AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పగిలిన బీర్ బాటిల్ నిందితులను పట్టించింది.. 72 గంటల్లోనే కేసును చేధించిన పోలీసులు..

ఢిల్లీలోని కరోల్ బాగ్ పార్కులో యువకుడిపై జరిగిన దాడి కేసును పోలీసులు కేవలం 72 గంటల్లో ఛేదించారు. పోలీసులకు తొలుత ఎటువంటి ఆధారాలు లభించలేదు. కేవలం పగిలిన బీరు బాటిల్‌ మాత్రమే దొరికింది. కానీ అదే నిందితులను పట్టించింది. అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

పగిలిన బీర్ బాటిల్ నిందితులను పట్టించింది.. 72 గంటల్లోనే కేసును చేధించిన పోలీసులు..
Beer Bottle Barcode Helped Police
Krishna S
|

Updated on: Dec 22, 2025 | 4:02 PM

Share

దేశ రాజధాని ఢిల్లీలో నేరగాళ్లు ఎంత తెలివిగా తప్పించుకోవాలని చూసినా టెక్నాలజీ ముందు తలవంచక తప్పదని మరోసారి రుజువైంది. కరోల్ బాగ్ ప్రాంతంలో ఒక యువకుడిపై జరిగిన దాడి కేసును పోలీసులు కేవలం 72 గంటల్లోనే ఛేదించారు. ఈ దర్యాప్తులో పోలీసులు వాడిన క్లూ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. డిసెంబర్ 15న రాత్రి కరోల్ బాగ్‌లోని అజ్మల్ ఖాన్ పార్క్‌లో ఇసామ్ అనే వ్యక్తి తన స్నేహితుడితో కలిసి సోషల్ మీడియా కోసం రీల్స్ షూట్ చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడ మద్యం సేవించి ఉన్న ముగ్గురు యువకులు వారిపై అసభ్యకరమైన కామెంట్స్ చేశారు.

ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన తాగిన వ్యక్తి బీరు బాటిల్‌ను పగలగొట్టి ఆ పదునైన గాజు ముక్కతో ఇసామ్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిన బాధితుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు నిందితుల గురించి ఎటువంటి ఆధారాలు లభించలేదు. కానీ అక్కడ పడి ఉన్న పగిలిన బీరు బాటిల్ ముక్కపై ఉన్న బార్‌కోడ్ అధికారుల కంటపడింది. ఆ బార్‌కోడ్ ఆధారంగా ఆ సీసా ఏ షాపులో అమ్ముడైందో పోలీసులు గుర్తించారు. సదరు మద్యం దుకాణంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించగా ఆ సీసాను కొన్న వ్యక్తుల ముఖాలు స్పష్టంగా కనిపించాయి.

నిందితులు పార్క్ నుంచి పారిపోవడానికి వాడిన స్కూటీ నంబర్‌ను ఇతర కెమెరాల ద్వారా సేకరించి నిందితుల ఆచూకీ కనుగొన్నారు. దాడి చేసిన వ్యక్తిని హమ్మద్ గుర్తించిన పోలీసులు..అతనిపై అప్పటికే 20 ఎఫ్ఐఆర్లు ఉన్నట్లు తెలిపారు. అతని ఫ్రెండ్స్ కమ్రాన్, ఫర్జాన్ కూడా అరెస్ట్ చేశారు. కేవలం అగ్గిపెట్టె అడిగినప్పుడు బాధితుడు నిరాకరించాడనే చిన్న కారణంతోనే తాము దాడి చేశామని నిందితులు విచారణలో అంగీకరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత