AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oats Side Effects: ప్రతి రోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్స్ తింటున్నారా..? అయితే ఇది మీకోసమే..

కొంతమందిలో కడుపు నొప్పి, మలబద్ధకానికి దారితీస్తుంది. ఓట్స్ తినడం వల్ల కొంతమందిలో దురద, వాపు , శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి అలెర్జీ ప్రతిచర్యలు కలిగే అవకాశం ఉంది. సాధారణంగా, రోజుకు ఒక కప్పు ఓట్స్ తినడం సురక్షితం. ఓట్స్‌ను ఇతర ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలతో కలిపి తినండి. ఫైబర్, ఇతర పోషకాలను అందిస్తుంది. ఓట్స్‌ను తయారు చేసేటప్పుడు కొవ్వు లేదా చక్కెరను వేసుకోవద్దు. ఇది కేలరీల కంటెంట్‌ను పెంచుతుంది.

Oats Side Effects: ప్రతి రోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్స్ తింటున్నారా..? అయితే ఇది మీకోసమే..
Oats
Jyothi Gadda
|

Updated on: Feb 09, 2024 | 7:04 AM

Share

Oats Side Effects: ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో అధిక బరువు కూడా ఒకటి . మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. ఆ తర్వాత తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో బరువు తగ్గేందుకు రకరకాల కసరత్తులు చేస్తున్నారు. బరువు తగ్గాలనుకునే ప్రతి ఒక్కరూ తినే ఆహారాలలో ఓట్స్ ఒకటి. ఓట్స్ తింటే నిజంగా బరువు తగ్గుతారా? ఓట్స్ తింటే బరువు తగ్గుతారనేది నిజం. ఓట్స్ తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సినంత పీచు లభిస్తుంది. అంతే కాదు జీర్ణ సమస్య కూడా ఉండదు. ఇందులో ప్రొటీన్లు, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, బి, ఇ వంటి విటమిన్లు కూడా ఉంటాయి.

ఓట్స్ తినడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. ఓట్స్ పిల్లలు, పెద్దలు తినవచ్చు. అయితే కొన్ని రకాల సమస్యలతో బాధపడేవారు ఓట్స్ కు దూరంగా ఉండాలి. ఎలాంటి సమస్యలు ఉన్నవారు ఓట్స్‌కు దూరంగా ఉండాలో ఇక్కడ తెలుసుకుందాం.

* మధుమేహం ఉన్నవారు..

ఇవి కూడా చదవండి

మధుమేహం ఉన్నవారు ఓట్స్‌కు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఓట్స్‌లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అంతేకాదు ఇందులో అధిక శాతం కార్బోహైడ్రేట్లు ఉంటాయి. వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. దీంతో మధుమేహ వ్యాధిగ్రస్తులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి షుగర్ ఉన్నవారు ఓట్స్ కు దూరంగా ఉండటం మంచిది.

* బరువు పెరగడం..

అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గడానికి ఓట్స్ తీసుకుంటారు. కానీ, ఓట్స్ సరైన పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. లేదంటే బరువు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి, మీరు బరువు తగ్గాలనుకుంటే, మీ వైద్యుడిని సంప్రదించిన తర్వాత తక్కువ మొత్తంలో తీసుకోవడం మంచిది.

* అలర్జీలు..

కొంతమంది తమ శరీరానికి, చర్మానికి కొన్ని రకాల వస్తువులను ఇష్టపడరు. అలాంటి వారు ఓట్స్ చూసి తీసుకోవాలి. లేకపోతే, మీరు అలెర్జీ సమస్యలను ఎదుర్కొంటారు. ఓట్స్ తినడం వల్ల కొందరిలో దద్దుర్లు వస్తాయి. కాబట్టి అలాంటి వారు ఓట్స్‌కు దూరంగా ఉండాలి.

* కిడ్నీ సమస్యలు ఉన్నవారు..

కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా ఓట్స్‌ను చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. వీలైతే దూరంగా ఉండటం మంచిది. ఓట్స్‌లో ఫాస్పరస్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది సంతులనం నుండి ఖనిజాలను విసిరివేస్తుంది. కాబట్టి కిడ్నీ సమస్యలు పెరిగే అవకాశం ఉంది.

* జీర్ణక్రియలో ఇబ్బంది..

కొంతమంది జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారు ఓట్స్ తింటే మరిన్ని సమస్యలు ఎదురవుతాయి. ఎందుకంటే వాటిలో ప్రొటీన్లు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అవి త్వరగా జీర్ణం కావు. ఇది ఉబ్బరం, గ్యాస్, అజీర్ణానికి కారణమవుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.