AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Congress: ఇప్పుడు గెలవకపోతే జీవితంలో కాంగ్రెస్ అధికారంలోకి రాదు.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు..

Konda Surekha: అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో తెలంగాణ రాజకీయం వేడెక్కుతోంది. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ దూసుకెళ్తున్నాయి. హ్యాట్రిక్ కోసం బీఆర్ఎస్ ప్రయాత్నాలు ముమ్మరం చేయగా.. ఎలాగైనా అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ కూడా అస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోన్న కాంగ్రెస్ పార్టీ..

Telangana Congress: ఇప్పుడు గెలవకపోతే జీవితంలో కాంగ్రెస్ అధికారంలోకి రాదు.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు..
Revanth Reddy Konda Surekha
Shaik Madar Saheb
|

Updated on: Sep 14, 2023 | 10:03 AM

Share

Konda Surekha: అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో తెలంగాణ రాజకీయం వేడెక్కుతోంది. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ దూసుకెళ్తున్నాయి. హ్యాట్రిక్ కోసం బీఆర్ఎస్ ప్రయాత్నాలు ముమ్మరం చేయగా.. ఎలాగైనా అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ కూడా అస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోన్న కాంగ్రెస్ పార్టీ.. త్వరలోనే అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఈ తరుణంలో తెలంగాణ కాంగ్రెస్‌లో గ్రూపు గొడవలు ముదిరి పాకానపడుతున్నాయి. ఇటు రాష్ట్ర పార్టీలో.. జిల్లా పార్టీల్లో అంతర్గత పోరు రాజుకుంటోంది.. ఎక్కడ చూసిన అసమ్మతితో, అంతర్గత పోరుతో పార్టీలోని కేడర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా హస్తం రాజకీయం మండుతోంది. ఈ తరుణంలో ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం మరింత ముదిరింది. ఇన్నాళ్లు.. రచ్చ రచ్చగా మారి.. ఏకంగా పార్టీ అధ్యక్షుడి దగ్గరికి పంచాయితీ చేరింది.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనలో పార్టీలోని అంతర్గత విబేధాలు మరోసారి బహిర్గతమయ్యాయి. రేవంత్ రెడ్డిని కలిసి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి నియోజకవర్గంలో గ్రూపులు వర్గాలు ఏర్పడి పార్టీకి నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు కొండా సురేఖ. ఎవరికి వారు తామే అభ్యర్ధులమని ప్రకటించుకుని ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారన్నారు. కర్నాటకను ఆదర్శంగా తీసుకుని అందరం పనిచేయాల్సిన అవసరం ఉందంటూ రేవంత్ కు సూచించారు. డీ.కీ శివకుమార్, సిద్దరామయ్య మధ్య విభేదాలు ఉన్నా.. కలిసి కట్టుగా పార్టీని అధికారంలోకి తెచ్చారు. అలాగే ఇక్కడ కూడా అధికారమే లక్ష్యంగా పనిచేయాలంటూ కోరారు.

ఈ సందర్భంగా టికెట్ గురించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌లో ఆసక్తికరంగా మారాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముందే తన ఆవేదన వెళ్లగక్కిన కొండా సురేఖ టికెట్ ఇస్తారా ..? లేదా అని ప్రశ్నించారు. ‘‘నాకు టికెట్ ఇస్తే ఇస్తా అనండి.. లేదంటే లేదని చెప్పండి.. స్వయం ప్రకటిత నేతలతో పార్టీకే నష్టం జరుగుతోంది.. వరంగల్ తూర్పులో నా కంటే బలమైన అభ్యర్థి ఎవరున్నారు..? నాకే ఇలాంటి ఇబ్బంది వస్తే మిగిలిన నేతల పరిస్థితి ఎంటి..? కాంగ్రెస్‌కి ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.. కానీ ఓటు వేయించుకోవడానికి నాయకులే సిద్ధంగా లేరు.. తెలంగాణలో ఇప్పుడు గెలవకపోతే.. ఇక జీవితంలో కాంగ్రెస్ అధికారంలోకి రాదు..’’ అంటూ కొండా సురేఖ స్పష్టంచేశారు.

కాగా, గ్రూపు తగాదాలతో సతమతమవుతోన్న కాంగ్రెస్ పార్టీలో కొండా సురేఖ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..