మీరు ఫిబ్రవరిలో బీచ్ వెకేషన్‌కు వెళ్లాలనుకుంటున్నారా..? ఇవి మీకు సరైన గమ్యస్థానాలు..

ఫిబ్రవరిలో చలి కాస్త తగ్గడం మొదలవుతుంది. కానీ ఈ నెలలో ప్రయాణం వేరే విషయం. కొంతమంది ఈ నెలలో బీచ్ వెకేషన్ ప్లాన్ చేస్తారు. ఎందుకంటే బీచ్‌లో ఎక్కువ చలి లేదా వేడి ఉండదు. దీనికి కారణం సముద్రమే. మీరు కూడా ఈ ఫిబ్రవరిలో బీచ్ వెకేషన్ ప్లాన్ చేస్తున్నారా? సంవత్సరంలో రెండవ నెలలో మరింత అందంగా కనిపించే అనేక బీచ్‌లు భారతదేశంలో ఉన్నాయి. మీరు కూడా ఈ ఫిబ్రవరిలో బీచ్ వెకేషన్‌కు వెళ్లాలనుకుంటున్నారా, అయితే, ఈ సమాచారం మీ కోసమే..

|

Updated on: Feb 08, 2024 | 2:03 PM

మీరూ సముద్రాన్ని ఇష్టపడే వారైతే ఆంధ్రప్రదేశ్ మొదలుకొని అండమాన్ వరకు, గోవా నుంచి కన్యాకుమారి వరకు దక్షిణ భారతదేశపు అంచులను కలిపేటువంటి అద్బుతమైన బీచ్‌లు మన దేశంలో అనేకం ఉన్నాయి. మీ బీచ్ వెకేషన్‌ను ఎంజాయ్ చేయండి.

1 / 5
వర్కలా బీచ్, కేరళ: ఇది దక్షిణ కేరళలో ఉన్న ఒక అందమైన బీచ్, దీని సహజ సౌందర్యం ఒక క్షణంలో మిమ్మల్ని  మైమరపింప జేస్తుంది. ఫిబ్రవరిలో వర్కలా సందర్శించడం ఉత్తమం. దాని చుట్టూ సాహసం, ప్రకృతి సౌందర్యం సంతరించుకుని ఉంటాయి.

2 / 5
పూరీ బీచ్, ఒడిశా: జగన్నాథుని ఆలయానికి ప్రసిద్ధి చెందిన పూరి ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. సూర్య దేవాలయానికి 35 కిలోమీటర్లు, రాజధాని భువనేశ్వర్‌కు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూరీ బీచ్‌ని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమయం దృశ్యం మనస్సును ఆకర్షిస్తుంది.

3 / 5
రాధానగర్ బీచ్, హేవ్‌లాక్ ఐలాండ్: ఆసియాలోనే అత్యుత్తమ బీచ్‌గా ప్రసిద్ధి. ఇది బంగాళాఖాతంలో విస్తరించి ఉన్న హేవ్‌లాక్ ద్వీపంలో ఉన్న అందమైన బీచ్. ఇక్కడి ప్రశాంత వాతావరణం, ప్రకృతి అందాలను చూసే వారికి ఇక్కడి నుంచి ఇంటికి తిరిగి రావాలని అనిపించదు.

4 / 5
మెరీనా బీచ్, చెన్నై: ఇది దేశంలోని ప్రసిద్ధ, అతిపెద్ద బీచ్‌ల జాబితాలో ఒకటి. ఇది చెన్నై అతిపెద్ద పర్యాటక ప్రదేశంగా పరిగణించబడుతుంది. దేశంలోనే అతి పెద్దదైన ఈ బీచ్ పొడవు దాదాపు 13 కిలోమీటర్లు. దూరంగా నీలినీళ్లు, ఆకాశం మాత్రమే కనిపిస్తే ఆ క్షణాన్ని మీరు ఎప్పటికీ మర్చిపోలేరు.

5 / 5
Follow us