AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చీరల దినోత్సవం..సాంప్రదాయ చీరకట్టుతో ర్యాంప్ వాక్‌లో పాల్గొన్న మహిళలు!

భారతీయ మహిళలు ధరించే చీరలు సాంప్రదాయానికి నిదర్శణం, ప్రతి సంవత్సరం డిసెంబర్ 21న ప్రపంచ చీరల దినోత్సవాన్ని జరుపుకుంటారు. కాగా, డిసెంబర్ 21 ఆదివారం రోజున, ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వూరులో ఏ బి యెన్ & పి ఆర్ ఆర్ కళాశాలలో ఘనంగా ప్రపంచ చీరల దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

B Ravi Kumar
| Edited By: |

Updated on: Dec 22, 2025 | 2:03 PM

Share
ఏలూరు : భారతీయ మహిళలు  ధరించే చీర సాంప్రదాయానికి ప్రతీకలు వీటికి ఎంతో విశిష్టత , ప్రాధాన్యత , గుర్తింపు ఉంది. చీర కేవలం వస్త్రం మాత్రమే కాదు, సంస్కృతి, ఆడంబరం, ఆత్మగౌరవానికి ఆలంబనగా పేర్కొంటారు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ చీర, కాలానుగుణంగా మారుతూ వచ్చినా,  వాటి గొప్పతనం ఎప్పటికపుడు పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలో ప్రాంతాన్ని బట్టి ప్రత్యేక శైలితో చీరలు కనిపిస్తుంటాయి.

1 / 5
ఆంధ్రప్రదేశ్‌లోని ఉప్పాడ, ధర్మవరం, మంగళగిరి చీరలకు  ప్రత్యేకత ఉంది.  తెలంగాణలో పోచంపల్లి, తమిళనాడు లోని కంచిలో కంచిపురం పట్టు చీరలు, బనారసి, పటోలా ఇలా  ప్రతి చీర వెనుక ఓ కళాకారుడి కష్టం, నేత కార్మికుడి ప్రతిభ దాగి ఉంటాయి. చీరల ప్రత్యేకత దాని వినియోగంలో కూడా కనిపిస్తుంది. పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు, పూజల సమయంలో ప్రత్యేకంగా ప్రాధాన్యత కలిగిన  చీరలను మహిళలు ధరిస్తారు.

2 / 5
రోజువారీ జీవితంలో కూడా చీర సౌకర్యవంతమైన వస్త్రంగా ఉపయోగపడుతుంది. యుక్త వయస్సు వచ్చిన యువతి నుంచి వృద్ధురాలి వరకు ప్రతి వయస్సు మహిళకు చీర సరిపోయేలా ఉంటుంది. ఎవరికి వారు తమశరీర రంగు , తీరు మేరకు చీరల డిజైన్స్ ను ఎంచుకుంటారు. తమ గౌరవానికి, అందానికి అద్దం పట్టేవిధంగా వాటిని ఎంచుకుంటారు.

3 / 5
ప్రస్తుత ఫ్యాషన్ యుగంలో కూడా చీర కొత్త రూపాలు సంతరించుకుంటుంది .. డిజైనర్ చీరలు, లైట్ వెయిట్ చీరలు, ఆఫీస్ వేర్ చీరలు అంటూ యువతను ఆకర్షిస్తోంది. అయినా సంప్రదాయ విలువలను మాత్రం చెరిపివేయడం లేదు. భారతీయ మహిళకు చీర ఒక వస్త్రం కాదు, ఒక భావం.

4 / 5
ఈ విషయాన్ని చాటిచెప్పేందుకు "శారీ దినోత్సవాన్ని" కొవ్వూరు లో నిర్వహించారు. ఏ బి యెన్ & పి ఆర్ ఆర్ కళాశాల లో జరిగిన కార్యక్రమంలో పలువురు మహిళలు సాంప్రదాయ చీరకట్టుతో రాంప్ వాక్ లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్  ఏం రామ్మోహన్ , వై స్ ప్రిన్సిపాల్ రమేష్ తో పాటు కల్చరల్ కమిటీ కోఆర్డినేటర్ రాణి తో పాటు పలువురు విద్యార్థినులు పాల్గొన్నారు.

5 / 5