తల్లీ కూతుళ్లు మామూలోళ్లు కాదు బాబోయ్.. వాళ్ళు వీళ్ళు ఎందుకని పోలీసులనే టార్గెట్ చేశారు
నంద్యాల జిల్లాలో ఓ కేసు విషయంలో న్యాయం జరగలేదని భావించిన తల్లీకూతురు, పోలీసులపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు. టెక్నాలజీని ఉపయోగించి పోలీస్ అధికారుల ఫోటోలను అభ్యంతరకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హెచ్చరికలను లెక్కచేయకపోవడంతో వారిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇది సైబర్ నేరాల పట్ల తీవ్రతను తెలియజేస్తుంది.
ఓ కేసు విషయంలో తమకు న్యాయం జరగలేదని భావించిన ఇద్దరు మహిళలు ఏకంగా పోలీసులనే టార్గెట్ చేశారు. వారిపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న ఆ తల్లీకూతరు టెక్నాలజీని ఉపయోగించుకున్నారు. పోలీసు అధికారుల ఫోటోలను అభ్యంతరకరంగా మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ప్రారంభించారు. దాంతో వారిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన నంద్యాల జిల్లాలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఉయ్యాలవాడ మండలం మాయలూరు గ్రామానికి చెందిన మార్తమ్మ, ఆమె కూతురు బందెల స్పందన.. కొన్నాళ్లుగా కోవెలకుంట్ల పట్టణంలోని గాంధీ నగర్ లో నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ పోలీస్ అధికారులను టార్గెట్ చేస్తూ.. యూనిఫాంలో ఉన్న పోలీస్ అధికారుల ఫోటోలను సేకరించి వాటిని అభ్యంతరకరమైన రీతిలో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టింగ్ చేస్తున్నారు. ఈ విషయమై తల్లీ కూతుర్లు ఇద్దరినీ పోలీసులు పలుమార్లు హెచ్చరించారు. పద్ధతి మార్చుకోవాలని సూచించారు. కొన్నేళ్ళ క్రితం ఓ కేసు విషయమై వారికి న్యాయం జరగలేదని తరచూ పోలీస్ స్టేషన్‌కు వచ్చి గొడవ చేస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో కొద్దిరోజులుగా కోవెలకుంట్ల , సంజమల రేవనూరు, ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేసిన పోలీస్ అధికారుల ఫోటోలను మార్ఫింగ్ చేసి పదేపదే పోస్టింగులు పెడుతున్నారని వివరించారు. దాంతో వీరిపై కేసులు నమోదు చేసి.. ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని పోలీసులు తెలిపారు. వీరి నుండి రెండు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా, గతంలో వీరిపై కోవెలకుంట్ల పోలీస్ స్టేషన్ లో రెండు కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నేషనల్ కాదమ్మా.. మనదంతా ఇంటర్నేషనల్.. హాలీవుడ్‌కు ఇంకా హడలే
అప్పట్లో వరుసగా మూడు హిట్లు.. కట్ చేస్తే మిగతావన్నీ ఫట్లు.. బ్యాడ్ లక్‌కు బ్రాండ్ అంబాసిడర్
కోట్లలో ఇండియన్ యూట్యూబర్ సంపాదన.. లగ్జరీ కార్లు, పెద్ద పెద్ద విల్లాలు.. ఎలాగంటే ??
బోండీ బీచ్ హీరోకి విరాళాల వెల్లువ.. రూ.14 కోట్లు పై మాటే
కిడ్నాపర్లను జైలుకు పంపిన స్మార్ట్‌వాచ్.. సరిగా ఉపయోగించుకుంటే అన్ని బానే ఉంటాయి
వాళ్ళు వీళ్ళు ఎందుకని పోలీసులనే టార్గెట్ చేసిన తల్లీ కూతుళ్లు
కోట్లలో ఇండియన్ యూట్యూబర్ సంపాదన.. లగ్జరీ కార్లు, విల్లాలు
కిడ్నాపర్లను జైలుకు పంపిన స్మార్ట్‌వాచ్..
కట్టుతప్పి వీధుల్లో పరుగులు పెట్టిన గుర్రాలు..
అద్భుతం.. 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం.. ఎక్కడో తెలుసా
మద్యం మత్తులో అన్నదమ్ముల మధ్య గొడవ.. చివరికి
ఇంత ఘోరమా.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం

