AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదిలాబాద్ రైతన్నల ‘పోలాల అమావాస్య’.. ఆదివాసీ గూడాల్లో అంబరంగ కాడెద్దుల వేడుక..

Adilabad District: కాయకష్టం చేసి ఏడాది పాటు శ్రమించి సిరుల పంటలను పండించేందుకు అన్నదాతకు నిత్య స్నేహితుడిగా నడిచే బసవన్నలను అమితంగా చూసుకునే అపురూప పండుగే పోలాల అమావాస్య. ఈ అమావాస్య రోజున జరిపే వేడుకను కాడెద్దుల వేడుక అని బసవన్నల పండుగ అని ఎడ్ల పండుగ అని పోలాల పండుగ అని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. పిలుపు ఏదైనా వేడుక మాత్రం అంతటా ఒకటే..

అదిలాబాద్ రైతన్నల ‘పోలాల అమావాస్య’.. ఆదివాసీ గూడాల్లో అంబరంగ కాడెద్దుల వేడుక..
Adilabad Polala Panduga
Naresh Gollana
| Edited By: |

Updated on: Sep 14, 2023 | 10:52 AM

Share

శ్రావణ మాసం.. నిష్టతో భక్తి శ్రద్దలతో ఒక్కపొద్దు సాగే మాసం. శ్రావణ మాసంలో ప్రతి రోజూ ప్రత్యేకమే. ప్రకృతితో మమేకమై.. ప్రకృతిలోనే సాగే అడవుల జిల్లా అదిలాబాద్‌లో అయితే ఆ సంబరం అంగ రంగ వైభగం. శ్రావణ మాస ప్రారంభం నుండి శ్రావణ మాస ముగింపు వరకు నిత్య పూజలు, కైంకర్యాలతో ఇలవేల్పులకు మొక్కుతూ సాగిస్తుంటారు ఉమ్మడి ఆదిలాబాద్ జనం. ఏటా శ్రావణ మాస ముగింపు అమావాస్యను మరింత భక్తి శ్రద్దలతో జరుపుకోవడం ఆనవాయితీ. కాయకష్టం చేసి ఏడాది పాటు శ్రమించి సిరుల పంటలను పండించేందుకు అన్నదాతకు నిత్య స్నేహితుడిగా నడిచే బసవన్నలను అమితంగా చూసుకునే అపురూప పండుగే పోలాల అమావాస్య. ఈ అమావాస్య రోజున జరిపే వేడుకను కాడెద్దుల వేడుక అని బసవన్నల పండుగ అని ఎడ్ల పండుగ అని పోలాల పండుగ అని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. పిలుపు ఏదైనా వేడుక మాత్రం అంతటా ఒకటే. నిత్య శ్రామికుడిగా సాగుతున్న రైతు నేస్తం ఎద్దును పూజించి బసవేశ్వరుడిగా కొలిచే పండుగే పొలాల అమావాస పండుగ.

శ్రావణ మాసానికి వీడ్కోలు చెప్పే అమావాస్య రోజున, తరతరాలుగా రైతులకు వెన్నుముఖగా, వ్యవసాయ పనుల్లో అన్ని కాలాల్లో అండగా నిలిస్తున్న ఎడ్ల రుణాన్ని తీర్చుకోవడానికి రైతులు ఏడాదికి ఓ‌సారి ముచ్చటగా జరుపుకునే పండుగ ఈ పోలాల అమావాస్య.  శ్రావణ బహుళ అమావాస్య నాడు ఈ పండుగను తెలంగాణలో ఘనంగా జరుపుకుంటారు. అడవుల జిల్లా ఆదిలాబాద్‌లో మరింత అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఒక్క రోజు ముందే ఎడ్లకు బరువులు దింపే కార్యక్రమం చేస్తారు. ఏడాది పొడుగునా కష్టపడే బసవన్నకు పోలాల అమావాస్య ముందు రోజు సెలవిచ్చి.. ఎలాంటి బరువులు మేపకుండా చూసుకుంటారు. అమావాస్య తెల్లవారు జామున కాడెద్దులను వాగుకు, సమీపంలోని నదికి‌ తీసుకు వెళ్లి స్నానం చేయిస్తారు రైతన్న. బొట్లతో అలంకరించి నందీశ్వరుడిగా.. బసవేశ్వరుడిగా కొలుస్తారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులతో పాటు సరిహద్దు మహరాష్ట్రలో మరాఠ సాంప్రదాయాలతో పోలాల అమావాస్యను పురన్ పోలీ పండుగగా జరుపుకుంటారు. తరతరాలుగా అన్నదాతకు అండగా నిలుస్తూ.. కష్ట సుఖాల్లో సగభాగం పంచుకుంటూ శ్రమిస్తున్న కష్టజీవులైన ఈ ఎద్దులని కుటుంబ సభ్యుడిగా బావించి జరుపుకునే పండుగే ఈ పోలాల అమావాస్య పండుగ. దుక్కుల నుండి చివరకు పంట చేతికి వచ్చే వరకు.. ఆ వచ్చిన పంటను మార్కెట్ కు చేర్చే వరకు రైతన్న బరువు బాధ్యతలు మోసే బసవుడికి ఓ రోజు సెలవు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో పెద్దలు పెట్టుకున్న ఆచారమే ఈ పోలాల పండుగ అంటారు రైతులు. ఎడ్లను ఘనంగా ముస్తాబు చేసి.. కొమ్ములకు రంగులు వేసి రంగురంగుల బట్టలతో అలంకరించి అందంగా తీర్చి దిద్ది ముస్తాబు చేయడం ఆనవాయితీ.

