Telangana: ఇది సాదాసీదా గోడ అనుకునేరు.. ముందు నుంచి చూస్తే మ్యాడైపోతారు
చిన్న జాగా దొరికితే అందులో ఇల్లు కట్టుకోగలవా.? అంటే ఠక్కున ఆ ప్రశ్న వేసిన వ్యక్తిని మనం తేరిపారి చూస్తాం. అయితే ఇక్కడొక వ్యక్తి సరిగ్గా అతడికి దొరికిన 8 గజాల స్థలంలో ఏకంగా రెండంతస్తుల ఇంటిని నిర్మించేశాడు. అది కూడా ఎక్కడో కాదండీ..

హైదరాబాద్‌లో భూమి అనేది బంగారం.. కొందరు తమకు దొరికిన అంగుళం స్థలాన్ని కూడా విడిచిపెట్టకుండా సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు. అలా ఓ వ్యక్తి తనకు దక్కిన 8 గజాల స్థలంలో ఏకంగా రెండంతస్తుల ఇంటిని నిర్మించాడు. క్రియేటివిటీ ఉంటే.. అసాధ్యమైన సుసాధ్యమేనని నిరూపించాడు. ఆ ఇంటిని ఒక వైపు నుంచి చూస్తే కేవలం ఒక గోడలా కనిపిస్తుంది. కానీ ముందు వైపు నుంచి చూస్తే మాత్రం అద్దిరిపోయే ఇల్లు దర్శనమిస్తుంది. సింగిల్ బెడ్‌రూమ్ ఇంటికి కూడా కనీసం 100 గజాల స్థలం అవసరమని అనుకునే ఈ రోజుల్లో.. రమేష్ కేవలం 8 గజాల స్థలంలోనే ఒక ఇంటిని కట్టి అద్దెకు కూడా ఇచ్చాడు. ఈ స్థలం ముందు భాగంలో ఆరడుగుల వెడల్పు, వెనుక భాగంలో రెండడుగుల వెడల్పు, 20 అడుగుల పొడవుతో ఉంది.
గ్రౌండ్ ఫ్లోర్‌లో ఓ చిన్న ఆఫీస్ ఉండగా.. మొదటి అంతస్తులో అటాచ్డ్ బాత్రూంతో కూడిన ఒక గదిని నిర్మించాడు. ఈ ఇంటి నిర్మాణం జరిగి సుమారు ఐదేళ్లు కావొస్తోంది. ఇక ఇప్పుడు మరోసారి ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిన్న కుటుంబం లేదా నలుగురైదుగురు సభ్యులు కలిసి ఉండేందుకు ఇది సౌకర్యంగా ఉంటుంది. అటాచ్డ్ బాత్రూమ్, కిచెన్ కౌంటర్ లాంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి.
అద్దెలు చెల్లించలేక, సొంతంగా కింద కిరాణా షాపు పెట్టుకుని పైన నివసించాలనే ఆలోచనతో ఈ ఇంటిని నిర్మించినట్లు రమేష్ వివరించాడు. అతడి తండ్రి, ఒక మేస్త్రీ, ఈ నిర్మాణం అంతటిని ఆయనే పర్యవేక్షించేరట. రమేష్ ప్రస్తుతం కింద వేరే వాళ్లకు అద్దెకు ఇవ్వగా.. పైన తానే ఉంటున్నాడు. ఇంతకీ ఆ ఇంటి ఫోటో ఏంటో మీరూ చూసేయండి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..




