22 December 2025

తినడానికి తిండిలేక తిప్పలు.. ఇప్పుడు 3 నిమిషాలకు 5 కోట్లు..

Rajitha Chanti

Pic credit - Instagram

నటనపై ఆసక్తితో చేతిలో 5 వేలతో ఇండియాకు వచ్చింది. అవకాశాల ప్రతి కోసం ప్రతి ఆఫీస్ చుట్టూ తిరిగింది. ఆ సమయంలో తినడానికి తిండిలేక తిప్పలు పడింది.

ఇప్పుడు మూడు నిమిషాల పాటకు దాదాపు రూ.5 కోట్లు పారితోషికం తీసుకుంటుంది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న ఈ బ్యూటీ పేరు నోరా ఫతేహి.

సినిమాల్లో అవకాశాల కోసం ఎన్నో సంవత్సరాలు ఎదురుచూసింది. ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. కానీ ఒక్క పాట ఆమె కెరీర్ మలుపు తిప్పింది.

2018లో వచ్చిన దిల్బర్ సాంగ్ ఆమెకు ఊహించని క్రేజ్ తెచ్చిపెట్టింది. కానీ ఈ పాటకు ఆమె ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదట. ఆ తర్వాత ఎక్కువ అవకాశాలు అందుకుంది.

కెరీర్ ఆరంభంలో ముంబైలో చిన్న ప్రాంతంలో  ఇరుకైన గదిలో ఉండేదట.. జూనియర్ ఆర్టిస్టుగా పనిచేసింది. ఒక్క అవకాశం కోసం నిర్మాణ సంస్థల చుట్టూ తిరిగిందట.

బాలీవుడ్ హీరో అభినవ్ శుక్లా హీరోగా నటించిన రోర్ సినిమాలో మొదటి అవకాశం వచ్చింది. ఆ తర్వాత సినిమాల్లో కథానాయికగా కాకుండా స్పెషల్ సాంగ్స్ చేసింది. 

ఇప్పుడు మూడు నిమిషాల కోసం దాదాపు రూ.5 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది. ఇప్పుడు తెలుగు, హిందీలో భారీగా డిమాండ్ సొంతం చేసుకుంది ఈ బ్యూటీ.

అలాగే సోషల్ మీడియాలోనూ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. అయితే ఇటీవలే నోరా ఫతేహి కారుకు ప్రమాదం జరగ్గా స్వల్ప గాయలతో బయటపడింది ఈ బ్యూటీ.