AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అల్లుడితో కలిసి భర్తను చంపిన అత్త.. కారణం మీరనుకున్నదేనా ??

అల్లుడితో కలిసి భర్తను చంపిన అత్త.. కారణం మీరనుకున్నదేనా ??

Phani CH
|

Updated on: Dec 22, 2025 | 1:04 PM

Share

నంద్యాలలో వివాహేతర సంబంధం విషాదంగా మారింది. అల్లుడితో అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్త గుర్రప్పను భార్య సుభద్ర, అల్లుడు లింగమయ్య కలిసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనను కూతుళ్లు చూసినా, అత్తా అల్లుళ్లు వారిని బెదిరించారు. బంధువుల అనుమానంతో పోలీసులు విచారణ ప్రారంభించగా అసలు నిజం బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రస్తుత కాలంలో వివాహేతర సంబంధాలు పెచ్చుమీరుతున్నాయి. కొందరు వయసు, వరుసలతో సంబంధం లేకుండా ప్రవర్తిస్తున్న ఎన్నో ఘటనలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. తమ అక్రమ వ్యవహానికి అడ్డుగా ఉన్నారని భావిస్తే భర్త, భార్య, పిల్లలు అని చూడకుండా దారుణాలకు పాల్పడుతున్నారు. నిర్దాక్షిణ్యంగా నిండు ప్రాణాలను తీసేస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలో అలాంటి ఘటనే జరిగింది. అల్లుడితో వ్యవహారం నడుపుతున్న ఓ మహిళ అల్లుడితో కలిసి.. తాళి కట్టిన భర్తనే కడతేర్చింది. వివరాలు ప్రకారం.. ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల శివారులోని నందమూరి నగర్ లో గుర్రప్ప, సుభద్రా దంపతులకు ముగ్గురు కుమార్తెలు. గుర్రప్ప వ్యవసాయ కూలీ. వీరి ముగ్గురు అమ్మాయిలలో పెద్ద కూతురిని.. రుద్రవరం మండలం తూపల్లె గ్రామానికి చెందిన లింగమయ్యకు ఇచ్చి ఐదు నెలల క్రితం పెళ్లి చేశారు. అయితే.. ఆ తర్వాత గుర్రప్ప భార్య అల్లుడితో చనువుగా ఉండటం మొదలుపెట్టింది. కొన్నాళ్లకు ఇది వివాహేతర సంబంధంగా మారింది. దీనిని గమనించిన గుర్రప్ప ఆమెను పలుమార్లు మందలించాడు. ఈ విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో తన అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన సుభద్ర ..అల్లుడితో కలిసి భర్తను చంపాలని ప్లాన్ వేసింది. ఈ క్రమంలో డిసెంబరు 17 రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చి నిద్రపోయాడు గుర్రప్ప. ఇది గమనించిన సుభద్ర.. అల్లుడికి సమాచారమిచ్చింది. వెంటనే అక్కడికి వచ్చిన లింగమయ్య.. ఇంట్లోని స్పీకర్ వైర్లతో గుర్రప్ప మెడకు ఉరి బిగించాడు. ఆ టైంలో సుభద్ర.. భర్త కాళ్లను తాడుతో బిగించింది. అయితే..ఆ అలికిడికి ఇంట్లోని కూతుళ్లు నిద్రలేచి జరిగింది చూశారు. తండ్రిని కాపాడుకునేందుకు వారిద్దరూ తల్లిని, బావను అడ్డుకోబోయారు. దాంతో అత్తా, అల్లుడు ‘ఈ విషయం బయటకు చెబితే.. మీ పెద్దక్కను కూడా చంపేస్తాం’ అని లింగమయ్య, సుభద్ర వారిని బెదిరించారు. దీంతో ఇద్దరు పిల్లలు సైలెంట్ గా ఉండి పోయారు. గుర్రప్ప చనిపోయాడు అని నిర్దారించుకున్న భార్య, అల్లుడు .. దానిని సాధారణ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కాగా, వచ్చిన బంధువులు, స్థానికులు గుర్రప్ప మెడపై ఉన్న గాయాలను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు సుభద్ర ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. తర్వాత ఆమె కూతుళ్లను విచారించగా అసలు సంగతి బయటపడింది. గుర్రప్ప మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం నంద్యాల ఆసుపత్రికి తరలించారు. తాలుకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివాహేతర సంబంధానికి అడ్డు ఉన్నాడనే భార్య, అల్లుడు తో కలిసి భర్తను చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తల్లీ కూతుళ్లు మామూలోళ్లు కాదు బాబోయ్.. వాళ్ళు వీళ్ళు ఎందుకని పోలీసులనే టార్గెట్ చేశారు

నేషనల్ కాదమ్మా.. మనదంతా ఇంటర్నేషనల్.. హాలీవుడ్‌కు ఇంకా హడలే

అప్పట్లో వరుసగా మూడు హిట్లు.. కట్ చేస్తే మిగతావన్నీ ఫట్లు.. బ్యాడ్ లక్‌కు బ్రాండ్ అంబాసిడర్‌

కోట్లలో ఇండియన్ యూట్యూబ‌ర్ సంపాదన.. లగ్జరీ కార్లు, పెద్ద పెద్ద విల్లాలు.. ఎలాగంటే ??

బోండీ బీచ్‌ హీరోకి విరాళాల వెల్లువ.. రూ.14 కోట్లు పై మాటే