ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇటీవల కాలంలో ఈ-సిగరేట్ లేదా వేపింగ్ చేస్తున్న వారి సంఖ్య బాగా పెరిగిపోతోంది. ధూమపానం కంటే ఈ-సిగరెట్ అంత ప్రమాదకరం కాదని వారు చెబుతుంటారు. కానీ, పలు నివేదికలు మాత్రం ఈ-సిగరెట్లు చాలా ప్రమాదకరమని చెబుతున్నాయి. సాధారణ ధూమపానం కంటే ఆరోగ్యానికి ఎంతో నష్టం కలిగిస్తుందంటున్నాయి. తాజాగా, ఈ-సిగరెట్ ఎక్కువగా సేవించిన ఓ మహిళ ఏకంగా తన కంటి చూపునే కోల్పోయింది.

ప్రస్తుతం కాలంలో చాలా మంది సిగరెట్లు తాగుతుంటారు. అయితే, కొంతమంది దీనికి ప్రత్యామ్నాయంగా ఈ-సిగరెట్ల(vaping)ను ఎంచుకుంటున్నారు. ధూమపానం కంటే ఇది తక్కువ ప్రమాదకరమని, శరీరానికి తక్కువ హానికరమనే భావన చాలా మందిలో ఉంది. వేపింగ్ వాడటం వల్ల శరీరంపై ఎలాంటి తీవ్రమైన ప్రభావాలు ఉండవని చాలా మంది వాదిస్తుంటారు. కానీ, తాజాగా, జరిగిన ఓ ఘటన మాత్రం అవన్నీ వాస్తవాలు కాదని తేల్చింది. ఈ-సిగరెట్లు కూడా చాలా ప్రమాదకరమని రుజువు చేసింది.
ఓ మహిళ అధికంగా వేపింగ్ చేసిన కారణంగా ఆమె తన కంటి చూపును కోల్పోయింది. ఈ విషయాన్ని డాక్టర్ మేఘ కర్నావత్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. డయాబెటిస్, బీపీ వంటి వ్యాధులు లేని 40 ఏళ్ల మహిళ రాత్రిపూట అధిక మోతాదులో వేపింగ్ చేసింది. అనంతరం ఉదయం లేచిన తర్వాత ఆమె పూర్తిగా కంటి చూపును కోల్పోయిందని తెలిపింది. వేపింగ్ వల్ల ఆరోగ్యానికి కలిగే దుష్ప్రభావాలను ఆమె వివరించారు.
View this post on Instagram
వేపింగ్(ఈ-సిగరెట్) అంటే ఏమిటి, దానిలో ఏం ఉంటుంది?
వేపింగ్‌లో బీడీలు సిగరెట్లు వంటి ధూమపాన ఉత్పత్తులు ఉండవు. కానీ, ఎలక్ట్రానిక పరికరం ఉంటుంది. దీన్ని వేప్ పెన్ లేదా ఈ-సిగరెట్ అంటారు. ఈ పరికరాలు ఒక ద్రవాన్ని కలిగి ఉంటాయి. ఇది వేడి చేసినప్పుడు సూక్ష్మ కణాల పొగను సృష్టిస్తుంది. దీన్నే వారు పీల్చుకుంటారు. ఇదివారికి ధూమపానానికి సమానమైన అనుభవాన్ని ఇస్తుంది. వేపింగ్ పరికరాల్లోని ద్రవం సాధారణ నీరు కాదు.. ఇది వేడి చేసినప్పుడు ఆవిరిని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో నికోటిన్, అనేక రసాయన కణాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఏమాత్రం మంచివి కాదు. చాలా నివేదికలు సిగరెట్ల కంటే వేపింగ్ చాలా ప్రమాదకరమని స్పష్టం చేస్తున్నాయి.
వేపింగ్ వల్ల కళ్లకు ఎలా హాని కలిగిస్తుంది?
వేపింగ్ కళ్లపై తీవ్రమైన హానికరమైన ప్రభావం చూపుతుందని పలు నివేదికలు పేర్కొన్నాయి. కళ్లను రక్షించడానికి కళ్లకు కన్నీళ్లు అవసరం, ఇవి కళ్లను ఎప్పుడూ తేమగా ఉంచుతాయి. అయితే,వేపింగ్ లేదా ధూమపానం ఈ ప్రక్రియకు అంతరాయం కలిగిస్తుంది. ఇది కళ్లలో చికాకు, దురదను కలిగిస్తుంది. వేపింగ్ లేదా ధూమపానం వల్ల కళ్లలో కంటిశుక్లం ఏర్పడటం కూడా సాధారణం. ఎదుకంటే ఈ-సిగరెట్లు, ధూమపానం కళ్ల లెన్స్ ను దెబ్బతిస్తాయి. పొగ కళ్లను బలహీనపరుస్తుంది.
వేపింగ్ వల్ల వచ్చే సమస్యలు
రెటీనా ధమనిలో సంకోచం ఆప్టిక్ నరాలకు రక్త ప్రవాహం తగ్గిస్తుంది రెటీనా కణజాలాల్లో ఆక్సీకరణ ఒత్తిడి పెరుగుతుంది ముందుగా ఉన్న మైక్రోవాస్కులర్ సమస్యలు తీవ్రతరమవుతాయి ఆరోగ్యంగా ఉండి చిన్న వయస్సు అయినప్పటికీ అకస్మాత్తుగా దృష్టి కోల్పోవడం జరుగుతుందని వైద్యులు వివరించారు.