Yellow Teeth: ఈ పండు తొక్కను వాడితే 2 నిమిషాల్లో ఎంత పసుపు పచ్చని దంతాలైనా.. ముత్యంలా మెరిసిపోతాయి!

ఎవరైనా సరే అందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అందమైన ముఖం, పొడువాటి జుట్టు మిలమిల మెరిసే పళ్ళు కావాలి అని కోరుకుంటూ ఉంటారు. శుభ్రమైన, మెరిసే దంతాలు మీ వ్యక్తిత్వానికి అందాన్ని ఇస్తాయి. నోటి ఆరోగ్యం మొత్తం ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. అందుకే రోజుకి రెండు సార్లు కచ్చితంగా పళ్ళను శుభ్రం చేసుకోవాలి. ఏదేమైనా మీరు ఏ పదార్థాలు తిన్నా గానీ వెంటనే నోటిని వాష్ చేసుకుంటూ ఉండాలి. అయితే పళ్ళు మిలమిల మెరవాలి అంటే కొన్ని ఇంటి చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda

|

Updated on: Feb 09, 2024 | 8:18 AM

పళ్లను పసుపు రంగులోకి మార్చే అనేక రకాల మసాలా దినుసులను ఆహార పదార్థాల్లో ఉపయోగిస్తారు. దీన్ని నివారించడానికి ప్రతి ఒక్కరూ రోజుకు రెండుసార్లు బ్రష్ చేయాలని సూచించారు. పళ్లు తోముకున్న తర్వాత కూడా చాలా మంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతుంటారు.

1 / 5
చాలా మంది పసుపు దంతాలు, పంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ.. దంతవైద్యుడిని సంప్రదిస్తుంటారు. మందులతో దంతాలను శుభ్రం చేయించుకుంటారు.. అయితే అది పదే పదే చేయడం సాధ్యం కాదు. పసుపు దంతాలను వదిలించుకోవడానికి కొన్ని సులభమైన ఇంటి నివారణలను ఉపయోగించవచ్చు.

2 / 5
బేకింగ్ సోడా, హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉపయోగించవచ్చు. 1 టీస్పూన్ బేకింగ్ సోడాను 2 టీస్పూన్ల హైడ్రోజన్ పెరాక్సైడ్ కలపండి. ఈ పేస్ట్‌తో బ్రష్ చేసిన తర్వాత మీ దంతాలు తెల్లగా మారుతాయి.

3 / 5
యాపిల్ సైడర్ వెనిగర్ పసుపు దంతాలను ప్రకాశవంతంగా మార్చడానికి ఉపయోగించవచ్చు. 1 కప్పు నీటిలో 2 టీస్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ కలపడం ద్వారా మౌత్ వాష్ చేయండి. ఈ ద్రావణాన్ని నోటి లోపల 30 సెకన్ల పాటు స్విష్ చేయండి. తర్వాత నీళ్లతో కడిగి బ్రష్ చేసుకోవాలి. దీన్ని అతిగా వాడకూడదు.

4 / 5
నిమ్మ, నారింజ, అరటి తొక్కలు కూడా దంతాల పసుపు రంగును తొలగిస్తాయి. ఈ తొక్కలను దంతాల మీద రుద్దితే పసుపు రంగు పోతుంది. ఈ పండు తొక్కను మీ దంతాల మీద 2 నిమిషాల పాటు సున్నితంగా రుద్దండి. కొంత సమయం తర్వాత బ్రష్ చేయండి.

5 / 5
Follow us