వారెవ్వా.. ఈ అడవి పంది అదృష్టం మామూలుగా లేదు..! ఆ ఇంటికి కాపలా అదేనట..?

ఆస్కార్ కోసం ఇంట్లో సొంతంగా ఒక సోఫా, ప్రత్యేకించిన దిండ్లు, దుప్పట్లను కూడా ఏర్పాటు చేశారు. పెంపుడు కుక్క వలే ఆస్కార్‌ కూడా అపరిచితుల నుండి ఇంటిని కాపాడుతుంది. ఇంటి దగ్గర గుర్తుతెలియని వ్యక్తులు కనిపిస్తే నిద్రలో ఉన్న సరే పసిగట్టేస్తుందట. వెంటనే తమను అలర్ట్‌ చేస్తుందని టిఫనీ, గ్రెగొరీ దంపతులు చెప్పారు. గతంలో 700 గ్రాములున్న ఆస్కార్‌.. దాదాపు ఒక సంవత్సరంలో

వారెవ్వా.. ఈ అడవి పంది అదృష్టం మామూలుగా లేదు..! ఆ ఇంటికి కాపలా అదేనట..?
Wild Boar Pig
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 09, 2024 | 9:57 AM

మనలో చాలా మంది జంతుప్రేమికులు ఉంటారు. ప్రజల తమ ఇళ్లలో కుక్కలు, పిల్లులు, కుందేళ్లు, కోళ్లు, మేకలు, పందులు ఇలా రకరకాల జంతువులను పెంచుకుంటారు. కొందరు క్రూరమృగాలను కూడా పెంపుడు జంతువులుగా తమతో పాటే వారి ఇళ్లలోనే ప్రత్యేకించి పెంచుతుంటారు. అయితే, కొందరు షాకింగ్‌గా కొండచిలువలను పెంచుకోవటం కూడా చూశాం.. కానీ, ఎక్కడైన అడవి పందుల్ని ఇంట్లో పెంచుకోవటం ఎప్పుడైనా చూశారా..? ఇలాంటి తమ జీవనశైలితో ఇతరులను ఆశ్చర్యపరిచే వింత వ్యక్తులకు ప్రపంచంలో కొరత లేదు. బెల్జియంకు చెందిన అలాంటి జంట చేసిన విచిత్ర పనితో ప్రస్తుతం వార్తల్లో నిలిచారు.. వాలోనియా ప్రాంతానికి చెందిన టిఫనీ, గ్రెగొరీ అనే భార్యాభర్తలు అడవి పందిని తమతో పాటు పెంచుకుంటున్నారు. వారు అతనికి ఆస్కార్ అని పేరు పెట్టారు.

ఇదంతా ఏడాది క్రితం మొదలైంది. వాలోనియా ప్రాంతానికి చెందిన టిఫనీ, గ్రెగొరీ దంపతులు ఏడాది క్రితం వేటకు వెళ్లినప్పుడు..700 గ్రాముల బరువున్న అడవి పంది కనిపించిందట.. దాంతో ఆ బుల్లి పంది పిల్లను తమతో పాటే ఇంటికి తీసుకొచ్చారు. ఆ నిస్సహాయ చిన్న జీవిని అడవిలో ఒంటరిగా వదిలేయాలంటే వారికి మనసు రాలేదట. దానికి ఒక ఆసరా కల్పించాలని అనుకున్నారట.. దాంతో వారు ఆ పందిని తమతో పాటే ఇంటికి తీసుకొచ్చారు.. కానీ రోజులు గడిచేకొద్దీ ఈ జంట ఆస్కార్‌పై ప్రేమ పెంచుకున్నాయట. అలా కొంతకాలం గడిచిన తర్వాత, దాన్ని సమీపంలోని అడవిలో వదిలివేయడం అవసరమని వారు భావించారు. మనసులో బాధపడుతూనే దాన్ని దూరంగా ఉన్న జంతు సంరక్షణ సెంటర్‌లో విడిచిపెట్టారు.

ఇంతవరకు బాగానే ఉంది.. కానీ, కొన్ని రోజుల తర్వాత అది అక్కడ ఆకలితో అలమటిస్తుందని, దాన్ని వెంటనే వెనక్కి తీసుకెళ్లాలంటూ టిఫనీ, గ్రెగొరీ దంపతులకు కాల్ వచ్చింది. దాంతో వెంటనే ఆస్కార్‌ను వారు తిరిగి తమ ఇంటికి తెచ్చుసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు అది నిజంగా వారి కుటుంబంలో ఒక భాగంగా మారిందని గ్రెగొరీ చెప్పాడు. వారు ఇప్పటికీ ఆస్కార్‌ని వారి కుటుంబంలో ఒకరిగానే చూసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఆస్కార్ కోసం ఇంట్లో సొంతంగా ఒక సోఫా, ప్రత్యేకించిన దిండ్లు, దుప్పట్లను కూడా ఏర్పాటు చేశారు. పెంపుడు కుక్క వలే ఆస్కార్‌ కూడా అపరిచితుల నుండి ఇంటిని కాపాడుతుంది. ఇంటి దగ్గర గుర్తుతెలియని వ్యక్తులు కనిపిస్తే నిద్రలో ఉన్న సరే పసిగట్టేస్తుందట. వెంటనే తమను అలర్ట్‌ చేస్తుందని టిఫనీ, గ్రెగొరీ దంపతులు చెప్పారు. గతంలో 700 గ్రాములున్న ఆస్కార్‌.. దాదాపు ఒక సంవత్సరంలో 120 కిలోగ్రాములు పెరిగిందట. ఆస్కార్ ఆకలి వేస్తే.. కూరగాయలు, బ్రెడ్‌, స్వీట్స్‌ వంటి పదార్థాలతో కలిపిన 1.5 నుండి 2 కిలోల ఆహారాన్ని తింటుందని చెప్పారు. అంతేకాదు.. ఆస్కార్‌ ఒంటరిగా పడుకోవాలంటే కూడా ఉండలేదని, కాబట్టి తమతో పాటే కలిసి నిద్రపోతుందని చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..