Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khammam: పదేళ్ల బాలుడి అద్భుత ప్రతిభ.. కంఠాపదంగా వేమన శతకం…అష్టావధానం…

పిల్లల లోని ప్రతిభ, సామర్థ్యాలను గుర్తించి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే అద్భుతాలను సృష్టించగలరని ఇందుకు బొర్రా మన్విత్ ఒక ఉదాహరణ అని జాతీయ అవార్డు గ్రహీత మధుసూదన రాజు అన్నారు.వేమన శతకం-పద్యాధారణ అవధాన ప్రదర్శన అనంతరం విశ్వశాంతి విద్యాలయంలో జరిగిన అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అంశాలపై మన్విత్ అనేక రికార్డులు సాధించడం గొప్ప విషయమని అన్నారు.

Khammam: పదేళ్ల బాలుడి అద్భుత ప్రతిభ.. కంఠాపదంగా వేమన శతకం...అష్టావధానం...
Khammam Boy
Follow us
N Narayana Rao

| Edited By: Jyothi Gadda

Updated on: Feb 09, 2024 | 12:09 PM

పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది’ అని పెద్దలు చెప్పిన నానుడి ఉంది. అదేవిధంగా ఒక బాలుడు తన అపూర్వ ధారణ ప్రతిభ తో ఇప్పటికే అనేక రికార్డులు సాధించాడు. పదేళ్ళ వయసు గల బొర్రా మన్విత్ మంగళవారం మరో అద్భుతమైన ప్రదర్శనతో చాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అవార్డుకు ఎంపిక అవ్వడం విశేషం. సృజన సాహితీ సమాఖ్య ఆధ్వర్యంలో వేమన శతకం పై మన్విత్ ధారణతో కూడిన అష్టావధానం చేసి రికార్డు సృష్టించాడు. సత్తుపల్లి లోని విశ్వశాంతి విద్యాలయంలో ఐదవ తరగతి చదువుతున్నాడు. మన్విత్ తండ్రి బొర్రా వెంకట్రావు న్యాయవాదిగా పనిచేస్తున్నారు. 10 ఏళ్ల మన్విత్ వేమన శతకంలోని 108 పద్యాలను అనర్గళంగా నేర్చుకున్నాడు. మన్విత్ ఎనిమిది అంశాలలో మేధావులు అడిగిన ప్రశ్నలకు తడుము కోకుండా సమాధానాలు చెప్పి చాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకు ఎంపిక అయ్యాడు.

సృజన సాహితీ సమాఖ్య ఆధ్వర్యంలో జాతీయ అవార్డు గ్రహీత మధుసూదన రాజు పర్యవేక్షణలో జరిగిన ఈ ధారణ అవధాన ప్రదర్శనలో పృచ్చకులు గా రమణమూర్తి, మల్లికార్జునరావు , కృష్ణార్జునరావు ,రామకృష్ణ ,మధుసూదన రాజు , అయ్యదేవర శేషగిరిరావు, శైలజ అడిగిన వివిధ ప్రశ్నలకు అలవోకగా సమాధానాలు చెప్పి మన్విత్ సభికులను ఆశ్చర్య చకితులను చేసాడు. కార్యక్రమ సమన్వయ కర్తగా మధుసూదన రాజు వ్యవహరించగా విశ్వశాంతి విద్యాలయ యాజమాన్యం పసుపులేటి నాగేశ్వరరావు, నరుకుళ్ళ సత్యనారాయణ , బొర్రా వెంకట్రావు పృచ్చకులను,బాల అవధానిని శాలువా జ్ఞాపికలతో సత్కరించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

పిల్లల లోని ప్రతిభ, సామర్థ్యాలను గుర్తించి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే అద్భుతాలను సృష్టించగలరని ఇందుకు బొర్రా మన్విత్ ఒక ఉదాహరణ అని జాతీయ అవార్డు గ్రహీత మధుసూదన రాజు అన్నారు.వేమన శతకం-పద్యాధారణ అవధాన ప్రదర్శన అనంతరం విశ్వశాంతి విద్యాలయంలో జరిగిన అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అంశాలపై మన్విత్ అనేక రికార్డులు సాధించడం గొప్ప విషయమని అన్నారు.కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గార్లపాటి రామకృష్ణ మాట్లాడుతూ… నేర్చుకోవాలనే తపన ఉంటే ఎన్ని విజయాలనైనా సాధించి లక్ష్యాన్ని చేరుకోవచ్చని సూచించారు. మాన్విత్ కరాటే లో 30 వరకు మెడల్స్ సాధించినట్లు శిక్షకులు పిచ్చయ్య తెలిపారు. కార్యక్రమ పర్యవేక్షణ జరిపిన పసుపులేటి నాగేశ్వరరావు మాట్లాడుతూ పిల్లల ప్రతిభకు తోడుగా తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరమని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..