నేషనల్ కాదమ్మా.. మనదంతా ఇంటర్నేషనల్.. హాలీవుడ్‌కు ఇంకా హడలే
తెలుగు సినీ పరిశ్రమ 'ప్యాన్ ఇండియా' సరిహద్దులు దాటి 'ప్యాన్ వరల్డ్' సినిమా లక్ష్యంగా దూసుకుపోతోంది. రాజమౌళి, అల్లు అర్జున్, ప్రభాస్, నాని వంటి స్టార్స్ గ్లోబల్ ప్రాజెక్ట్స్‌తో హాలీవుడ్‌ను సైతం ఆకర్షిస్తున్నారు. 600 కోట్ల బడ్జెట్ చిత్రాలు, అంతర్జాతీయ సహకారాలతో తెలుగు సినిమా ప్రపంచ వేదికపై తనదైన ముద్ర వేయడానికి సిద్ధమవుతోంది. ఇది టాలీవుడ్ కొత్త శకానికి నాంది.
ప్యాన్ ఇండియా అనే పదం ఇకపై వినిపించదా..? ఎవర్ని కదిపినా కూడా ప్యాన్ వరల్డ్ అంటున్నారు.. ఇప్పట్నుంచి వరల్డ్ సినిమానే మన అడ్డాగా మారబోతుందా..? హాలీవుడ్‌ను ఫాలో అవుతున్నారా లేదంటే వాళ్లకే ధీటుగా మనోళ్లు ఎదగాలని ప్రయత్నిస్తున్నారా..? టాలీవుడ్ నుంచి మొదలైన జర్నీ ఎక్కడి వరకు వెళ్లనుంది..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ.. తెలుగు సినిమా అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్..! బొమ్మ ఇక్కడే తీస్తే రీ సౌండ్ హాలీవుడ్‌లో రావాలి.. క్లాప్ ఇక్కడే కొడితే రికార్డులు అక్కడ కదలాలి అంటున్నారు మన దర్శకులు. మన హీరోలు కూడా డైరెక్టర్స్ ఆలోచనలకు తగ్గట్లుగా మారిపోతున్నారు. అందుకే ఇంకా ప్యాన్ ఇండియా ఏంటి.. ప్రపంచమే మన టార్గెట్ అంటున్నారు. అందరూ అదే దారిలో వెళ్తున్నారు. పుష్ప 2తో ఇండియన్ సినిమా రికార్డులను కొల్లగొట్టిన అల్లు అర్జున్.. అట్లీ సాయంతో వరల్డ్ సినిమాపై కన్నేసారు. AA22 తెరకెక్కుతున్న తీరు చూస్తుంటే ఆశ్చర్యం తప్పదు. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రాన్ని 600 కోట్లతో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్నారు. ప్యారలల్ వరల్డ్ స్టోరీతో వస్తుంది ఈ చిత్రం. ఇక బన్నీ కంటే ముందే రాజమౌళి వారణాసితో ఈ యజ్ఞం మొదలుపెట్టారు. ట్రిపుల్ ఆర్‌తో ఆస్కార్ గెలిచిన జక్కన్న.. వారణాసితో ప్యాన్ వరల్డ్ వైపు పరుగులు పెడుతున్నారు. 120 దేశాలు, 26 భాషల్లో మహేష్ సినిమాని విడుదల చేయబోతున్నారీయన. జేమ్స్ కామెరూన్ సైతం ఈ సినిమాకు ప్రమోషన్ చేస్తున్నారు. ఇక నాని ప్యారడైజ్ సైతం ప్యాన్ వరల్డ్ ప్రాజెక్టే. దీని రేంజ్ ముందు చెప్తున్న దానికంటే చాలా భారీగానే ఉండబోతుంది. ప్రభాస్‌తో సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన స్పిరిట్ హాలీవుడ్ స్థాయిలో వస్తున్న డార్క్ న్యాచురల్ పోలీస్ డ్రామా. కొరియన్ నటుడు డాంగ్ లీ ఎంట్రీతో ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అయిపోయింది స్పిరిట్. అలాగే జై హనుమాన్‌ని 11 భాషలకు పైగానే తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్ వర్మ. రిషబ్ శెట్టి ఇందులో హీరో. వీటితో పాటు ప్రభాస్ ఫౌజీ రేంజ్ అలాగే ఉంది. మొత్తానికి టాలీవుడ్ అంటే నేషనల్ కాదిప్పుడు ఇంటర్నేషనలే..!
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అప్పట్లో వరుసగా మూడు హిట్లు.. కట్ చేస్తే మిగతావన్నీ ఫట్లు.. బ్యాడ్ లక్‌కు బ్రాండ్ అంబాసిడర్
కోట్లలో ఇండియన్ యూట్యూబర్ సంపాదన.. లగ్జరీ కార్లు, పెద్ద పెద్ద విల్లాలు.. ఎలాగంటే ??
బోండీ బీచ్ హీరోకి విరాళాల వెల్లువ.. రూ.14 కోట్లు పై మాటే
కిడ్నాపర్లను జైలుకు పంపిన స్మార్ట్‌వాచ్.. సరిగా ఉపయోగించుకుంటే అన్ని బానే ఉంటాయి
కట్టుతప్పి వీధుల్లో పరుగులు పెట్టిన గుర్రాలు.. హడలెత్తిన జనం ఏ చేశారంటే
కోట్లలో ఇండియన్ యూట్యూబర్ సంపాదన.. లగ్జరీ కార్లు, విల్లాలు
కిడ్నాపర్లను జైలుకు పంపిన స్మార్ట్‌వాచ్..
కట్టుతప్పి వీధుల్లో పరుగులు పెట్టిన గుర్రాలు..
అద్భుతం.. 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం.. ఎక్కడో తెలుసా
మద్యం మత్తులో అన్నదమ్ముల మధ్య గొడవ.. చివరికి
ఇంత ఘోరమా.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం
దేశంలోనే మొదటి నేచర్ థీమ్డ్ ఎయిర్ పోర్ట్ టెర్మినల్

