Telangana: రాష్ట్రపతి అవార్డు పొందిన గిరిజన రైతు.. ఒక్క ఆలోచన జీవితాన్నే మార్చేసింది..

సంప్రదాయ పంటలకు ప్రత్యాన్మయంగా పండ్ల తోటల సాగు మొదలు పెట్టాలనే ఆలోచన నిర్ణయాన్ని వెంటనే అమలు చేసి నేడు అందరికీ ఆదర్శంగా నిలిచాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం అర్లగూడెం గ్రామానికి చెందిన గంగరాజు అనే గిరిజన రైతు పండ్లతోటల సాగులా విజయం సాధించాడు...

Telangana: రాష్ట్రపతి అవార్డు పొందిన గిరిజన రైతు.. ఒక్క ఆలోచన జీవితాన్నే మార్చేసింది..
Penuballi Ganga Raju
Follow us
N Narayana Rao

| Edited By: Narender Vaitla

Updated on: Mar 14, 2024 | 10:41 PM

అక్షరదీపం బడిలో ఓనమాలు మాత్రమే నేర్చుకున్న ఈ గిరిజన రైతుకు కష్టపడి పని చేయడమే తెలుసు. పదెకరాల భూమి ఈ రైతుకు వ్యవసాయం చేయడమంటే ఎక్కువ మక్కువ. కానీ ప్రకృతి సహకరించక ఎప్పడు నష్టాలే వచ్చేవి పంటల సాగుకి పెట్టుబడి ఖర్చులు అధికమయ్యేవి దిగుబడులు తగ్గడంతో చివరికి సాగుకి గుడ్ బై చెప్పుదామనుకున్న సమయంలో అతనికి వచ్చిన ఆలోచనతో ఆయ జీవితాన్నే మలుపు తిప్పింది.

సంప్రదాయ పంటలకు ప్రత్యాన్మయంగా పండ్ల తోటల సాగు మొదలు పెట్టాలనే ఆలోచన నిర్ణయాన్ని వెంటనే అమలు చేసి నేడు అందరికీ ఆదర్శంగా నిలిచాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం అర్లగూడెం గ్రామానికి చెందిన గంగరాజు అనే గిరిజన రైతు పండ్లతోటల సాగులా విజయం సాధించాడు. అతని పట్టుదలను ప్రభుత్వం గుర్తించి ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల సత్కరించారు కూడా.

పదేళ్లుగా పండ్లతోటలు సాగుచేస్తున్న ఈ గిరిజన రైతు ఇప్పుడు ఆర్థికంగా లాభం పొందుతున్నాడు. మొదట తైవాన్ జామ, సపోటా, మామిడి, డ్రాగన్ ప్రూట్, యాపిల్ బేర్, పామాయిల్ పంటలను సేంద్రీయ ఎరువులను మాత్రమే వాడి నాణ్యమైన పంటలు పండిస్తూ పెట్టుబడి కన్న అధిక లాభాలను ఆర్జిస్తూ ఆదర్శంగా నిలిచాడు ఈ గిరిజన రైతు గంగరాజు.

తన వ్యవసాయాన్ని మరింత విస్తరించి అధిక లాభాలు గడించాలనే ఆలోచన లో ఉన్నాడు ఈ గిరిజన రైతు..ఎక్కడో మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో..సరైన సౌకర్యాలు ,లేక వెనక బడిన ప్రాంతంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా.. ఏదో ఒకటి చేసి..నలుగురికి ఆదర్శంగా నిలవాలనే ఈ గిరిజన రైతు కృషి ,పట్టుదల ఏకంగా రాష్ట్ర పతి నుంచి అవార్డ్ అందుకునే స్థాయికి చేర్చింది. ఇదే స్ఫూర్తితో మరింత ముందుకు వెళతానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..