Nagoba Jatara 2024 : నాగశేషుడి సిరికొండ.. మట్టికి మనిషికి బంధం కలిపే గుగ్గిల్ల సిరికుండ

ఆదివాసీ మేస్రం వంశీయుల వలే నియమ నిష్టలతో ఈ కుండలను తయారు చేస్తామని చెప్తున్నారు సిరికొండ గుగ్గిల కుమ్మరులు. మట్టితో చేసిన కుండలు నీటిని ఎంత చల్లగా ఉంచుతాయో ఆ నాగోబా దీవెనలు కూడా మా మీద అంతే చల్లగా ఉంటాయని చెప్తున్నారు. కుండల తయారీ అవకాశం ఇవ్వడంతో పాటు మేస్రం వంశీయులు తమను ప్రత్యేక అతిథిగా భావించి నాగోబా సన్నిధిలో సత్కరిస్తారని ఆనందంగా చెప్పుకొస్తున్నారు సిరికొండ గుగ్గిల వారసులు.

Nagoba Jatara 2024 : నాగశేషుడి సిరికొండ.. మట్టికి మనిషికి బంధం కలిపే గుగ్గిల్ల సిరికుండ
Nagoba Jatara
Follow us
Naresh Gollana

| Edited By: Jyothi Gadda

Updated on: Feb 08, 2024 | 1:15 PM

ఆదిలాబాద్, ఫిబ్రవరి 08; మట్టితో మనిషికి బంధాన్ని కలిపే జాతర నాగోబా. చెట్టుతో పుట్టతో రాళ్లు రప్పలతో.. గాలి నింగి నేల నీరు నిప్పు .. పంచభూతాల ఆశీర్వదంతో సాగే ఆదివాసీల జాతర నాగోబా. పుష్యమాసం వచ్చిదంటే చాలు ఆదిమగిరిజనం పులకించిపోతోంది. చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉన్న ఆదివాసీలంతా ఒక్క చోట చేరి ఐక్యతను చాటుకుంటూ కెస్లాపూర్ చేరి సంబురంగా పండుగ జరుపుకోవడం శతాబ్దాలుగా వస్తున్న ఆచారం. అయితే ఈ జాతర ఆ ఒక్క కుటుంబ సాయం లేకుంటే మాత్రం అసలు ముందుకు సాగదు. వారే సిరికొండ మండల గుగ్గిల వంశీయులు.. కుమ్మరులు. వారి చేతులతో చేసిన ఆ మట్టి కుండలతోనే మహా నైవేద్యం నాగశేషుడికి ముట్టేది. ఈ ఆచారాన్ని రెండు శతాబ్దాలకు పైగా తూచ తప్పకుండా పాటిస్తూ వస్తున్నారు మేస్రం వంశీయులు.

ఆదివాసీలు అత్యంత నియనిష్టలతో ఆరాధ్యంగా కొలిచే ఆదిలాబాద్ జిల్లా‌ ఇంద్రవెళ్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబాకు సిరికొండ మండల కుమ్మరి కుండే ప్రదానం. అభిషేకం అయినా.. నైవేద్యం సిద్ధం చేయాలన్నా.. మేస్రం వంశీయులు వంటలు చేసుకోవాలనుకున్నా గుగ్గిల వంశీయుల చేతుల్లో ప్రాణం పోసుకున్న సిరికొండ కుండలనే వినియోగిస్తారు. ఇది నిన్న మొన్నటి ఆచారం కాదు సరిగ్గా 180 ఏళ్లుగా కొనసాగుతున్న నియమ‌నిష్టల సారం.

ఏటా పుష్యమాసంలో నెలవంక కనిపించగానే నాగోబా జాతరకు సన్నాహాలు ప్రారంభిస్తారు ఆదివాసీ మేస్రం వంశీయులు. ఇందులో ముందుగా చేసే కార్యక్రమం సిరికొండకు వెళ్లి నాగోబా జాతర పూజకు అవసరమైన కుండలను తయారు చేయామని‌ సిరికొండ కుమ్మరి వారసులు గుగ్గిల వంశీయులను కోరడం. ఈ ఘట్టం పుష్య మాస అమావాస్యకు మూడు రోజుల ముందు మెస్రం వంశీయులు ఎడ్లబండ్లపై సిరికొండలోని గుగ్గిల స్వామి ఇంటికి వెళ్లి కావాల్సిన కుండల తయారీని ప్రారంభించాలని చెబుతారు. మరుసటి రోజు నుంచి ఈ ప్రక్రియ షురూ అవుతుంది. మహాజాతర ప్రారంభానికి ముందు‌ రోజు మెస్రం వంశీయులు ఎడ్లబండ్లపై సిరికొండ వెళ్లి మట్టి కుండలకు ప్రత్యేక పూజల చేసి సంప్రదాయ బద్దంగా కేస్లాపూర్‌ కు తీసుకెళ్తారు. 350 కి‌ తగ్గకుండా తీసుకెళ్లే ఈ సిరికొండ కుండల్లో ఒక్కో కుండది ఒక్కో ప్రత్యేకత.

