప్రతిపాదనలు కూడా సిద్దం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ఇఫ్తార్ విందులో ముస్లీమ్ సోదరులు నమాజ్ చేయుటకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఇఫ్తార్‎లో పాల్గొనే ప్రతి ఒక్కరికి భోజన సదుపాయాలు అందుబాటులో ఉండే విధంగా తగు చర్యలు తీసుకోవాలని, త్రాగు నీరు, మొబైల్ టాయిలెట్స్ తదితర మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలకు ఎలాంటి అసౌకర్యం, ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు. ఈ స‌మావేశంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లాహ్ హుస్సేనీ, తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హమ్దాన్, హజ్ కమిటీ చైర్మన్ అఫ్జల్, క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపాక్ జాన్, సీఎం కార్యదర్శి షానవాజ్‌ ఖాసీం, జి.హెచ్.యం.సి కమీషనర్ రోనాల్డ్ రోస్, సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమీషనర్ హనుమంత రావు, నగర అదనపు పోలీస్ కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్ , మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి తఫ్సీర్ ఇక్బాల్, కాంతి వెస్లీ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..