యాదగిరిగుట్ట ఆలయ ఈవో రామకృష్ణరావుపై బదిలీ వేటు.. అసలు కారణం ఇదే..

ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట ఆలయ ఈవో రామకృష్ణరావుపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి ఆలయ పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రోటోకాల్ వివాదంతో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆయనను బదిలీ చేసింది. కొత్త ఈవోగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ఎ.భాస్కర రావును నియమించింది. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో తొలిరోజు సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, మంత్రులు యాదాద్రి ఆలయాన్ని సందర్శించారు.

యాదగిరిగుట్ట ఆలయ ఈవో రామకృష్ణరావుపై బదిలీ వేటు..  అసలు కారణం ఇదే..
Yadagiri Temple
Follow us
M Revan Reddy

| Edited By: Srikar T

Updated on: Mar 15, 2024 | 8:58 AM

ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట ఆలయ ఈవో రామకృష్ణరావుపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి ఆలయ పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రోటోకాల్ వివాదంతో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆయనను బదిలీ చేసింది. కొత్త ఈవోగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ఎ.భాస్కర రావును నియమించింది. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో తొలిరోజు సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, మంత్రులు యాదాద్రి ఆలయాన్ని సందర్శించారు. పూజల అనంతరం ఆలయ అర్చకులు వేదాఆశీర్వచనం ఇచ్చే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డిలు ఎత్తుగా ఉన్న పీటలపై కూర్చోవడం, పక్కనే ఎత్తు తక్కువగా ఉన్న పీటలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖ కూర్చున్నారు. యాదాద్రీశుడి సాక్షిగా దళితుడైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను సీఎం రేవంత్ అవమానించారని ప్రతిపక్షాలు విమర్శలు, ట్రోల్స్ చేశాయి. ఈ వివాదానికి సంబంధించి.. తాము ఎవరిని అవమానించలేదని, ఎవరికీ ఎలాంటి లోటుపాట్లు జరగలేదని ఆలయ అధికారులు కూడా వివరణ ఇచ్చారు. తాను ఎవరికీ తలవంచే వాడిని కాదని, తాను కావాలనే చిన్న స్టూల్ మీద కూర్చున్నానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తేల్చి చెప్పారు.

పవిత్ర పుణ్యక్షేత్రంలో నష్ట నివారణ చర్యల్లో భాగంగా, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆలయ ఈవో రామకృష్ణారావు పై బదిలీ వేటు వేసింది. మరి కొంతమంది సిబ్బందిపై కూడా బదిలీ వేటు వేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఆలయ నూతన ఈవోగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ భాస్కరరావును ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. భాస్కర్ రావు మొన్నటి వరకూ యాదాద్రి జిల్లా జెసిగా పనిచేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..