AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP TET 2025 Result Date: వెబ్‌సైట్‌లో మరికొన్ని టెట్‌ ఆన్సర్‌ కీలు.. ఫలితాలు వెల్లడించేది అప్పుడే?

రాష్ట్రంలో టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌ 2025) ఆన్‌లైన్‌ రాత పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. డిసెంబర్ 21వ తేదీతో అన్ని సబ్జెక్టులకు ఆన్‌లైన్ పరీక్షలు ముగిశాయి. డిసెంబరు 10 తేదీ నుంచి మొత్తం 10 రోజుల పాటు ఈ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,71,698 మంది దరఖాస్తు చేయగా.. ఇందులో..

AP TET 2025 Result Date: వెబ్‌సైట్‌లో మరికొన్ని టెట్‌ ఆన్సర్‌ కీలు.. ఫలితాలు వెల్లడించేది అప్పుడే?
AP TET 2025 Result Date
Srilakshmi C
|

Updated on: Dec 22, 2025 | 3:24 PM

Share

అమరావతి, డిసెంబర్‌ 22: రాష్ట్రంలో టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌ 2025) ఆన్‌లైన్‌ రాత పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. డిసెంబర్ 21వ తేదీతో అన్ని సబ్జెక్టులకు ఆన్‌లైన్ పరీక్షలు ముగిశాయి. డిసెంబరు 10 తేదీ నుంచి మొత్తం 10 రోజుల పాటు ఈ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,71,698 మంది దరఖాస్తు చేయగా.. ఇందులో 2,48,427 మంది అభ్యర్ధులు పరీక్షలకు హాజరయ్యారు. అంటే మొత్తం 91.43శాతం మంది టెట్ పరీక్షలు రాశారు. ఇక మొత్తం అన్ని సెషన్లలో జరిగిన పరీక్షల ప్రాథమిక ఆన్సర్‌ కీలను విద్యాశాఖ త్వరలోనే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది. ఇప్పటికే కొన్ని సబ్జెక్టుల ఆన్సర్ కీలను వెబ్‌సైట్‌లో ఉంచింది. ఆన్సర్‌ కీలతోపాటు అభ్యర్ధుల రెస్సాన్స్ షీట్లను కూడా పొందుపరిచింది.

పరీక్షలకు హాజరైన అభ్యర్ధుల తమ వివరాలతో లాగిన్‌ అయ్యి ఆన్సర్‌ కీతోపాట రెస్సాన్స్‌షీట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చనిటెట్‌ కన్వీనర్‌ ఎం వెంకట కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. డిసెంబర్‌ 15, 16, 17, 18 తేదీల్లో జరిగిన పరీక్షల ప్రాథమిక కీ డిసెంబరు 22న విడుదలయ్యాయి. ఇక 19, 20, 21 తేదీల్లో జరిగిన పరీక్షల ప్రాథమిక కీలను డిసెంబర్ 26వ తేదీన విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ప్రాథమిక కీ పై అభ్యంతరాలను గడువు తేదీలోగా వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ విధానంలో మాత్రమే తెలియజేయాలని వెంకటకృష్ణారెడ్డి తెలిపారు.

కాగా షెడ్యూల్‌ ప్రకారం ప్రాథమిక కీ 2026 జనవరి 2 నాటికి అన్ని ఆన్సర్‌ కీలను విడుదల చేయనున్నారు. ఇక ఫైనల్‌ కీ జనవరి 13న వెల్లడించి, తుది ఫలితాలు జనవరి 19న విడుదల చేయనున్నారు. ఇక వచ్చే ఏడాది డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీచేస్తామని ఇప్పటికే కూటమి ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది 16వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసింది. ఇందులో మిగిలిన పోస్టులతోపాటు కొత్తగా ఏర్పడే ఖాళీలతో మొత్తం 2 వేల పోస్టులకు కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మరోమారు టెట్ నిర్వహించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

ఈ 6 పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిజ్‌లో ఉంచకండి..
ఈ 6 పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిజ్‌లో ఉంచకండి..
అచ్చ తెలుగమ్మాయి.. హీరోయిన్ మెటీరియల్ బాసూ.. ఎవరంటే..
అచ్చ తెలుగమ్మాయి.. హీరోయిన్ మెటీరియల్ బాసూ.. ఎవరంటే..
ఆ మెట్రో ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. టికెట్ ధరలు పెరుగుతాయా?
ఆ మెట్రో ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. టికెట్ ధరలు పెరుగుతాయా?
గాల్లోనే కుప్పకూలుతున్న పక్షులు.. రోజుకు100కుపైగా మృత్యువాత
గాల్లోనే కుప్పకూలుతున్న పక్షులు.. రోజుకు100కుపైగా మృత్యువాత
‘మన శంకర వరప్రసాద్ గారు’.. చిరు, వెంకీ, నయన్‌ల రెమ్యునరేషన్స్ ఇవే
‘మన శంకర వరప్రసాద్ గారు’.. చిరు, వెంకీ, నయన్‌ల రెమ్యునరేషన్స్ ఇవే
షట్టిల ఏకాదశినాడు చేసే ఈ తప్పులు శాపంగా మారవచ్చు! ఏం చేయాలంటే?
షట్టిల ఏకాదశినాడు చేసే ఈ తప్పులు శాపంగా మారవచ్చు! ఏం చేయాలంటే?
మన శంకర వర ప్రసాద్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుస
మన శంకర వర ప్రసాద్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుస
'ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా..
'ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా..
వేలు విరగొట్టుకున్న స్టార్ ప్లేయర్.. షాక్ తిన్న ముంబై
వేలు విరగొట్టుకున్న స్టార్ ప్లేయర్.. షాక్ తిన్న ముంబై
వాషింగ్ మెషీన్‌లో ఉన్ని స్వెటర్‌ను ఎలా ఉతకాలి? సింపుల్ టిప్స్
వాషింగ్ మెషీన్‌లో ఉన్ని స్వెటర్‌ను ఎలా ఉతకాలి? సింపుల్ టిప్స్