AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సందడిగా ప్రారంభమైన గ్లోబల్ స్పిరిచువాలిటీ మహోత్సవ్… శంకర్ మహదేవన్ మ్యూజికల్ ఫెస్ట్

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు అయిన పద్మభూషణ్ దాజీ అధ్వర్యంలో కన్హా శాంతివనం గ్లోబల్ స్పిరిచువాలిటీ మహోత్సవ్ 2024 కార్యక్రమానికి వేదిక అయింది.ఈ మహత్కార కార్యక్రమం లో దాదాపు 300కు పైగా స్పిరిచువల్ లీడర్స్ తోపాటుగా.. దాదాపు లక్షమంది వరకు పాల్గొంటారని అంచనా. ప్రపంచానికి పంపాలనే లక్ష్యంతో మన దేశంలో..

సందడిగా ప్రారంభమైన గ్లోబల్ స్పిరిచువాలిటీ మహోత్సవ్... శంకర్ మహదేవన్ మ్యూజికల్ ఫెస్ట్
Global Spirituality Mahotsav
Narender Vaitla
|

Updated on: Mar 14, 2024 | 9:26 PM

Share

భారతదేశం అంటే సంస్కృతి, సాంప్రదాయం,ఆధ్యాత్మిక శక్తికి ప్రతీక…ప్రస్తుతం భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత ప్రపంచాన్ని ప్రభావితం చేస్తోంది. భాగ్యనగరం లోనీ కన్హా శాంతివనంలో గ్లోబల్ స్పిరిచువాలిటీ మహోత్సవ్ 2024 కార్యక్రమం సందడిగా ప్రారంభమైంది. ప్రముఖ సంగీత దర్శకుడు గాయకుడు శంకర్ మహదేవన్ గ్లోబల్ స్పిరిచువాలిటీ మహోత్సవ్ 2024 తొలిరోజు మెడిటేషన్, సంగీత కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు అయిన పద్మభూషణ్ దాజీ అధ్వర్యంలో కన్హా శాంతివనం గ్లోబల్ స్పిరిచువాలిటీ మహోత్సవ్ 2024 కార్యక్రమానికి వేదిక అయింది.ఈ మహత్కార కార్యక్రమం లో దాదాపు 300కు పైగా స్పిరిచువల్ లీడర్స్ తోపాటుగా.. దాదాపు లక్షమంది వరకు పాల్గొంటారని అంచనా. ప్రపంచానికి పంపాలనే లక్ష్యంతో మన దేశంలో తొలిసారి ప్రపంచ నలుమూలల నుంచి వస్తున్న ఆధ్యాత్మిక గురువులు వారి మతాల సారాన్ని, అనుభవాలను, ఆధ్యాత్మిక, తాత్వికమైన ఆలోచనలను ఈ వేదిక ద్వారా పంచుకొను న్నారు.

విశ్వశాంతి కోసం అందరి మధ్య ఆరోగ్యకరమైన చర్చ, తాత్వికమైన చర్చ జరిగి.. విశ్వశాంతికోసం మార్గదర్శనం జరుగుతుందనే సంపూర్ణ విశ్వాసం తో ఇంత పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన దాజీకు శంకర్ మహదేవన్ కృతజ్ఞతలు తెలిపారు. రేపటి తరాలకోసం ఓ ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని నిర్మించేందుకు అవసరమైన పర్యావరణ పరిరక్షణ, యోగా, మెడిటేషన్ లను మరింత ప్రోత్సహించేందుకు అవసరమైన సూచనలు కూడా ఈ వేదిక ద్వారా ప్రపంచానికి అందనున్నాయని ఈ లాంటి మహత్తర కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని శంకర్ మహదేవన్ అని చెప్పారు

సంగీతానికి హద్దులు లేవని స్వీయ నియంత్రణ ద్వారా మనం పొందే ఆధ్యాత్మిక చింతన మెడిటేషన్ ద్వారా విశ్వశాంతి కోసం చేస్తున్న ఈ ప్రయత్నం విజయవంతం అవుతుందని శంకర్ మహదేవన్ ఆశాభావం వ్యక్తం చేశారు భారతీయ సంస్కృతి సంగీతం విశ్వవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందని అందుకు అంతర్జాతీయ గుర్తింపు రావడం అందరికీ సంతోషం అన్నారు. మెడిటేషన్ తర్వాత శంకర్ మహదేవన్ సంగీత సాంస్కృతిక కార్యక్రమం అందర్నీ అలరించింది.

భాగ్యనగరం కన్హ శాంతి వనంలో జరుగుతున్న గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవ్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మార్చ్ 15 నఅధికారికంగా ప్రారభిస్తారు. 16 తేదీన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ పాల్గొననున్నారు. రోజు నాలుగు సెషన్స్ స్పిరిచువల్ ప్లీనరీ సెషన్స్ ఉండనున్నాయి. ఈ సెక్షన్స్ లో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి సందేశం ప్రత్యేక ఆకర్షణగా ఉండనుంది.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..