ఇవి కూడా చదవండి

అలా ముస్తాబు చేసిన ఎడ్లను గ్రామంలో హనుమండ్ల ఆలయానికి తీసుకొచ్చి హారతులు ఇచ్చి ప్రత్యేక పూజల జరిపించడం ఆనవాయితీ. వేద మంత్రాల నడుమ ఎద్దు లకు గోమాతకు ముచ్చటగా పెళ్ళిళ్ళు జరిపించడం కూడా ఆదివాసీ ప్రాంతాల్లో ఆనవాయితీ. ఆ తర్వాత ఆలయం చుట్టూ ఐదుసార్లు ప్రదక్షిణలు చేయిస్తారు అన్నదాతలు. అలా తెచ్చిన ఎడ్లజతలకు బొట్టు పెట్టి.. ప్రతి రైతుకు ఓ తువ్వాలతో సత్కరిస్తారు గ్రామ పెద్దలు. కాడెద్దుల సంబరాన్ని చూసేందుకు ఊరు ఊరంతా సంబరంగా హనుమండ్ల ఆలయాల వద్దకు తండోపతండాలుగా చేరుకుంటారు. ఆ వేడుక కన్నుల పండుగగా చేస్తారు గ్రామ రైతులు.

ఆదివాసీ గ్రామాల్లొల పోలాల సందర్భంగా చేసే ప్రత్యేక వంటకం పురన్ పోలీ. పురన్ పోలీ అనేది మరాఠి పదం. దీన్ని తెలుగు ప్రజలు దీనినే బూరేలు అని అంటారు. ఈ పండుగ రోజు ఎద్దుల జతలను శివుడి నందిగా భావించి నైవేద్యంగా బూరెలను పెట్టడం ఆనవాయితీ. జత ఎడ్లకు ఈ పిండి వంటలను నైవేద్యంగా పెట్టి వాటి ఆశీస్సులు తీసుకుంటారు రైతులు.

రైతన్నే కాదు.. ఆ ఇంటి ఆడపడుచులు కూడా ఈ వేడiకను సంబరంగా జరుపుకుంటారు. పోలాల అమావాస్య రోజు శివపార్వతులకు ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీ. ఈ రోజు సంతానం కోసం వ్రతాలు ఆచరించడం అనాదిగా వస్తున్న ఆచారం. శ్రావణ మాసంలో.. ప్రారంభం నుండి ముగింపు అమావాస్య వరకూ ప్రతిరోజూ పండుగ వాతవరణమే కనిపిస్తుంటుంది. ఈనెలంత సౌభాగ్యం కోసం పూజలు చేసే ఆడపడుచులు.. శ్రావణ మాస ముగింపు అమావాస్య రోజు సౌభాగ్యంతో పాటూ సంతానం కోసం కూడా పూజలు చేస్తారు. పెళ్లై సంతానం లేని వారికి పోలాల అమావాస్య ఎంత ముఖ్యమో.. సంతానం ఉన్న కుటుంబాలకు వారి యోగక్షేమాల కూడా అంతే ముఖ్యం అన్నది ఈ పోలాల పడుంగ విశిష్టత. ఇంట్లోని మనుషులే కాదు పశువులు కూడా ఇంటి కుటుంబ సభ్యులే అన్నది శ్రావణ అమావాస్య.. పోలాల పండుగ గుర్తు చేస్తుంది. ప్రకృతితో మమేకమై సాగడమే ఈ పండుగ విశిష్టత.

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్