సముద్ర తీరంలో ఊహించని అతిథి.. అంతలోనే
విశాఖ జిల్లా యారాడ తీరానికి 15 అడుగుల భారీ తిమింగలం కొట్టుకొచ్చింది. మత్స్యకారులు దానిని తిరిగి సముద్రంలోకి పంపేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, కొనఊపిరితో ఉన్న ఆ తిమింగలం ఒడ్డునే ప్రాణాలు కోల్పోయింది. గాయాలు లేదా అనారోగ్యం కారణంగా ఇలాంటి ఘటనలు జరుగుతాయని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ విషాద ఘటన స్థానికులను, పర్యాటకులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది.
సముద్రం మధ్యలో సంచరించే భారీ తిమింగలాలు ఒక్కోసారి అనుకోకుండా తీరప్రాంతంలో కనిపిస్తుంటాయి. తాజాగా విశాఖ జిల్లా యారాడ సముద్ర తీరానికి భారీ తిమింగలం కొట్టుకొచ్చింది. దాదాపుగా 15 అడుగుల పొడవున్న ఆ తిమింగలాన్ని చూసేందుకు.. సందర్శకులు పోటీపడ్డారు. స్థానిక మత్స్యకారులు ఆ తిమింగలాన్ని పరిశీలించి చూడగా అది కొనఊపిరితో ఉన్నట్టు గుర్తించారు. అలల తాకిడికి అటు ఇటు కదులుతూ కనిపించిన తిమింగలాన్ని మళ్లీ సముద్రంలోకి పంపేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు మత్సకారులు. అయితే వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఒడ్డునే ఆ తిమింగలం ప్రాణాలు కోల్పోయింది. దీంతో సందర్శకులు, మత్స్యకారులు తీవ్ర ఆవేదన చెందారు. తిమింగలాలు నడిసంద్రంలో సంచరిస్తూ ఉంటాయి. అరుదుగా తీరంలో కనిపిస్తాయి. గాయపడితేనో, అనారోగ్యం పాలైనప్పుడో.. ఈదలేని పరిస్థితుల్లో ఇలా ఒడ్డుకు కొట్టుకు వస్తూ ఉంటాయి. గతంలోనూ పలుమార్లు అనకాపల్లి జిల్లాలో తిమింగలాలు కనిపించాయి. ఇలా ఒడ్డుకు వస్తున్న చేపలను మత్స్యకారులు తిరిగి పంపించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇటువంటి భారీ చేపలు మాత్రం.. తీరానికి వచ్చినప్పుడే కొనఊపిరితో ఉండి ఆ తర్వాత ప్రాణాలు కోల్పోతాయి. మరికొన్ని చనిపోయిన తర్వాత కళేబరాలు ఒడ్డుకు కొట్టుకొస్తాయి. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు సందర్శకులు ఆసక్తిగా వెళ్లి ఆసక్తిగా తమ సెల్ ఫోన్లలో బంధిస్తూ ఉంటారు. కేవలం టీవీలోనూ, సినిమాల్లోనూ కనిపించే ఈ భారీ తిమింగలాలు ప్రత్యక్షంగా కనిపించేసరికి చూసేందుకు పోటీ పడుతూ ఉంటారు. ఈ ఘటనపై అధికారులు ఆరా తీస్తున్నారు. గాయపడి.. వలకు చిక్కి ప్రాణాలు కోల్పోయి ఉంటుందని అనుమానిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమెరికా వెళ్లటం ఇక కష్టమే బాస్.. టూరిస్ట్ వీసాపైనా సవాలక్ష ఆంక్షలు
అల్లుడితో కలిసి భర్తను చంపిన అత్త.. కారణం మీరనుకున్నదేనా ??
తల్లీ కూతుళ్లు మామూలోళ్లు కాదు బాబోయ్.. వాళ్ళు వీళ్ళు ఎందుకని పోలీసులనే టార్గెట్ చేశారు
నేషనల్ కాదమ్మా.. మనదంతా ఇంటర్నేషనల్.. హాలీవుడ్‌కు ఇంకా హడలే
అప్పట్లో వరుసగా మూడు హిట్లు.. కట్ చేస్తే మిగతావన్నీ ఫట్లు.. బ్యాడ్ లక్‌కు బ్రాండ్ అంబాసిడర్
సముద్ర తీరంలో ఊహించని అతిథి.. అంతలోనే
అల్లుడితో కలిసి భర్తను చంపిన అత్త.. కారణం మీరనుకున్నదేనా ??
వాళ్ళు వీళ్ళు ఎందుకని పోలీసులనే టార్గెట్ చేసిన తల్లీ కూతుళ్లు
కోట్లలో ఇండియన్ యూట్యూబర్ సంపాదన.. లగ్జరీ కార్లు, విల్లాలు
కిడ్నాపర్లను జైలుకు పంపిన స్మార్ట్వాచ్..
కట్టుతప్పి వీధుల్లో పరుగులు పెట్టిన గుర్రాలు..
అద్భుతం.. 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం.. ఎక్కడో తెలుసా

