Watch Video: మీ ఐక్యతకు హ్యాట్సాఫ్..! రైలుకు, ఫ్లాట్‌ఫారమ్ మధ్యలో ఇరుక్కున్న వ్యక్తిని కాపాడేందుకు వీళ్లు ఏం చేశారంటే..
అందుకే నేను ముంబైని ప్రేమిస్తున్నాను అని ఒకరు రాశారు. ఇవన్నీ ముంబైలో జరిగిన చిన్న చిన్న సంఘటనలే అని మరొకరు రాశారు. కొంతమంది సోషల్ మీడియాలో వీడియోలు చూసి ఇంతపెద్ద సాహసం చేశారు అంటుండగా, ఢిల్లీ, ముంబయి ప్రయాణీకుల మధ్య ప్రపంచం తేడా ఉందని మరొకరు రాశారు. ఢిల్లీకి చెందిన ప్రజలు పోరాటాలతో వైరల్‌గా మారారు. ముంబైకి చెందిన ప్రజలు వారి ఐక్యమత్యం వైరల్‌గా మారారని అంటున్నారు.
ముంబైలోని లోకల్ రైలును లైఫ్‌లైన్ అంటారు. ఎందుకంటే.. పెద్ద సంఖ్యలో ప్రజలు లోకల్ రైలులో ప్రయాణిస్తుంటారు. కొన్ని సంఘటనలు మినహా ఈ లోకల్ రైలులో ప్రయాణికుల ఐక్యత స్పష్టంగా కనిపిస్తుంది. అందుకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. వీడియో చూసిన ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ముంబై ప్రజల ఐక్యతను ఎంతగానో ప్రశంసిస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడ్డిట్‌లో ఈ వీడియో వైరల్ అవుతోంది. అందులో కొంతమంది వ్యక్తులు సమిష్టిగా కలిసి ఏకంగా రైలునే ఎత్తడానికి ప్రయత్నిస్తున్నారు.
వైరల్ వీడియోలో ప్రజలు రైలు ఎందుకు ఎత్తుతున్నారని చూడగా.. రైలుకు, ప్లాట్‌ఫారానికి మధ్య ఓ వ్యక్తి ఇరుక్కుపోయినట్టుగా తెలిసింది. అతన్ని రక్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే స్థానిక ప్రజలంతా కలిసి రైలును కొద్దిగా పైకి లేపాల్సి వచ్చిందన్నారు. స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ ఉంది. ప్రయాణికులందరూ రైలు నుండి కిందకు దిగారు. అందరూ కలిసి రైలును బలవంతంగా పైకి లేపడానికి ప్రయత్నించారు. అలా అందరు కలిసి రైలును అవసరమైనంత వరకు ఎత్తేశారు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, దీనిపై జనం నుంచి విశేష స్పందన వస్తోంది.
అందుకే నేను ముంబైని ప్రేమిస్తున్నాను అని ఒకరు రాశారు. ఇవన్నీ ముంబైలో జరిగిన చిన్న చిన్న సంఘటనలే అని మరొకరు రాశారు. కొంతమంది సోషల్ మీడియాలో వీడియోలు చూసి ఇంతపెద్ద సాహసం చేశారు అంటుండగా, ఢిల్లీ, ముంబయి ప్రయాణీకుల మధ్య ప్రపంచం తేడా ఉందని మరొకరు రాశారు. ఢిల్లీకి చెందిన ప్రజలు పోరాటాలతో వైరల్‌గా మారారు. ముంబైకి చెందిన ప్రజలు వారి ఐక్యమత్యం వైరల్‌గా మారారని అంటున్నారు. అందుకే ముంబయి వాసులు అంటే మనకు ఇష్టమే అని మరొకరు రాశారు.
NAVI MUMBAI | Commuters Push Train to Save Man Trapped Under Wheels At Vashi Station. The commuters at Navi Mumbai's Vashi station took a step ahead to save a man trapped beneath the wheels of a suburban train. #viralvideo #vashi #spirtofmumbai pic.twitter.com/7BKY1H08RJ
— ℝ𝕒𝕛 𝕄𝕒𝕛𝕚 (@Rajmajiofficial) February 8, 2024
ముంబైలో చాలా సమస్యలు ఉన్నప్పటికీ, ప్రజలు ఇప్పటికీ అక్కడ నివసించటం వల్ల ఏదైనా మంచే జరుగుతుందని మరొకరు వ్యాఖ్యనించారు. మరో సోషల్ మీడియా యూజర్ స్పందిస్తూ.. ముంబైలోని ప్రజలు భిన్నంగా ఉంటారని, అలాంటి వ్యక్తులు మరెక్కడా చాలా అరుదుగా కనిపిస్తారని రాశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..