ఇవి కూడా చదవండి

మేస్రం వంశీయులు వారం పాటు నిర్వహించే పూజలకు పెద్ద కుండలు (పెద్ద బాణాలు) 20 అవసరం పడుతాయి.. ఇందులో మెస్రం వంశీయులు తీసుకొచ్చిన గంగాజలంను నిల్వ చేస్తారు. 55 చిన్న కుండలను మర్రి చెట్ల నీడలోని కొలను నుండి జలాన్ని తీసుకొచ్చే ఉపయోగిస్తారు. 150 మట్టితో తయారు చేసిన దీపాలను నాగోబా ఆలయం చుట్టూ దేదీప్యమానంగా వెలిగే దీపాల కోసం ఉపయోగిస్తారు. రొట్టె పెంకలను సైతం మట్టితోనే తయారు చేయిస్తారు. 25 రొట్టె పెంకలను ఉపయోగించి పూజకు వచ్చే మెస్రం వంశీయులు , వృద్ధులకు రొట్టెలు తయారు చేసి ప్రసాదంగా అందజేస్తారు. అలాగే 55 కుండలు, వాటిపై పెట్టే 55 మూతలను పెద్ద కుండల్లోంచి నీటిని తీసుకునేందుకు వినియోగిస్తారు.

ఆదివాసీలు మాత్రమే చేసే నాగోబా మహా పూజలో అసలు ఆదివాసీయేతరులకు కీలక స్థానం ఎలా దక్కింది..? సిరికొండ గుగ్గిల వంశీయుల కుండలతోనే జాతర సాగాలనే నిర్ణయం ఎందుకు వచ్చిందనే కథలోకి‌ వెళ్తే… 200 ఏళ్ల క్రితం మెస్రం వంశానికి చెందిన ఓ పెద్ద మనిషికి ఒక రోజు దేవత కలలోకి వచ్చి సిరికొండ గుగ్గిల వంశీయుల తయారు చేసిన కుండలనే తన పూజకు వాడాలని చెప్పిందనే కథ ప్రచారంలో ఉంది. అప్పటి నుండి తూచ తప్పకుండా ఆదివాసీ మెస్రం వంశీయులు ఈ సిరికొండ కుండల ఆచారాన్ని పాటిస్తున్నట్టు తెలుస్తోంది. మూడు దశాబ్దాలుగా గుగ్గిల రాజన్న తయారు చేసిన కుండలను అందించేవారు. ఆయన మరణానంతరం వంశీయుడు లస్మన్న, ఆయన చనిపోయిన తర్వాత ప్రస్తుతం ఆయన కుమారుడు గుగ్గిల స్వామి కుండలను తయారు చేసి నాగోబా జాతరకు అందజేస్తున్నారు. రాత్రి మర్రి చెట్ల వద్ద సంప్రదాయ వాయిద్యాలు, కిక్రి వాయిస్తూ నాగోబా చరిత్ర, సిరికొండ మట్టి కుండల పవిత్రత గురించి మెస్రం వంశీయులు పాటలు‌పాడటం.. కథలు చెప్పడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇది మట్టికి మనిషికి‌ ఆదివాసీ సమాజానికి‌ నాగరిక సమాజానికి మద్య శతాబ్దాలు పెనవేసుకుని కొనసాగుతున్న అనుబంధం.

గిరిజన ఆదివాసుల ఆచారం ప్రకారం ప్రతి ఏడు నాగోబా జాతర సందర్భంగా ప్రత్యేక కుండలు తయారు చేసి అందించడం మా అదృష్టంగా భావిస్తున్నాం అంటూ చెప్పుకొస్తున్నారు గుగ్గిల వారసులు. నాగోబా ఆశీర్వదంతో ప్రతి ఏడు పుష్యమాసాన్ని పండుగలా జరుపుకుంటామని.. ఆదివాసీ మేస్రం వంశీయుల వలే నియమ నిష్టలతో ఈ కుండలను తయారు చేస్తామని చెప్తున్నారు సిరికొండ గుగ్గిల కుమ్మరులు. మట్టితో చేసిన కుండలు నీటిని ఎంత చల్లగా ఉంచుతాయో ఆ నాగోబా దీవెనలు కూడా మా మీద అంతే చల్లగా ఉంటాయని చెప్తున్నారు. కుండల తయారీ అవకాశం ఇవ్వడంతో పాటు మేస్రం వంశీయులు తమను ప్రత్యేక అతిథిగా భావించి నాగోబా సన్నిధిలో సత్కరిస్తారని ఆనందంగా చెప్పుకొస్తున్నారు సిరికొండ గుగ్గిల వారసులు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా