నిజామాబాద్ జిల్లా బోధన్‌లో రెండు నగల దుకాణాల్లో భారీ చోరీ జరిగింది. ఏరియా ఆస్పత్రి సమీపంలోని శివా గోల్డ్ షాప్, ప్రగతి సిల్వర్ షాప్‌లను దొంగలు లక్ష్యంగా చేసుకున్నారు. సీసీటీవీలో ముగ్గురు దొంగలు షట్టర్లు, తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడినట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దొంగలను వీలైనంత త్వరగా పట్టుకుంటామని హామీ ఇచ్చారు.