తమిళనాడులోని తిరువళ్లూరులో గణేశన్ అనే వ్యక్తిని ఆయన కొడుకులే అత్యంత విషపూరితమైన పాముతో కరిపించి హత్య చేశారు. బీమా డబ్బుల కోసమే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. రూ.3 కోట్ల బీమా కోసం ప్రయత్నించగా, బీమా సంస్థ అనుమానంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ నేరం వెలుగులోకి వచ్చింది.