Virat Kohli: కొలంబోలో కోహ్లీ ‘విరాట’ రూపం.. ఒక్క సెంచరీతో 11 రికార్డుల్లో స్థానం.. రన్ మెషిన్ లెక్కలివే..

Virat Kohli: భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన ఆసియా కప్ సూపర్ 4 క్లాష్‌లో బాబర్ సేనపై టీమిండియా 228 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటర్లు, బౌలర్లు కలిసి పాక్ జట్టుపై మూకుమ్మడి దాడి చేశారు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అజేయమైన 122 పరుగులతో, అంతర్జాతీయ క్రికెట్‌లో 77వ సెంచరీని నమోదు చేసుకున్నాడు. అలాగే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకోవడంతో పాటు ఏకంగా 10 రికార్డులను తిరగరాశాడు. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్ ద్వారా కోహ్లీ నెలకొల్పిన రికార్డులేమిటో ఇప్పుడు చూద్దాం..

శివలీల గోపి తుల్వా

|

Updated on: Sep 12, 2023 | 2:12 PM

1. సెంచరీ లీడర్: ఆసియా కప్‌లో భారత్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. కింగ్ కోహ్లి ఇప్పటి వరకు 4 ఆసియా కప్ సెంచరీలు చేయగా.. వాటిల్లో అతని వన్డే కెరీర్‌ బెస్ట్ స్కోర్ 183 కూడా ఉంది. ఇది పాకిస్తాన్‌పైనే నమోదు చేయడం విశేషం.

1 / 11
2. 13 వేల పరుగులు: వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 13 వేల పరుగులు చేసిన ఆటగాడిగా కింగ్ కోహ్లీ ప్రపంచ రికార్డు సృష్టించాడు. విరాట్ కేవలం 267 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించగా.. సచిన్ 13000 పరుగుల కోసం 321 వన్డే ఇన్నింగ్స్‌ తీసుకున్నాడు.

2 / 11
3. సెంచరీ స్టేడియం: ఒకే మైదానంలో వరుసగా 4 సెంచరీలు చేసిన ప్రత్యేక రికార్డు కూడా విరాట్ పేరిట నమోదయింది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస మైదానంలో ఆడిన గత 4 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ 128*(119), 131(96), 110*(116), 122* (94) సెంచరీలు సాధించాడు.

3 / 11
4. టాప్-5: వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 బ్యాట్స్‌మెన్ జాబితాలో విరాట్ కోహ్లీకి చోటు దక్కింది. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (18426 పరుగులు) అగ్రస్థానంలో ఉండగా, కింగ్ కోహ్లీ (13024) 5వ స్థానంలో నిలిచాడు. ఈ లిస్టులో కుమార సంగక్కర(14234), రికీ పాంటింగ్ (13704), సనత్ జయసూర్య (13430) వరుసగా 2, 3, 4 స్థానాల్లో ఉన్నారు.

4 / 11
5. 47వ సెంచరీ: వన్డే క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా సచిన్ అగ్రస్థానంలో ఉండగా.. రెండు సెంచరీలు తేడాతో కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. సచిన్ తన కెరీర్‌లో 49 వన్డే సెంచరీలు చేయగా.. కోహ్లీ 47 సెంచరీలు నమోదు చేశాడు.

5 / 11
6. రన్ మెషిన్: వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 8,000 నుంచి 13,000 పరుగులు చేసిన రికార్డు కూడా విరాట్ కోహ్లీ పేరిటనే ఉంది.

6 / 11
7. స్పీడ్ సెంచూరియన్: అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 77 సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ  రికార్డును నెలకొల్పాడు. సచిన్ 594 ఇన్నింగ్స్‌ల్లో 77 సెంచరీలు చేయగా.. కోహ్లీ 561 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు.

7 / 11
8. 50+ స్కోర్లు: వన్డే క్రికెట్‌లో అత్యధిక 50+ స్కోర్లు చేసిన మూడో బ్యాట్స్‌మ్యాన్‌గా కూడా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (145) అగ్రస్థానంలో ఉండగా, కుమార సంగక్కర (118) రెండో స్థానంలో ఉన్నాడు. తాజాగా పాక్‌పై 122 పరుగులు పరుగులు చేసిన విరాట్ కోహ్లీ 112వ సారి 50+ స్కోరును నమోదు చేశాడు.

8 / 11
9. 1000 పరుగులు: విరాట్ కోహ్లీ పాకిస్థాన్‌పై సెంచరీ చేయడం ద్వారా 2023లో 1000 పరుగులు పూర్తి చేశాడు. దీంతో టీమిండియా తరఫున అత్యధిక సంవత్సరాల్లో 1000 పరుగులు పూర్తి చేసిన 2వ బ్యాట్స్‌మ్యాన్‌గా నిలిచాడు. కోహ్లీ 12వ సంవత్సరం ఇలా 1000 పరుగులను చేసి రెండు స్థానంలో ఉండగా.. 16 సార్లు ఈ ఫీట్ చేసిన సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు.

9 / 11
10. సెంచరీ లీడర్: అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ప్లేయర్‌గా కోహ్లీ నిలిచాడు. 100 అంతర్జాతీయ సెంచరీలు చేసిన సంచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉండగా.. 77 సెంచరీలతో కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. అంటే సచిన్ రికార్డును బద్దలు కొట్టాలంటే కింగ్ కోహ్లీకి మరో 24 సెంచరీలు కావాలి.

10 / 11
11. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్: పాకిస్తాన్‌పై 122 పరుగులు చేసిన కింగ్ కోహ్లీ ఆసియా కప్‌లో 4వ సారి మ్యాచ్‌ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. తద్వారా అసియా కప్‌లో అత్యధికంగా మ్యాచ్‌ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను అందుకున్న భారత్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. రెండో స్థానంలో సురేష్ రైనా(3), నవజోత్ సింగ్ సిద్ధూ(3) ఉన్నారు.

11 / 11
Follow us